Menu

Helium Discovery: గుంటూరులో గ్రహణం ఒక కొత్త ఆవిష్కరణకు ఎలా దారి తీసింది? అసలు దీని వెనుక కథ ఏంటి??

Sumanth Thummala
helium invention in guntur

బర్త్ డే పార్టీ వేడుకల్లో,ఇతర సందర్భాల్లో ఎగరేసే బెలూన్లు.. ఎంఆర్ఐ మెషిన్ ల కు ఒక సంబంధం ఉంది. అదేంటో కాదు.. హీలియం గ్యాస్.

అయితే ఈ హీలియం కి గుంటూరు కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా?!! చాలా పెద్ద సంబంధమే ఉంది.

హీలియం అటామిక్ మాస్ 4.002602 u.. పిరియాడిక్ టేబుల్ లో ఇది రెండో స్థానంలో ఉంటుంది.

వివరాల్లోకి వెళ్తే అది 1868 ఆగస్ట్ 18, సంపూర్ణ సూర్యగ్రహణం. ఎంతోమంది ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలు సూర్యుడి ఉపరితలం మీద ఏముందని తెలుసుకోవడానికి ఈ సమయం కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లలో ఒకరు పియర్ జాన్సెన్. ఈయన ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త.

solar eclipse helium gas

సూర్యగ్రహణం (File)

ఫ్రాన్స్ నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈయన గుంటూరు కి చేరుకున్నారు. ముందుగా తీర ప్రాంతం అయిన మచిలీపట్నంలో పరిశోధన చేద్దాం అనుకున్న మబ్బులు కమ్ముకుంటాయేమో అని తన మకాం గుంటూరులోని ఒక ఎత్తైన ఫ్రెంచ్ వ్యాపారి భవనాన్ని ఎంచుకొని అక్కడ నుంచి ప్రయోగాలు మొదలుపెట్టాడు.

మబ్బులు తొలగి గ్రహణం కళ్ళ ముందు ఉన్న వేళ, జాన్సెన్ తన స్పెక్ట్రోస్కోప్ తో సూర్యుడి ఉపరితలం అయిన కరోనాను గమనించడం మొదలు పెట్టాడు. అలా గమనిస్తున్న సమయంలో ముదురు పసుపు రంగులో గీతలు కనిపించాయి. అప్పటికి ఇది మునుపెన్నడూ ఎవరూ చూసినట్టు దాఖలాలు లేవు. అది ఎంత ప్రకాశవంతంగా ఉంది అంటే, సూర్యగ్రహణం అవసరం లేకుండా సరైన పరికరాలు ఉంటే కూడా చూడొచ్చు అనుకున్నాడు. అలా స్పెక్ట్రోహీలియోస్కోప్ అనే సూర్యుడి వేవ్ లెంగ్త్ ని గమనించడానికి ఉపయోగపడుతుంది.

periodic table helium

పీరియాడిక్ టేబుల్ (File)

అయితే అదే సంవత్సరం.. 5,000 మైళ్ళ దూరంలో లండన్ లో అక్టోబర్ 20 ఇంగ్లీష్ ఖగోళ శాస్త్రవేత్త జోసెఫ్ నార్మన్ లాక్యర్ కూడా అదే కనుగొన్నాడు. అది భూమి మీద ఉండే మూలకం కాదు సూర్యుడి మీద ఉండొచ్చు అని అనుకొని దానికి “హీలియం” అని నార్మన్ పేరు పెట్టాడు. ‘గ్రీకు భాషలో హీలియో అంటే సూర్యుడు, అని అర్థం.
వీరిద్దరూ ఒకే సమయానికి వాళ్ళ ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కి పంపారు.‌ దాంతో అకాడమీ వాళ్ళు ఇద్దరికీ క్రెడిట్ ఇచ్చారు.
అయితే వీరిద్దరి ప్రతిపాదనను చాలామంది నమ్మలేదు. ఎందుకంటే ఆ తర్వాత జరిగిన పరిశోధనల్లో ఆ మూలకం భూమి మీద ఎక్కడా కనిపించలేదు. ఆ ముదురు పసుపు గీతలు హైడ్రోజన్ వల్లే అని భావించారు.

1895 లో విలియం రామ్సే అనే స్కాటిష్ రసాయన శాస్త్రవేత్త యురేనియం నుండి ఒక ఇనార్ట్ గ్యాస్ ని వేరు చేశాడు. దీని వేవ్ లెంత్ సూర్యుడు మీద జాన్సన్, నార్మన్ లాక్యర్ గుర్తించిన కొత్త మూలకం తో సరిపోతుంది అని నిర్ధారించుకున్నాడు. అలా హీలియం పీరియాడిక్ టేబుల్ లో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత ఇనర్ట్ గ్యాస్ లను కనుగొన్నందుకు నోబెల్ బహుమతిని 1904 లో అందుకున్నాడు.

ఆ తర్వాత కొన్నాళ్లకు హీలియం మూలకం మీద మొట్టమొదట పరిశోధనల గురించి తెలిసిన విషయం ఏంటంటే, 1868 ఆగస్ట్ 18 న పియరీ జాన్సెన్ ఏ కాదు.. మచిలీపట్నం కేంద్రంగా నార్మన్ రాబర్ట్ పోగ్సన్ అనే శాస్త్రవేత్త కాంతి స్పెక్ట్రం లో కొత్త గీతల గురించి రిపోర్ట్ రాశారు. ఈ విషయాన్ని 1895లో నార్మన్ లాక్యర్ “నేచర్” సైన్స్ జర్నల్ లో ఈ విషయం రాశారు. కాకపోతే కొన్ని కారణాలవల్ల పోగ్సన్ రిపోర్ట్ ఎక్కడ ప్రచురితం కాలేదు.

ఏంటి ఈ హీలియం తో ఉపయోగాలు?!

హీలియం(Helium)ను ఎమ్ఆర్ఐ,ఎన్ఎంఆర్ స్పెక్ట్రోమీటర్ లో ఉండే సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్ల చల్లదనం కోసం వాడుతుంటారు. సాటిలైట్లలోని పరికరాలను చల్లగా ఉంచడానికి కూడా వాడుతుంటారు. హీలియం గ్యాస్ వేటితోను ప్రతిస్పందించని గుణం ఉండటం వల్ల వాటిని ఫైబర్ ఆప్టిక్స్, సెమి కండక్టర్స్.. కార్లలోని ఏసీల్లో లీక్ ల కోసం,
అలానే స్కూబా డైవర్స్ వాడే గాలి లో కూడా 80% హీలియం, 20% ఆక్సిజన్ ఉంటుంది. ఇక బెలూన్లు లో హీలియం నింపడం గురించి మనకు తెలిసిందే.

ఇది గుంటూరులో పుట్టిన ప్రపంచమంతా ఉపయోగిస్తున్న ఒక మూలకం కథ.

Also Read: అత్యాచారాలకు ఉరే సరా? మరణశిక్షతో అఘాయిత్యాలను ఆపగలమా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *