Menu

Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రముఖ బ్యాంక్‌లో 500 జాబ్స్‌కు నోటిఫికేషన్!

Praja Dhwani Desk

IDBI Jobs: బ్యాంకింగ్ రంగంలో కెరీర్ చేయాలనుకునేవారికి శుభవార్త. ఐడీబీఐ(IDBI) బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 12న ప్రారంభం కానుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత బ్యాంకు అధికారిక వెబ్సైట్ www.idbibank.in విజిట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్‌కు సంబంధించిన వివరాలను మీకు అందిస్తున్నాం.

ఐడీబీఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ రిజిస్ట్రేషన్ విండో ఫిబ్రవరి 12న అందుబాటులో ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు ఫిబ్రవరి 26, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఎగ్జామ్‌ మార్చి 17న నిర్వహిస్తారు.

ఖాళీల వివరాలు:
500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 20 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 25 ఏళ్లు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:
దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:
ఐడీబీఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్‌కు దరఖాస్తు చేసుకునే ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అదే సమయంలో ఇతర కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజును రూ.1000గా నిర్ణయించారు.

ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి:

idbibank.in అధికారిక వెబ్సైట్‌ను విజిట్ చేయండి.

➡ హోమ్ పేజీలోని కెరీర్ లింక్ పై క్లిక్ చేయండి.

➡ తరువాత కరెంట్ ఓపెనింగ్స్ పై క్లిక్ చేయండి.

➡ జామ్ 2024 రిక్రూట్మెంట్ ట్యాబ్ కింద అప్లికేషన్ లింక్పై క్లిక్ చేయండి.

➡ జిస్టర్ చేసుకుని దరఖాస్తు ప్రక్రియను కొనసాగించండి.

➡ అప్లికేషన్ ఫామ్ నింపండి.

➡ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

➡ అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.

➡ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

➡ భవిష్యత్తు రిఫరెన్స్ కొరకు ప్రింట్ అవుట్ తీసుకోండి.

Also Read: ప్రేమకు ఖరీదు! వాలెంటైన్స్ డే పేరుతో మార్కెట్లో దోపిడీ.

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *