Menu

Monarch Modi Part 3: రూల్స్‌ అనామకులకేనా? పెద్దాయనకు వర్తించవా? ఏంటీ వివక్ష?

Tri Ten B
By now, leaders of the ruling Bharatiya Janata Party have made a habit of asking for votes in the name of religion, notwithstanding the fact that the law does not allow such practices.

చట్టం ముందు ఎవరైనా సమానమేనన్నది సినిమాలో డైలాగు మాత్రమే. నిజానికి సినిమాలో కూడా హీరోకు ఒక రూల్‌ విలన్‌కు ఒక రూల్‌ ఉంటుంది. హీరో ఎంతమందిని చంపినా అది దుష్టశిక్షణ కిందే వస్తుంది. విలన్‌ ఒకరిని చంపినా అది కరుడుకట్టిన నేరమే. ఇదంతా సినిమాలోనే జరగదు.. రాజకీయాల్లోనూ జరుగుతుంటుంది. మన దేశానికి ప్రధానమంత్రి ఓ హీరో..! ఆయన ఏం చేసినా చెల్లుతుంది. ఆయనకు రూల్స్‌ వర్తించవు.. ఆయన చట్టానికి అతీతుడు. ‘ధర్మం’ కోసమే పుట్టిన పరుశురాముడు. అందుకే ఆయన ఎన్నికల కోడ్‌ తల నరికినా ఎవరూ ప్రశ్నించరు. అందరూ చూసిచూడనట్టు నటిస్తారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే నోటిసులు పంపి.. అవసరం అనుకుంటే చివాట్లు పెట్టే భారత్‌ ఎన్నికల కమిషన్‌ మోదీగారి విషయంలో మాత్రం ఉదాసీనత చూపిస్తుంటుంది. అసలు ఎన్నికల కమిషన్‌ స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థా లేదా కేంద్రానికి చెందిన వ్యవస్థో అర్థంకాని దుస్థితి దాపరించిన సందర్భాలు అనేకం.

దేవుడు పేరిట ఓట్లు:
దేశంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి నాలుగు రోజులు దాటింది..ఈ నాలుగు రోజుల్లో మోదీ IAF ఛాపర్‌ వేసుకోని ఏపీలో ల్యాండ్‌ అయ్యారు. ఇండయన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఛాపర్‌తో మోదీ ఎందుకు వచ్చారో ఇప్పటివరకు ఆన్సర్‌ లేదు. ఇటు వాట్సాప్‌ మెసేజీల్లో విక్సిత్‌ భారత్‌ పేరుతో సందేశాలు వస్తున్నాయి. అందులో మోదీ చేసిన గొప్ప గొప్ప పనుల గురించి డేటా ఉంది. ఇలా దేశంలోని అందరి నంబర్లకు మెసేజీలు వస్తున్నాయి. ఇది కూడా ఎన్నికల కోడ్‌ మొదలైన తర్వాత జరిగిన పరిణామామే. అటు దేవుడు పేరిట ఓట్లు అడగడం కూడా మోదీ ట్రేడ్‌ మార్క్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే. గతంలో అనేకసార్లు దేవుడు పేరు చెప్పి ఓట్లు అడిగిన మహాపురుషుడు మోదీజీ.

ఈ మౌనం ఇంకెన్నాళ్లో:
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బజరంగ్‌ బలి పాలిటిక్స్‌ను మోదీ స్వయంగా ఎండోర్స్‌ చేశారు. సభల్లో, ర్యాల్లీల్లో బజరంగ బలీ నినాదాలు చేశారు.. ప్రజలచేత చేయించారు. ఇదంతా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే. మతం పేరిట ఓట్లు అడగడం కోడ్‌ ఉల్లంఘన కిందకే వచ్చినా ఎన్నికల కమిషన్‌ మాత్రం ఏం మాట్లాడదు. ఎందుకంటే మోదీ హీరో.. ఆయన ఏం చేసినా కరెక్టే. 2019లో పుల్వామా సైనిక మరణాలను ఎన్నికల ప్రచారంలో వాడుకున్న మోదీపై ఈసీకి ఫిర్యాదు చేస్తే.. అసలు ఇది ఎన్నికల ఉల్లంఘన కిందకే రాదని చెప్పుకొచ్చింది. ఇలా మోదీ ఏం చేసినా చెల్లుతుంది. రాజకీయపరంగా, పదవుల పరంగా ప్రధాని కంటే తక్కువ స్థాయిలో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే ఆఘామేఘాలపై నోటిసులు పంపే భారత్‌ ఎన్నికల కమిషన్‌ మోదీ విషయాన్ని మాత్రం పట్టించుకోదు.

Also Read: మణిపూర్‌ అల్లర్లను ఆపలేదు కానీ.. యుక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపారట! ఆ యాడ్‌ను ఏం ముఖం పెట్టుకోని తీశారు భయ్యా!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *