Menu

Kumari Aunty: వ్యూస్‌ వైరస్‌.. కుమారి ఆంటి ఎపిసోడ్‌లో ఫస్ట్‌ నుంచి లాస్ట్‌ వరకు అంతా ‘అతి’!


యూట్యూబర్లతో పాటు ఏపీ రాజకీయ పార్టీలు, ఇటు తెలంగాణలో అధికార పక్షం సైతం కుమారి ఆంటీకి సోషల్‌మీడియా అంటగట్టిన స్టార్‌డమ్‌ను బాగానే యూజ్‌ చేసుకుంది.


Praja Dhwani Desk

Kumari Aunty Episode: అసలు ఎవరు ఎందుకు పాపులర్‌ అవుతున్నారో తెలియని దుస్థితి దేశంలో దాపరించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘అతి’ సంస్కృతి పెరిగిపోయింది. రీచ్‌ కోసం మీమర్స్‌ వేసే పోస్టులు రాష్ట్రంలో క్రింజ్‌ లెవల్‌ను అమాంతం పెంచేస్తున్నాయి. అప్పుడెప్పుడో బర్రెలక్క శిరీష వీడియోను వైరల్‌ చేసిన సోషల్‌మీడియా పేజీలు ఆమెను ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థిని చేసేవరకు తీసుకొచ్చాయి. సరే అది ప్రజలకు సంబంధించిన అంశం.. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు రావాలని అందరూ కోరుకుంటారు. ఈ వ్యవహారం వేరులే అని సర్థి చెప్పుకుందాం. అయితే ఈ మీమ్స్‌ రీచ్‌, యూట్యూబ్‌ వ్యూస్‌ వెర్రి ఎంతకు పెరిగిపోయిందంటే రోడ్డు సైడ్‌ మీల్స్‌ అమ్ముకునే ఓ కుటుంబాన్ని.. ఆ స్టాల్‌కు ఓనరైన ఓ మహిళను ఓవర్‌నైట్ స్టార్ చేసే అంతలా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కుమారి ఆంటి గురించే చర్చ.. ఏకంగా సీఎం రేవంత్‌ కూడా ఈ విషయంలో స్పందించారంటే అర్థం చేసుకోవచ్చు.

అవేం థంబ్‌నెయిల్సో అసలు:
ఎవడో కుమారి ఆంటి బండి దగ్గర భోజనం చేశాడు.. అది నచ్చిందని ఫేస్‌బుక్‌లో పెట్టాడు.. అలా ఒకడిని చూసి ఇంకో పేజీ వాడు అదే పెట్టారు.. రీచ్‌ బాగా వస్తుండడంతో ఈ విషయం యూట్యూబర్ల కంటపడింది. ఇంకేముంది.. అందరూ కుమారి ఆంటి స్టాల్‌ వద్దకు లగెత్తారు.. కిందమీద ఊపు కుమారి ఆంటీ తోపు అంటూ నినాదాలు కూడా చేశారు. ఇదేం పోయేకాలమో తెలియదు కానీ ఆమె నడుస్తుంటే కెమెరాలు పట్టుకోని ఆమె వెంట పరిగెత్తారు. వీడియో చూస్తుంటే ఎవరైనా సినిమా వాళ్లు వచ్చారానన్న అనుమానం కలిగింది. స్టాల్ వద్ద తినేవారి కంటే యూట్యూబ్‌ బ్యాచే ఎక్కువగా కనిపించింది. ఆమెతో పోటి పడి మరీ ఇంటర్వ్యూలు తీసుకున్నారు. అడ్డదిడ్డమైన థంబ్‌నెయిల్స్‌ పెట్టి వ్యూస్‌ క్యాష్‌ చేసుకున్నారు.


ఇక్కడ కూడా వైసీపీ వర్సెస్‌ టీడీపీ:
అలా కుమారి ఆంటి వారం రోజుల్లోనే టాక్‌ ఆఫ్‌ ది తెలుగు స్టేట్స్‌గా మారిపోయారు. ఒకరి తర్వాత ఒకరు ఇంటిర్వ్యూలకు వస్తుంటే మురిసిపోయారు. పనిలో పనిగా తనకు సొంత ఇల్లు లేదని.. ఏపీలో జగనన్న ఇచ్చిన ఇల్లే ఉందని క్యాజువల్‌గా చెప్పారు. ఇంకా వైసీపీ బ్యాచ్‌ రంగంలోకి దిగింది. ఇదేరా మా జగనన్న అంటే అంటూ పోస్టులు దర్శనమిచ్చాయి. ఇదేంటి తెలంగాణలో ఉన్న ఆవిడకి జగన్‌ ఇల్లు ఇవ్వడమేంటని ఇటు టీడీపీ ఐటీ వింగ్‌ యాక్టివిస్టులు సీన్‌లోకి దిగారు. ఇలా కుమారి ఆంటి రాజకీయంగానూ పాపులర్ అవుతున్న సమయంలో హైదరాబాద్‌ పోలీసులు బాం*బు పేల్చారు. ఆంటీ స్టాల్ వల్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుందని ఎనిమిది రోజుల పాటు షాప్‌ను క్లోజ్‌ చేయాలని ఆదేశించారు.


ఇది కాస్త ఓవర్‌ సర్:
మరోవైపు అర్థంలేని వాగుడుకు కేరాఫ్‌గా నిలిచే రాజకీయ పార్టీ సపోర్టర్లు.. పోలీసుల నిర్ణయం వెనుక రేవంత్‌రెడ్డి ఉన్నారంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఆమెకు జగనన్న ఇల్లు ఇచ్చారు కాబట్టి.. అది తట్టుకోలేక చంద్రబాబు రేవంత్‌కు ఫోన్‌ చేశారంట.. అందుకే రేవంత్‌ ఈ నిర్ణయం తీసుకోమని పోలీసులకు చెప్పారంటూ అడ్డదిడ్డంగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. అటు పోలీసుల నిర్ణయం పట్ల ప్రజలు నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఇది గమనించిన రేవంత్‌ స్టాల్‌ నిషేధం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. తమది ప్రజాపాలన అంటూ కాస్త అతిగానే రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే తానే స్వయంగా కుమారి ఆంటి దగ్గరకు వెళ్తా అని తన పీఆర్‌ఓ చేత పోస్టు పెట్టించడం రేవంత్‌ పాపులిస్ట్‌ మైండ్‌సెట్‌కు అద్దం పడుతోంది. అక్కడ కుమారి ఆంటి నిరసనలు చేయడం లేదు.. నిరాహార దీక్ష అంతకన్నా చేయడం లేదు.. నిర్ణయం వెనక్కి తీసుకున్న వరకు సరిపోయింది కానీ.. ఈ చిన్న విషయానికి ప్రజా పాలన లాంటి భారీ పదాలు ఉపయోగించడం, తానే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకోవడం విడ్డూరంగా ఉంది. మొత్తానికి యూట్యూబర్లతో పాటు ఏపీ రాజకీయ పార్టీలు, ఇటు తెలంగాణలో అధికార పక్షం సైతం కుమారి ఆంటీకి సోషల్‌మీడియా అంటగట్టిన స్టార్‌డమ్‌ను బాగానే యూజ్‌ చేసుకుంది.

Also Read: పద్మవిభూషణుడికి రాజ్యసభ సీటు అందుకేనా? బీజేపీ మదిలో ఏముంది?

 

 


Written By

1 Comment

1 Comment

  1. shubha sree says:

    I have been surfing online more than 2 hours today, yet I never found any interesting article like yours.
    It is pretty worth enough for me. In my opinion, if all website
    owners and bloggers made good content as you did, the internet will
    be much more useful than ever before.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *