A Glimpse Of Sonia 25 Year Loksabha Career: భారత్ రాజకీయాల్లో గాంధీ కుటుంబానిది ప్రత్యేక స్థానం. దేశ దశను మార్చే పథకలైనా.. ఎమెర్జన్సీ లాంటి వివాదాస్పద నిర్ణయాలైనా అది గాంధీ కుటుంబానికే చెల్లింది. నాటి ఇందిరా గాంధీ నుంచి నేటి సోనియా గాంధీ వరకు దేశ రాజకీయాలపై చెరిగిపోని ముద్ర వేసిన కుటుంబమిది. సోనియా ప్రధాని పదివి కాలేదు కానీ దేశ రాజకీయాలను మాత్రం శాశించారు. భర్త రాజీవ్ మరణంతరం తన కన్నుసన్నల్లోనే కాంగ్రెస్ నడుచుకుంది. అయితే ప్రస్తుతం సోనియాకు ఆరోగ్యం బాగోడంలేదు. యాక్టివ్ పాలిటిక్స్‌కు ఆమె శరీరం సహాకరించడంలేదు. అయినా ప్రజల మధ్యే ఉంటూ వచ్చారు. ఇప్పటివరకు లోక్‌సభ ఎంపీగా ఉత్తరప్రదేశ్ రాయబరేలి నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియా ఇక పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు.
#Breaking: Smt Sonia Gandhi Ji filed her nomination for Rajyasabha from the state of Rajasthan.
New inning of her life.. pic.twitter.com/3yZD0XurWA
— Shantanu (@shaandelhite) February 14, 2024
అప్పుడు ఇందిరా.. ఇప్పుడు సోనియా:
ఇప్పటివరకు గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఇద్దరే ప్రాతినిధ్యం వహించారు. 58ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ రాజ్యసభకు వెళ్లారు. 1964 నుంచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే(1967) వరకు రాజ్యసభలో తన గళాన్ని వినిపించారు. నాటి పరిస్థితులు వేరు. అప్పుడు కాంగ్రెస్‌కు పోటీనే లేని కాలమది. కమ్యూనిస్టులు మాత్రమే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనిపించేవారు. లెఫ్ట్ పార్టీలు సైతం కొన్ని రాష్ట్రాల్లోనే బలంగా కనిపించేవి. నెహ్రూ మరణం తర్వాత శాస్త్రి.. శాస్త్రి మరణం తర్వాత ఇందిరా ప్రధానిగా ఎన్నికయ్యారు. నేటి పరిస్థితులు మాత్రం భిన్నం. కాంగ్రెస్ పూర్వవైభవం కోసం పోరాడుతోంది. పదేళ్లగా బీజేపీ దేశంలో బలమైన పార్టీగా మారింది. మోదీ సారధ్యంలోని బీజేపీని కేంద్రంలో గద్దె దింపడం చిన్న విషయం కాదు.. మోదీని బలంగా ఢికొట్టాలంటే అంతే బలమైన లీడర్ కావాలి. సోనియా ఇప్పుడా పని చేయలేరు. నిజానికి 2019 నుంచే సోనియా యాక్టివ్‌గా లేరు.
అమేథీ నుంచి మొదలు:
ఇక సోనియాను ఖమ్మం నుంచి లోక్‌సభ ఎంపీగా పోటికి దింపాలని తెలంగాణ కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నించింది. కానీ సోనియా మాత్రం ఇక పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. 1999లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు సోనియా. ఉత్తరప్రదేశ్ అమేథీ, కర్ణాటకలోని బళ్లారి నుంచి పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించారు. అయితే గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీని నిలుపుకోవాలని ఆమె డిసైడ్ అయ్యారు. 2006లో రాయబరేలీ నుంచి నాలుగు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో సోనియా ఎన్నికయ్యారు. 2014, 2019లో మోదీ వేవ్ సమయంలోనూ సోనియా తన సెగ్మెంట్‌ను నిలుపుకున్నారు. అయితే 2019లోనే ఇవే తన చివరి లోక్‌సభ ఎన్నికలని సోనియాగాంధీ ప్రకటించుకున్నారు. చెప్పినటే చేశారు.. ఈసారి ఎన్నికల్లో సోనియాగాంధీ పోటీ చేయకపోవడంతో ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి పోటి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: దేశపు అతిపెద్ద స్కామ్.. ప్రజలకు అసలు నిజాలు తెలియాలి..! సుప్రీం తీర్పు తర్వాత ఏం జరగబోతోంది?