Menu

Laptop: లక్షలు పోసి ల్యాప్‌టాప్‌ కొన్నాడు.. బాక్స్‌ ఓపెన్‌ చేస్తే ఫ్యూజులౌట్.. ఏం జరిగిందంటే?


ఆన్‌లైన్‌లో ఆర్డర్లను డెలవరీ అయిన వెంటనే చెక్‌ చేసుకోవాలి.. లేకపోతే మీ ఫ్యూజులౌట్‌ అయ్యే ప్రమదం ఉంది.


Sumanth Thummala

మనం ఆన్లైన్ లో అనేక ఎలక్ట్రానిక్ వస్తువులను కొంటుంటాం. తక్కువలో వస్తుందనో, అనేక రకాల ఆప్షన్స్ ఉంటాయని, ఇంట్లో కూర్చుని ఎటు పోకుండా కొనవచ్చు అని ఇలా రకరకాల కారణాలతో వీటిలో కొంటుంటాం. అలానే మధ్యప్రదేశ్ కు చెందిన ఒక యువకుడు కూడా ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ లో ₹1.13 లక్షల విలువగల ల్యాప్‌టాప్ ను ఆర్డర్ చేశాడు. అది కొన్ని రోజుల తర్వాత డెలివరీ అందుకున్నాడు. డెలివరీ బాయ్ చేత తను ఆ ప్యాకేజ్ ని ఓపెన్ చేయించాడు. తను తను వీడియో తీస్తూ డెలివరీ ఓపెన్ చేసి చూసి ఒకసారిగా షాక్ అయ్యాడు. తను ఆర్డర్ చేసిన “ఆసుస్ “కంపెనీ ల్యాప్‌టాప్ కాకుండా వేరే ఏదో కంపెనీ ల్యాప్‌టాప్ వచ్చింది. అది కూడా పాత వాడిన ల్యాప్‌టాప్ వచ్చింది. తను సామాజిక మాధ్యమం “ఎక్స్ “(ట్విట్టర్)లో పోస్ట్ చేసాడు.

“ఈ రిపబ్లిక్ డే సేల్‌లో నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి సరికొత్త Asusల్యాప్‌టాప్‌ని ఆర్డర్ చేసాను. నేను కొన్ని పాత విస్మరించిన ల్యాప్‌టాప్‌ని అందుకున్నాను. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఆర్డర్ చేసిన ఉత్పత్తులను ఎప్పుడూ విశ్వసించవద్దు, ”అని X వినియోగదారు సౌరో ముఖర్జీ X లో అన్‌బాక్సింగ్ వీడియోను షేర్ చేస్తూ రాశారు.
ఆ తర్వాత ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సౌరో ముఖర్జీ X.లో వీడియోను షేర్ చేసిన తర్వాత సమస్యను పరిష్కరిస్తామని ఫ్లిప్‌కార్ట్ హామీ ఇచ్చింది.

టెక్ ఎక్స్పర్ట్ లు, సైబర్ క్రైమ్ పోలీసులు కూడా అనేక సందర్భాల్లో వినియోగదారులు ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసి డెలివరీ తీసుకునేటప్పుడు డెలివరీ బాయ్ చేత అయిన లేదా రెండో వ్యక్తి ఆ ప్యాకేజ్ ని ఓపెన్ చేస్తుండగా వీడియో తీసుకొని పెట్టుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా ఆ వీడియోతో సమస్యను పరిష్కరించడం సులభం అవుతుందని తెలియజేశారు.

Also Read: హైదరాబాద్‌ నుంచి మరో టీకా.. ‘హెపటైటిస్-ఏ’కు వ్యాక్సిన్..!


Written By

1 Comment

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *