Menu

Electoral Bonds: దేశపు అతిపెద్ద స్కామ్‌.. ప్రజలకు అసలు నిజాలు తెలియాలి..! సుప్రీం తీర్పు తర్వాత ఏం జరగబోతోంది?

Tri Ten B
BJP's total contributions stood at ₹2120 crore in the 2022-23 fiscal, of which 61 percent came from electoral bonds. The party's total income in 2022-23 stood at ₹2360.8 crore, up from ₹1917 crore in FY 2021-22. In contrast to this, Congress, on the other hand, earned just ₹171 crore from electoral bonds. These numbers slumped which was down from ₹236 crore in FY 2021-22.

Supreme Court Verdict on Electoral Bonds:  అదో మతతత్వ పార్టీ.. ప్రజల ఎమోషన్స్‌తో ఆడుకునే పార్టీ.. భావోద్వేగాలు రెచ్చగొట్టి వర్గాల మధ్య చిచ్చుపెట్టి అధికారంలోకి వచ్చే పార్టీ. బయటకు పేదల పార్టీగా చెప్పుకునే బీజేపీ..ఇంటి లోపల మాత్రం కార్పొరేట్లకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. అయితే బయటకు మాత్రం క్లీన్‌ పార్టీగా ఎక్సిబిట్ చేసుకుంటారు. కార్పొరెట్ల అనూకుల విధానాలు అమలు చేస్తూ వారి దగ్గర నుంచి ఫండ్‌ రూపంలో డబ్బు రాబట్టుకుంటారు. బీజేపీ బతుకుతున్నదే ఈ ‘పెద్దొళ్ల’ డబ్బులతో. అయితే ఏ డబ్బున్నోడు పార్టీకి ఎంత ఫండింగ్‌ ఇచ్చాడన్నది మాత్రం బయటకు చెప్పరు. గోప్యత పేరుతో వేల కోట్లు పోగేసుకుంటారు. అడ్డదిడ్డమైన పథకాలతో ప్రజలను పిచ్చోళ్లని చేయాలని చూస్తారు. కానీ రోజులెప్పుడు ఒకేలా ఉండవు.. న్యాయమన్నది ఒకటుంది. దానికంటూ ఒక రోజుంటుంది. ఆ రోజు ఇదే కావొచ్చు. చేతిలో అధికారం ఉంది కదా అని రాజ్యాంగ విలువలకు పాతరేసి అడ్డగోలు పథకాలతో ప్రజలను మోసం చేయాలని చూసే బీజేపీకి సుప్రీంకోర్టు అతిపెద్ద షాక్‌ ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ పథకం(Electoral Bond Scheme) రాజ్యాంగ విరుద్ధమని.. ఆర్టికల్‌ 19(1)(A)తో పాటు RTI ఉల్లంఘనకు కిందకు వస్తుందని తీర్పునిచ్చిన సుప్రీం(Supreme Court).. బాండ్ల లెక్కలన్ని బయటపెట్టాలని ఆదేశించడం సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ(BJP)కి గట్టి దెబ్బగానే చెప్పాలి.


ఆ మార్పులు వారి కోసమేనా?
2017లో ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేసింది కేంద్రం. పెద్ద విరాళాలను గోప్యంగా ఉంచేలా రూల్‌ తెచ్చింది. ఈ సవరణ వెనుక పెద్ద స్కామే ఉంది. విరాళాల గురించిన సమాచారం దాచేస్తోంది. ఎవరు ఎంత డబ్బు ఎక్కడ నుంచి ఇస్తున్నారో తెలియదు. పెద్ద పెద్ద బడాబాబులు పార్టీలకు ఫండింగ్ ఇస్తారు. అందులో మోదీ గుజరాత్‌ మిత్రులు బీజేపీకి భారీగా ఫండింగ్‌ ఇస్తారని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. కానీ గోప్యత సాకుతో ఈ విషయాలేవి ఇప్పటివరకు బయటకు బహిర్గతం కాలేదు. కానీ సుప్రీం తీర్పుతో డొంకంతా కదలనుంది. దేశపు అతిపెద్ద కార్పొరెట్‌ స్కామ్‌ ఎక్స్‌పోజ్ కానుంది. రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల సమాచారాన్ని మార్చి 6 లోపు ఎన్నికల కమిషన్‌కు అందించాలని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సమాచారాన్ని మార్చి 13లోపు తన వెబ్‌సైట్‌లో ప్రచురించాలని ఎన్నికల సంఘానికి చెప్పింది. రాజకీయ పార్టీలు ఇంకా క్యాష్ చేసుకోని బాండ్లను బ్యాంకుకు తిరిగి ఇవ్వాలని తెలిపింది.


అసలు గోప్యంగా ఎందుకు ఉంచాలి?
విరాళాల దాతలను గోప్యంగా ఉంచడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పడంతో బీజేపీకి దిమ్మదిరిగింది. బ్లాక్‌ మనీని అరికట్టేందుకు ఇది మార్గం కాదన్న సుప్రీంకోర్టు.. నల్లధనం నియంత్రణకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని స్పష్టం చేసింది. జనవరిలో ఎలక్టోరల్‌ బాండ్స్‌పై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్స్‌ రిపోర్ట్‌ చూస్తే ఈ ‘గోప్యత’ రూల్ చాటున బీజేపీ ఎంత స్కామ్‌ చేసిందో.. ఎంత లాభ పడిందో..ఎంత లబ్ది పొందిందో అర్థం చేసుకోవచ్చు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా బీజేపీకి ఏకంగా రూ.2,210 కోట్లు విరాళాలు వచ్చాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ.1917 కోట్ల విరాళాలు అందాయి. 2022-23లో కాంగ్రెస్‌కు వచ్చిన విరాళాలు రూ. 171 కోట్లు ఉండగా.. 2021-22లో కాంగ్రెస్‌కి వచ్చిన విరాళాలు రూ. 236 కోట్లగా ఉంది. జాతీయ పార్టీ గుర్తింపు ఉన్న మిగిలిన అన్ని పార్టీలకు కలుపుకున్నా బీజేపీకి వారందరికంటే ఏడు రెట్లు అధిక ఫండింగ్ వచ్చింది. ఫండ్‌ ఇవ్వడం ఒకరి వ్యక్తిగత విషయమే.. ఇది ఎవరూ కాదనరు.. అయితే ఎవరు ఫండ్‌ ఇచ్చారు.. ఎంత ఇచ్చారన్నది దాచడం ఎందుకు? గ్రహంతారవాసులేమీ ఫండ్‌ ఇవ్వరు కాదు.. ఎవరు డబ్బులిస్తున్నారో చెబితే కొంపలేమీ కూలిపోవు కదా అని మీరు అనుకోవచ్చు.. కానీ ఈ విషయాలన్ని బయటకు తెలిస్తే బీజేపీ కొంపలే కాదు కోటలే కూలిపోవచ్చు.. ఆకాశం నుంచి అధ:పాతాళానికి పడిపోవచ్చు. ఎందుకంటే కార్పొరేట్లతోనే బీజేపీ దోస్తి.. వారి కోసమే చట్టాలు.. ఇదే క్రోని క్యాపిటలిజం.. దేశాన్ని ఏలుతున్నది వారే.. ఇవి ఆరోపణలు కావు.. రానున్న రోజుల్లో బహిర్గతం అవ్వబోయే పచ్చి నిజాలు..!

Also Read: ఆటవీకం.. అనుచితం.. అర్థరహితం.. అదే బుల్డొజర్‌ రాజకీయం!

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *