అక్కడ చదువుకోవచ్చు.. ఓ కప్పు ఛాయ్ తాగుతూ ఫ్రెండ్స్‌తో డిబెట్ చేయవచ్చు.. మీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా చేసుకోవచ్చు.. అది కూడా ఫ్రీ వైఫైకి బాసూ..! లవర్స్ రావొచ్చు.. ఫ్రెండ్స్ వెళ్లవచ్చు.. ఫ్యామిలీ మీటింగ్ కూడా పెట్టుకోవచ్చు..! ఇన్ని చెబుతున్నాడంటే ఆ స్పాట్ ఏదో కానీ చాలా డబ్బులు పెడితే కానీ యాక్సెస్ ఉండదని మైండ్‌లో అనుకుంటున్నారా? అయితే మేం చెప్పేది వినండి.. ఈ పైన చెప్పిన వాటికే కాదు.. ఇంకో ఎన్నో సదుపాయాలు కలిగిన ఈ ప్లేస్‌కు వెళ్లడానికి మీ జేబులో నుంచి ఒక్క రూపాయ్ కూడా తియ్యక్కర్లేదు.. కొన్నిసార్లు కేవలం 15 రూపాయలు తీసినా సరిపోతుంది..! అవునండి..ఇది నిజం..! హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బంగ్లాల మధ్య ఉన్న లమకాన్ గురించి చెప్పాలంటే మాటలు కూడా సరిపోవు.. ఎందుకంటే పైసా ఖర్చు లేకుండా జ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే వారికి లమకాన్ కంటే బెస్ట్ ప్లేస్ హైదరాబాద్‌లో మరొకటి లేదు!
తక్కువ రెంట్‌కే ఈవెంట్లు:
డ్రామాలు, కవితలకు సంబంధించిన ప్రొగ్రెమ్‌లు, స్టాండ్-అప్ కామెడీ, ఫిల్మ్ స్క్రీనింగ్, ఎగ్జిబిషన్‌లు, ఇంటరాక్టివ్ సెషన్‌లు, వర్క్‌షాప్‌లకు లమకాన్ అడ్డా. ఒక్క మాటలో చెప్పాలంటే మీలోని దమ్మును ఇతరులకు చూపించుకునే వేదికే లమకాన్. మీకు కవితలు రాయడం బాగా వస్తే వేలు ఖర్చు పెట్టి బయట ఎక్కడో స్టేజీని కొనుక్కో అక్కర్లేదు.. మీరు ఎంతో మధురంగా పాటలు పాడ కలిగినవారైతే అవి వినిపించడానికి మీ జేబులో నుంచి భారీగా డబ్బులు తియ్యాల్సిన పని కూడా లేదు.. సమాజం కోసం సోషల్ డిబెట్లు పెట్టి ఇతరులను చైతన్య పరచాలంటే ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచించాల్సిన అవసరమే లేదు.. ఎందుకంటే ఈ ఈవెంట్లన్నీ లమకాన్‌లో చేసుకోవచ్చు.. అది కూడా అతి తక్కువ రెంట్‌కి.
లమకాన్‌ను ఎవరు నిర్మించారు:
నిజానికి లమకాన్‌లో ఉన్న సర్వీసుల్లో 90శాతం ఫ్రీ నే. కొన్ని ఈవెంట్లకు మాత్రమే మినిమల్‌గా మనీ తీసుకుంటారు. అక్కడ ఛాయ్ నుంచి సమోసల వరకు అంతా తక్కువగా దొరుకుతుంది..! ఇక లమకాన్ ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయ్ డొనేషన్ కానీ సాయం కానీ తీసుకోదు. ఆఖరికి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా పైసా ఆశించదు. లమకాన్‌ను 1972లో నిర్మించారు. ప్రముఖ హైదరాబాదీ ఆర్టిస్ట్ M. హసన్ దీన్ని నిర్మించారు. దివంగత కళాకారుడు MF హుస్సేన్‌కి ఈ హసన్ చాలా మంచి ఫ్రెండ్ కూడా. అయితే హసన్ మరణం తర్వాత 2010లో ఆయన మేనల్లుడు ఫర్హాన్, భార్య హుమేరా, స్నేహితులు, సినిమా నిర్మాత -నటుడు ఎలాహె హిప్టూలాతో కలిసి ఈ లమకాన్‌ను ఐకానిక్ కల్చలర్ సెంటర్‌గా మార్చారు.
ఎంతో క్లీన్లీ ఫుడ్:
మరో విశేషమేంటంటే లమకాన్‌లో సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతాయి. చాలా మంది సినీ రైటర్స్, జర్నలిస్టులు ఇక్కడికి వచ్చి తమ బ్రెయిన్‌కు పదును పెడుతుంటారు. ఇక్కడే స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటారు. లమకాన్ ఫ్రీ వైఫైని కూడా అందిస్తుంది. అటు లమకాన్ చాలా రుచికరమైన, పరిశుభ్రమైన, సేంద్రీయ ఆహారంతో పాటు పానీయాలను అందిస్తుంది. వారి కిచెన్ ఎంతో క్లీన్‌గా ఉంటుంది. ఆల్కహాల్, సిగరెట్ల లాంటి వాటిని అసలు అనుమతించరు. ఫిల్టర్ చేసిన వాటర్, చాయ్, కాఫీ, పాలు, లెమన్ వాటర్ లాంటివి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. బయట నుంచి తెచ్చుకునే ఆహారాన్ని లమకాన్‌లో అనుమతించరు. ఇక లమకాన్ పూర్తిగా లాభాపేక్ష లేని సంస్థ. ముఖ్యంగా కళలు, సాహిత్యం, సంగీతం, చర్చలు లాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరిగే స్పాట్. అందుకే ఇది విజ్ఞానానికి కేంద్రంగా నిలుస్తోంది. ఈ స్పాట్‌కు వెళ్లినవారు మళ్ళి వెళ్లకుండా ఉండలేరు..!
Also Read: ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా…?