Menu

Smoking Kills: ఒకరు చెబితే కాదు.. నీకు నువ్వుగా మానేయాలి.. లేదంటే జీవితం బొక్కైపోదును!

Mahalakshmi Kallepalli 7 months ago
how smoking is dangerous to health

సిగరెట్ స్మోకింగ్.. ఇప్పుడు ఎక్కడ చుసినా ఇదే…! కాలేజీకి వెళ్లే పిల్లాడు నుంచి 60ఏళ్ల వయసువాళ్ళ వరకు ఎవరు చుసినా ఈ స్మోకింగ్‌కి చాలా అడిక్ట్ అవుతున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుంది ?? కొంతమంది స్ట్రెస్ అంటారు.. మరికొంతమంది ఇష్టం అంటారు.. కొంతమంది స్మోక్ చేస్తే హాయిగా ఫీల్ అవుతారు.. కొంతమంది కాల్చకూడదనుకున్నా స్మోక్ చేయడానికి పార్టనర్ ఉంటే ఉఫ్‌..ఉఫ్‌ అని ఊదేస్తారు. ఇంత అడిక్షన్ దేనికి? మరికొంతమంది టీ తాగుతూ స్మోక్ , టిఫిన్ అయ్యాక స్మోక్ , లంచ్ అయ్యాక స్మోక్, రోజుకి పెట్టెలు పెట్టెలు కాల్చేవారు కూడా చాలా మంది ఉన్నారు. కలుస్తున్న ప్రతి సారి అది మన బాడీని మెల్లమెల్లగా నాశనం చేస్తుంది అని తెలుసు. వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు కూడా వారు గమనిస్తారు. అయినా సరే కాల్చడం మాత్రం మనలేరు. హెల్త్ ప్రాబ్లెమ్స్‌ ఫేస్ చేస్తారు అయినా సరే కాల్చడం మనలేరు.. దేనికి మనలేరు? అది వాళ్ళకి తెలియదు.

తెలిసితెలిసి ఎందుకు చేస్తున్నారు?

చాలా మంది చెప్తూ ఉంటారు.. స్మోకింగ్ చాలా డేంజర్ అని.. సోషమీడియాలో కూడా చూస్తూ ఉంటారు స్మోకింగ్ వల్ల ఏం అవుతుందో అని.. ఎలా మానేయాలా అని చాలామంది అనుకుంటారు. దానికి చాలా మార్గాలున్నాయ్. కొంతమంది ట్రై చేసి ఆ వ్యసనాన్ని ఆపేసుకున్నారు. మరి కొంతమంది.. ఎన్ని చేసినా మానేయలేరు అనిపిస్తుంది ఉంటుంది. ఎందుకు ఇంత అడిక్ట్ అయ్యాను అని ఫీల్ అవుతారు. సడన్‌గా చనిపోవటంవేరు,, ఏ యాక్సిడెంట్‌లోనో పోవడం వేరు. కానీ స్మోకింగ్ అన్నది మనం తెలిసితెలిసి చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఏం అవుతుందో మనకే తెలీదు. ఎన్నాళ్లు బతుకుతామో తెలియదు. బాధ్యతలని పట్టించుకోకుండా లైఫ్‌స్పాన్‌ను తగ్గించుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటారు ???

మీకూ ఇలానే అనిపిస్తుందా?

అందుకే ముందు మానేయాలి అని గట్టిగా అనుకోండి. Distraction వచ్చేలా ఎదో ఒక పని చేయండి. మనకి ఒక ఫ్యామిలీ ఉంది అని..మీ ఫ్యామిలీని గుర్తు తెచ్చుకోండి. ఈ మాటలకి మీరు మారిపోవాలని చెప్పడంలేదు. చదివిన తర్వాత మీకు కూడా ఇలా అనిపించి ఉండదా అని మీరు ఫీల్ అవుతారు. మనలాగా స్ట్రగుల్‌ అయ్యేవాళ్లు ఇది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరి కోసమో కాదు మీ కోసం మీరే మానేయండి. హెల్దీగా, హ్యాపీగా ఉండాలి.. నచ్చితే ఆలోచించండి మళ్లి మరో ఆర్టికల్‌లో కలుద్దాం మరి.. ఉంటా బాయ్!

ALSO READ: పెళ్లి అవసరమా? ఈ సామెతలు కనిపెట్టిన సన్నాసులు ఎవరు?


Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *