Menu

Marriage Harrasement: వివాహాలు కావు.. వ్యాపారాలు..! ఇక్కడ అమ్మకానికి పెళ్లికొడుకులు!

Tri Ten B
4 కోట్ల కట్నం ఇచ్చినా సరిపోలేదు.. వరకట్న దాహానికి వివాహిత బలి

Marriage System: డబ్బులు తీసుకుని కొంతమంది మేధస్సును అమ్ముకుంటారు.. కొంతమంది శ్రమని అమ్ముకుంటారు.. మరికొందరు శరీరాన్ని అమ్ముకుంటారు. ఇందులో శరీరాన్ని అమ్ముకునే మహిళలను వేశ్యా అంటారు. అదే మగాడు అలానే అమ్ముకుంటే పెళ్లికొడుకూ అంటారు. ఇదేంటి వేశ్యలతో పవిత్రమైన పెళ్లిని పోల్చుతావా అని ఆవేశపడకండి. మీ కోపాన్ని మడిచి ఎక్కడైనా పెట్టుకోండి.. ఎక్కడా పెట్టుకునే ప్లేస్‌ లేకపోతే అదే కోపంతో ముఖాన్ని గొడకేసి కొట్టుకోండి.. నష్టామేమీ లేదు. వేశ్యలేవరూ తమ వృత్తిని పవిత్రంగా భావించరు.. నిజానికి ఏ మహిళా కూడా అలాంటి జీవితం కోరుకోదు. కానీ పవిత్రమైన పెళ్లిలో మగాడు కట్నం పేరిట అమ్మాయి తల్లిదండ్రుల నుంచి నిలువు దోపిడి చేస్తాడు. ఇంత డబ్బిస్తే పెళ్లి చేసుకుంటా అని ఖరాఖండిగా చెబుతాడు. అంటే ఇంత డబ్బిస్తే నా శరీరాన్ని అమ్ముకుంటా అని చెప్పడం.

ఆ రెండూ ఎక్కడ?
ఇదేంటి పెళ్లి తర్వాత శారీరిక సుఖం తప్ప ఇంకేవీ ఉండవా.. ఆ డబ్బులు కేవలం పిల్లలను కనడానికి మాత్రమే కాదు కదా అని ఆశ్చర్యపోకండి.. చాలా మంది పెళ్లిని లైసెన్సెడ్‌ సె*క్స్‌ కోసమేనని భావిస్తున్నారు. ‘అది లేకపోతే ఎలా..’ అందుకే ఇలా పెళ్లి అంటున్నారు. అంటే డబ్బులు తీసుకోని పడకగదిలో సుఖాలు పొందుతున్నారు. అక్కడ కూడా డబ్బులిచ్చేవారి కంటే తీసుకునేవాడిదే డామినేషన్‌. ఇది వ్యాపారపరంగా ఆలోచిస్తే అనైతికం. కానీ పెళ్లి కదా ఇది నైతికమే కావొచ్చు.. ఎందుకంటే అది పవిత్రమైనది. ఈ విషయాన్ని పదేపదే గుర్తుచేయాల్సిన అవసరంలేదు. దీనికి జాతకాలు, తిథులు, డబ్బులు, పొలాలు, బంగారాలు, కార్లు, బైకులు, ఫ్లాట్లు, ముహూర్తాలు ఇలా చాలా ఉంటాయి. ఇంతకుమించే ఉంటాయి.. లేనిదిల్లా రెండే.. ఒకటి ప్రేమ.. రెండోది కామన్‌సెన్స్!

గాడిదలకు జరిగిన అవమానాన్ని భరించేదెవరూ?
కట్నం తీసుకున్నవాడు గాడిద అని ఒక సామెత ఉంది. ఈ సామెత గాడిదలను అవమానించేలా ఉంది. గాడిదలు కట్నాలు తీసుకోవు.. పెళ్లికొడుకులే తీసుకుంటారు. ఇక్కడ గాడిద సంఘాలు లేవు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఈ పనికిమాలిన సామెతను ఎప్పుడో ఖండించేవి. వరకట్న వేధింపులు చావులు ఈనాటివి కావు.. చరిత్రపొడుగునా ఉన్నాయి. యుగాల నాటి ముందే ఉన్నాయి.. యుగాంతం వచ్చేవరకు ఉంటాయి. వరకట్న వేధింపులకు మరో మహిళ బలైపోయన విషయం తెలియగానే ప్రజల చూపు ఎంత కట్నం ఇచ్చారన్నదానివైపు మళ్లింది. హైదరాబాద్‌ గాజులరామారంలో అమరావతి అనే వివాహిత కట్నం వేధింపులు భరించలేక చనిపోయింది. 2019లో అభిలాష్‌తో పెళ్లి అయ్యింది.. పిల్లలు కూడా ఉన్నారు.. వివిధ రూపాల్లో నాలుగు కోట్లు కట్నం ఇచ్చారట.. అయ్యాగారికి, వారి అమ్మాబాబులకు ఈ డబ్బులు సరిపోలేదట. ఇంకా కావాలని హింస పెట్టడంతో పాపం అమరావతి ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌ లెటర్‌లో తన పిల్లలను అనాథశ్రామంలో చేర్పించాలని కోరిందంటే ఆమె ఇంతకాలం ఓ మనిషికాని మనిషితో.. ఇల్లుకాని ఇంట్లో కాపురం చేసిందని అర్థమవుతుంది.

ఇదంతా ఎందుకు చేస్తున్నారు?
ఇలా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుందాని తెలియగానే.. అసలు ఈ కట్నం ఎందుకివ్వాలి అని ఆలోచించినవారి కంటే.. అమ్మో నాలుగు కోట్లు ఇచ్చినా సరిపోలేదా అని అనుకున్నవాళ్లే ఎక్కువ. అప్పనంగా రూపాయ్‌ ఇచ్చినా కట్నమే.. నాలుగు కోట్లు ఇచ్చినా కట్నమే. అది ఇచ్చుకునే వారి స్థోమత బట్టి ఉంటుంది. డబ్బులు లేకున్నా కూతురి పెళ్లి కోసం అప్పు చేసి తర్వాత అప్పుల్లోల బాధలు భరించలేక చనిపోయే తండ్రులకు సంబంధించిన విషాధ గాధలు ఇప్పటికీ న్యూస్‌పేపర్లలో కనిపిస్తూనే ఉన్నాయి కదా. నిర్మల్‌ జిల్లాలో ఓ తండ్రి ఈ మధ్యే తనువు చాలించాడు. కూతురు పెళ్లికి స్థోమతకు మించి అప్పు చేశాడు. చివరకు శవమై కనిపించాడు. అసలేందుకు అప్పు చేయాలి? కూతురు పెళ్లి ఘనంగా ఎందుకు చేయాలి? కట్నం ఎందుకివ్వాలి..? పెళ్లి గురించి వంద మాటలు మాట్లాడితే అందులో 99మాటలు డబ్బు చుట్టూనే తిరుగుతాయి కదా.. మరి పవిత్రత ఎక్కడ? పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించపడతాయట.. అసలు స్వర్గమెక్కడుంది? లేని స్వర్గాన్ని ఉన్నట్టు చూపించినట్టే వివాహ వ్యవస్థ చుట్టూ కల్పితాలే అల్లుకోని ఉన్నాయి. ఈ కల్పితాలకు మతాలు కొమ్ముకొస్తాయి.

సంతలో కూరగాయలు:
ఇంకొంతమంది ఉంటారు. ఓ వయసు రాగానే అమ్మాయి కోసం ఈ ఊర్లో, ఆ ఊర్లో ఉన్న అన్ని కొంపలు తిరుగుతారు. వారంతా పక్కా బిజినెస్‌మ్యాన్లు. అమ్మాయి నల్లగా ఉంటే ఎక్కువ కట్నం అడుగుతారట.. ఎర్రగా ఉంటే తక్కువ అడుగుతారట. ఇదేందో అర్థంకాలేదు.. అమ్మాయిలు ఏమైనా కూరగాయల సంతలో దొరికే టమాటా పండా.. ఈ రెసిజం ఏంటో.. ఈ బేరసారాలేంటో.. ఇందులో పవిత్రత ఎక్కడుందో.. ఇదేం దిక్కుమాలిన వ్యవస్థో మేధావులకే తెలియాలి. అసలు నిజానికి ఇది వివాహ వ్యవస్థ కాదు వ్యాపార వ్యవస్థ. దీన్ని పవిత్రమనే వారు పిచ్చొళ్ల కిందే లెక్కా. వారంతా భ్రమల్లో బతుకుతున్నట్టే లెక్కా.. ఈ మాటలకు మీ మనోభావాలు, జీల్లకర్ర, ఆవాలు, ధనియాలు దెబ్బతిన్నా చేయగలిగిందేమీ లేదు. ఇక మీ ఇష్టం.. ఇలానే డబ్బులు తీసుకోని అమ్ముడుపోండి.. ఇచ్చేవాడికి లేని దురద, నొప్పి తీసుకునేవాడికి ఎందుకు!

Also Read: దేశపు అతిపెద్ద స్కామ్‌.. ప్రజలకు అసలు నిజాలు తెలియాలి..! సుప్రీం తీర్పు తర్వాత ఏం జరగబోతోంది?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *