అమాయకులను చంపుతారు.. బలవంతపు మతమార్పిడులు చేస్తారు.. మహిళల చేతులు కాళ్లు కట్టేసి అత్యాచారాలు చేస్తారు… చిన్నారులను కిడ్నాప్ చేసి లైంగికంగా వేధిస్తారు.. వారికి మనిషి ప్రాణం అంటే లెక్కే ఉండదు.. మానవ హక్కుల మాటే ఎరుగరు.. అలాంటి క్రూరాతిక్రూరమైన ఆలోచనలు కలిగిన ఐసిస్ ఉగ్రభూతం మరోసారి ప్రపంచంపై విరుచుకుపడనుందా? అమెరికా న్యూ ఓర్లీన్స్ దాడే దీనికి ప్రత్యక్ష సాక్ష్యమా? అసలేంటి ఐసిస్? కొన్ని నమ్మలేని వాస్తవాలు చెప్పబోతున్నా..! అసలు ఐసిస్ ఆవిర్భవానికి అమెరికా పరోక్షంగా ఎలా కారణమైంది?
ప్రవక్త కోసం…
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా.. దీన్నే ISIS, ఐసిస్ అని పిలుస్తారు. ఇది ఒక సలఫీ-జిహాదీ ఉగ్రవాద సంస్థ. సలఫీ అంటే ఇస్లామ్ ప్రవక్త, ఆయన అనుచరుల ఆలోచనలను పాటించేవారని అర్థం. ఇస్లామ్ సంప్రదాయాన్ని కాపాడలని ఉద్యమించే ఒక సున్నీ గ్రూప్ అని చెప్పవచ్చు. 2004లో అబూ ముసాబ్ అల్-జర్కావీ నేతృత్వంలో ఇది అల్-ఖైదాతో కలిసింది. 2010లో సిరియాలో తన కార్యకలాపాలను విస్తరించింది. 2014లో ఇది సిరియా, ఇరాక్‌లలో విస్తారమైన భూభాగాన్ని ఆక్రమించింది. అప్పటినుంచి ఇది ISISగా మారింది. అంతకముందు కేవలం ఇస్లామిక్ స్టేట్ అని పిలిచేవారు. సిరియా, ఇరాక్‌లో భూభాగాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న తర్వాత ఇది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాగా మారింది.
రక్తపాతం సృష్టించిన సంస్థ
2014 నుంచి ఐసిస్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దాడులు చేసింది. ఇరాక్, సిరియా, ఫ్రాన్స్, టర్కీ, రష్యా, అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఈ సంస్థ వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. అమెరికాపైనా పలు సందర్భాల్లో దాడులు చేసింది. 2015లో పారిస్‌పై ఐసిస్ జరిపిన దాడుల్లో 130మంది మరణించారు. 2016 బ్రస్సెల్స్ బాంబు దాడులలో 32 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇక 2019లో శ్రీలంకలో జరిగిన ఈస్టర్ దాడులు ప్రపంచాన్ని కుదిపేశాయి. ఈ ఘటనలో 250 మంది అమాయకులు చనిపోవడం అత్యంత విషాదకరం. ఈ ఉగ్రవాద దాడి శ్రీలంక పర్యాటక రంగాన్ని,ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టింది. అటు 2016లో అమెరికా ఒర్లాండో నైట్‌క్లబ్‌పై ఐసిస్ జరిపిన దాడుల్లో 49 మంది చనిపోయారు. ఇక 2015లో సాన్ బెర్నార్డినోపై దాడి ఘటన కూడా ఐసిస్ పనే. ఇప్పుడు న్యూ ఓర్లీన్స్ దాడి కూడా ఇదే జాబితాలో చేరింది. ఇలా పలు సందర్భాల్లో అగ్రరాజ్యంపైనా కత్తులు దూసింది ఐసిస్. నిజానికి ఐసిస్ ప్రధాన శత్రువు అమెరికానే!
ఉగ్రవాదులను మట్టుబెట్టిన అమెరికా
2019లో అమెరికా ఐసిస్‌ను మట్టికరిపించింది. అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ బలగాలు సిరియా, ఇరాక్‌లలో ఐసిస్‌ను ఢీకొట్టిన రోజులవి. 2014లో ఐసిస్ ఇరాక్, సిరియా దేశాల్లో చాలా భూభాగాన్ని ఆక్రమించిందని ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ ప్రాంతాల్లో ప్రజలపై హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న ఐసిస్‌ను అంతమొందించాలనే లక్ష్యంతో అమెరికా, దాని మిత్రదేశాల బలగాలు కలిసి ఈ ఉగ్రసంస్థపై భారీ సైనిక దాడులు చేశాయి. ఆ దాడుల్లో ఎన్నో ఐసిస్ బలగాలను చంపడంతోపాటు, వారి ముఖ్యమైన నగరాలు తిరిగి స్వాధీనం చేసుకుంది అమెరికా. ఇక 2019లో ఐసిస్‌ను చావు దెబ్బకొట్టింది అమెరికా. ఐసిస్ కంచుకోట అయిన బాఘుజ్‌పై దాడులు చేసింది. బాఘుజ్ అనేది సిరియాలోని ఒక గ్రామం. ఆ గ్రామంపై దండెత్తిన అమెరికా బలగాలు అక్కడి ప్రజలను ఐసిస్ నుంచి విముక్తి చేశాయి. అదే సమయంలో ఐసిస్ అధినేత అబూ బకర్ అల్-బగ్దాది(Abu Bakr al-Baghdadi) అమెరికా సైనిక దాడుల్లో హతమయ్యాడు. ఇది ఐసిస్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. 2014-2019వరకు సిరియా, ఇరాక్‌లో వేలాది మంది సామాన్యుల మరణాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన ఐసిస్ అప్పటి నుంచి వెనకబడింది. అయితే తన ఉనికిని కాపాడుకునేందుకు ఐసిస్ ఓ మార్గాన్ని ఎంచుకుంది! అదేంటో తెలుసా..?? సోషల్‌మీడియా…! అవును..! సోషల్‌మీడియా ద్వారానే ఐసిస్ తన సైనిక శక్తిని పెంచుకుంటూ వస్తోంది. యువతను టార్గెట్‌గా చేసుకోని తమ సిద్ధాంతాలను సోషల్‌మీడియా ద్వారా రుద్దుతుంది ఐసిస్. ఇలా ఈ ఉగ్రసంస్థకు రిక్రూట్‌మెంట్లు మాత్రం ఆగలేదు. ఈ క్రమంలోనే అమెరికాపైనా దాడులకు తెగబడుతోంది ఐసిస్. అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవడమే ఐసిస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దీనికి 2019 నాటి దాడులు కారణం అనుకుంటే మీరు పొరపడినట్టే.. అసలు కథ వేరే ఉంది..!
అసలు అమెరికా ఎందుకు యుద్ధం చేసినట్టు?
2001 తర్వాత అమెరికా చేసిన యుద్ధాలు, దౌత్యపరమైన అంశాలు ఈ ఉగ్రవాద సంస్థ ఎదుగుదలకు పరోక్షంగా కారణమయ్యాయని చెబుతారు విశ్లేషకులు. 2003లో నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ W బుష్ నేతృత్వంలో ఇరాక్‌పై యుద్ధానికి దిగింది. ఇరాక్ రసాయన ఆయుధాలను దాచుకుందని.. ఆ దేశం అల్‌ఖైదా ఉగ్రవాది ఉసామా బిన్ లాడెన్‌కు సహాయపడుతుందని అమెరికా ఈ వార్‌కు దిగింది. ఇరాన్‌లో ‘weapons of mass destruction’ ఉన్నాయన్నది నాటి అమెరికా ప్రధాన వాదన. దీని కారణంగానే ఇరాక్‌పై దాడులు చేస్తున్నామని చెప్పిన అమెరికా ఆ దేశాన్ని ఓడించింది. 2003 డిసెంబర్‌లో నాటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను అమెరికా దళాలు పట్టుకున్నాయి. ఇక 1982లో ద్విజైల్‌లో షియా ముస్లింలను ఊచకోత కోసిన నేరంతో ఆయన్ను 2006 నవంబర్‌లో కోర్టు దోషీగా తేల్చి మరణ శిక్ష విధించింది. 2006 డిసెంబర్ 30న ఆయన్ను ఉరివేశారు. ఈ ఘటన తర్వాత కేవలం సద్దాం చాప్టెర్ మాత్రమే ముగిసిపోలేదు. అక్కడి సున్నీ ముస్లింలు రాజకీయ అధికారాన్ని కోల్పోయారు. అమెరికా మద్దతు పొందిన షియా ప్రభుత్వాలు సున్నీలను దూరంగా ఉంచి అధికారాన్ని పొందాయి. ఇక ఆ తర్వాత తేలిన విషయం ఏంటంటే అసలు అమెరికా ఇరాక్‌పై యుద్ధం చేయడానికి కారణమైన రసాయన ఆయుధాలు ఇరాక్‌లో లేనేలేవని..! ‘weapons of mass destruction’ అని ఏ ఆయుధాలను అయితే ఇరాక్‌లో ఉన్నాయని అమెరికా చెప్పిందో ఆ వెపన్స్‌ను ఇరాక్ 1990 దశకంలోనే నిర్వీర్యం చేసిందని తేలింది. మరి అమెరికా ఎందుకు ఇరాక్‌పై యుద్ధానికి దిగినట్టు? ఏమో.. ఇప్పటివరకు నాటి ప్రెసిడెంట్ బుష్ కానీ ఆ తర్వాత వచ్చిన అమెరికా అధ్యక్షులు కానీ దీనిపై కనీస ప్రకటన కూడా చేయలేదు. అటు ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తి, ఆవేశాలతో రిగిలిన సున్నీ సమూహాలు ఉగ్రవాద గ్రూపుల్లో చేరాయి. అక్కడ నుంచి ఏం జరిగిందో.. ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాయి..! ఇక ఈ అంశంపై మీరేం అంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి!
ఇది కూడా చదవండి: నిలువెల్లా విషం నిండిన తేలు ‘ఇజ్రాయెల్..’ మరోసారి బరితెగించిన బెంజమిన్ బలగాలు!

USA WEAPONS: అమెరికా రాజకీయాల నీడలో నలిగిన మరో దేశం.. ఇది చాలా దారుణం!
Balochistan: బలూచిస్థాన్ రక్తపాతం.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. అసల కథేంటి?
Jeffrey Epstein Files: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్.. కొత్త లీక్‌లో బయటపడిన సంచలన విషయాలు..!
Donald Trump Tariffs: ట్రంప్ తలతిక్క పనులు.. అమెరికాకే ఎసరు..ఈ లెక్కలే సాక్ష్యం!
Syria Blas*t: మసీద్‌లో భారీ పేలుడు.. ప్రార్థన సమయంలో జరిగిన రక్తపాతానికి కారణం ఎవరు?
Social Media Vetting: స్వేచ్ఛకు సంకెళ్లు.. సోషల్‌మీడియా పోస్టులను చెక్ చేస్తున్న ట్రంప్.. నెక్ట్స్ ఏం జరగనుంది?