Menu

MahaKumbh Yogi Adityanath : మలమూత్రాల నీటిలోనే మహా కుంభమేళ.. ప్రభుత్వ సంస్థనే తప్పుబడుతున్న సైంటిస్ట్ యోగి !!

Tri Ten B 12 months ago
NGT slams UPPCB for submitting old water sample amid Maha Kumbh mela

‘మలజలంలో మునగండి, మోక్షం పొందండి..’

వచ్చాడండి పెద్ద నాసా సైంటిస్ట్..! ఆయనే యోగి ఆదిత్యనాథ్‌. మలం కలిసిన నీటిలో మునగమనడమే కాదు ఏకంగా వాటిని తాగమంటున్నాడు. ఆయన రోజూ అదే తాగుతాడేమో ఎవడికి తెలుసు? కానీ ఆయన లాగే అందరిని ఉండమంటే ఎలా? ప్రజలకు మలజలం తాగించడమే ఆయన అంతిమ లక్ష్యమైతే చేయగలిగిందేమీ లేదు కానీ.. అటు ప్రజలకు కూడా ఆ నీళ్లే తియ్యగున్నాయ్‌ కాబోలు.. ఎగబడి వెళ్తున్నారు.. ముక్కుముసుకోని మరి మునుగుతున్నారు. అలా చేస్తే పాపాలు పోతాయట.. అన్ని పాపాలు చేశారు మరి.. అధికారికంగా ఈ పాపాత్ముల సంఖ్య 60కోట్ల పైమాటే ఉంది. సెప్టిక్‌ ట్యాంక్‌లో పాపాలు కడుక్కొవడం సనాతన భక్తులకే చెల్లుతుంది. అయినా నీటిలో మునిగితే పాపాలు ఎలా పోతాయ్? ఇదేం దిక్కుమాలిన లాజిక్కు..! ఏమో.. అలాంటి ప్రశ్నలు అడగవద్దు.. ‘మా నమ్మకాలు మావి.. నీకేందుకు.. నువ్వేమైనా పాకిస్థాన్‌ వాడివా లేదా క్రిస్టియన్‌ గొర్రె బిడ్డవా’

జలజనిత వ్యాధుల బంపర్ ఆఫర్‌

ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఉన్న ప్రతిదీ మా వేదాల్లో ఉన్నాయని బడాయి చెప్పుకునే సనాతన బిడ్డలు మలం కలిసిన నీటిలో మునిగి తేలియాడుతున్నారు. కోట్ల మంది ఆ నీటిని తాగుతున్నారు. సామాన్యులకు ఊహించుకుంటేనే విరక్తి కలుగుతుంది కానీ ఆ నీటిని తాగడమేంటి? గంగలో ఫీకల్ కాలిఫార్మ్ స్థాయి 49,000 MPN/100ml, యమునాలో 33,000 MPN/100ml ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు-CPCB పరిశోధనలు తేల్చిచెబుతున్నాయి. స్నానానికి అనుకులమైన పరిమితి కేవలం 2500 MPN/100ml మాత్రమే. అంతకమించి పరిమితి ఉన్న నీటిలో మునిగినా, తాగినా డయేరియా ఉచితం. టైఫాయిడ్‌లు బోనస్‌. ప్రత్యేక కానుకగా కలరా, ఇంకా అదనపు ఆఫర్‌గా హెపటైటిస్-A కూడా పొందవచ్చు. కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, జ్వరం.. అన్నీ కలిపి భక్తి డీలక్స్ కిట్‌ను అమ్ముతోంది ప్రభుత్వం. అందుకే ఈ జలజనిత వ్యాధుల మెగా ఆఫర్‌ను మిస్‌ చేసుకోవడం సనాతనీలకు ఏ మాత్రం ఇష్టం లేదు. సెప్టిక్ ట్యాంకులు, మురుగునీటి ప్రవాహాల్లో ఉండే బ్యాక్టీరియా మహాకుంభమేళలో స్నాన నీటిలో ఉందని తెలిసినా భక్తి, ముక్తి, విరక్తి కంటే భక్తులకు ఏదీ ఎక్కువ కాదు!

సిగ్గులేని జన్మ.. మన కర్మ

భక్తుల సంగతి పక్కన పెడదాం.. వీధివీధినా, ఊరు పొడుగునా ఉండే ఆలయాలు.. సందుగొంధుల్లో ఉండే బాబాలు ప్రజల ఆలోచనా తీరును మూఢనమ్మకాల్లో మగ్గేలా చేశారనుకుందాం..! మరి ప్రభుత్వాల సంగతేంటి? ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి మలం నీటిలో మునగమని, వాటిని తాగమని సభా ముఖంగా చెప్పడమేంటి? నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌(NGT), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికలను అబద్ధాలని చెబుతూ అందరిముందు పచ్చిగా అబద్ధమాడడమేంటి? మహాకుంభమేళ నీటిలో మలవిసర్జన బ్యాక్టీరియా ఉందని.. దానిపై వివరణ ఇవ్వాలని NGT యోగి సర్కార్‌ను ఆదేశించింది. కానీ యూపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? మహాకుంభమేళ ముందు నాటి నీటి శాంపిల్స్‌ను తిరిగి పంపించింది. ఇది ఎంత మోసం? యూపీ ప్రభుత్వం ఎవరిని మోసం చేస్తుంది? నీటి నమూనాలను ఎందుకు మోసం చేశారని NGT నిలదీసినా సీఎం గారికి సిగ్గు, బుద్ధి లేదు. ‘మేం ఏమైనా మూర్కులమా.. మా సమయం ఎందుకు వృధా చేస్తున్నారని’ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ చెంపచెల్లుమనిపించినా యోగి తీరులో మార్పు లేదు. ఎందుకంటే ఆయనకు డబ్బే ప్రధానం. మహాకుంభమేళను ఒక వ్యాపారకోణంలో మాత్రమే ప్రభుత్వాలు చూస్తాయి. పేరుకు హిందూ మతతత్వ పార్టీయే అయినా బీజేపీకి మహాకుంభమేళ కాసులు తెప్పించే వ్యాపార మార్గం మాత్రమే. ఇక్కడ భక్తే ఉత్పత్తి.

పవిత్రత ముసుగులో కంపు

నిజానికి ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడయ్యే ఉత్పత్తి భక్తే. దీనికి మార్కెటింగ్ ఖర్చు అవసరం ఉండదు.. బ్రాండ్ అంబాసిడర్ అక్కర్లేదు. ఎందుకంటే అమాయకులు ఉచితంగా ప్రచారం చేస్తారు. దశాబ్దాలుగా భక్తిని తీర్థంలా అమ్ముకుంటూ, ప్రభుత్వాలు వేల కోట్లు సంపాదిస్తున్నాయి.. కానీ భక్తులు పొందుతున్నదేంటి? టైఫాయిడ్, కలరా, హెపటైటిస్, డయేరియా.. ఈ వ్యాధులే నిజమైన ప్రసాదాలు. గంగానది నీళ్లు పవిత్రమైనవి కావు.. అవి శవాల కుప్పలను తన ఒడిలో దాచుకున్న కంపుకొట్టే నీరు. ఆ నీటిని శుద్ధిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గంగా ప్రక్షాళన కోసం 20 వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్న ప్రభుత్వం ఏ మేరకు నీటిని శుద్ధి చేసిందో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికే సమాధానం చెబుతోంది. అయినా నదులను పవిత్రంగా భావించడం మూర్ఖత్వం. నీటిని కాపాడుకోవడానికి వాటిని దైవంగా పూజించాలా? అది ప్రజల బాధ్యత కాదా? మరి పవిత్రత, పుణ్యం ముసుగులో నీటిని మురికిగా మార్చుతుంది ఎవరు? భక్తులే కదా? ప్రభుత్వాలు భక్తుల విశ్వాసాన్ని క్యాష్ చేసుకుంటూ మూఢనమ్మకాన్ని కూడా పెద్ద వ్యాపారంగా మార్చేశాయి. ఇక్కడ హిందూ పార్టీలేవీ లేవు.. అదంతా ఓటు బ్యాంకు రాజకీయాలు.. భక్తులే వెర్రొళ్లు! అందుకే భక్తి పేరుతో బురదలో ముంచుతున్నా ప్రజలు అందులోనే తేలుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలకు లాభం వస్తే చాలు, భక్తులు బతికారా? సచ్చారా అనేది అనవసరం. మీ జీవితం మీకే విలువైనదిలా అనిపించనప్పుడు.. మురికి నీటిలోనూ, సెప్టిక్‌ ట్యాంక్‌లోనూ తేలాలని నిర్ణయించుకున్నప్పుడు యోగి ఆదిత్యనాథ్‌ ఎలా మాట్లాడినా అందులో తప్పే కనిపించదు. అలా కనిపించడడంలేదు కాబట్టే ఇండియాలో ప్రజల కన్నా భక్తులు ఎక్కువయ్యారు. బాధల కన్నా మూఢనమ్మకాలు బలంగా ఉన్నాయి. భక్తులను వ్యాపారంగా మార్చిన ఈ బందీశాలలో ఎంతకాలం కాలం వెళ్లదియ్యాలో ప్రజలే నిర్ణయించుకోవాలి.. లేదంటే నదుల్లోనే కాదు, మనుషుల మెదళ్లలో కూడా చివరకు మలజలమే నిండిపోతుంది..!

ALSO READ: HOLY SHIT అంటే ఇదేనేమో.. మలవిసర్జన నీటిలో తేలియాడుతున్న భక్త కోటి సనాతనీలు!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *