Menu

Donald Trump Inauguration: ట్రంప్‌ గురించి చాలా మందికి తెలియని నిజం.. ఆయన మద్యం ముట్టరని తెలుసా?

Tri Ten B
Donald Trump Inauguration LIVE Updates

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Donald Trump) తన జీవితంలో ఎప్పుడూ కూడా మద్యం సేవించలేదని మీకు తెలుసా? ఏంటి నమ్మడం లేదా? ఎంతో విలాసవంతమైన జీవితం గడిపే ట్రంప్‌ జీవితంలో చుక్క కూడా మందు తాగలేదు. దీనికి చాలా బలైమన కారణమే ఉంది. ట్రంప్‌ జీవితంలో బాధాకరమైన రోజుల సంఖ్య కూడా చాలా ఎక్కువే. ముఖ్యంగా ట్రంప్‌ తన సోదరుడు లేని లోటును ఇప్పటికీ ఫీల్ అవుతారు. 1981లో ట్రంప్‌ బ్రదర్‌ ఫ్రెడ్‌ చనిపోయాడు. కేవలం 42ఏళ్లకే ఫ్రెడ్‌ మరణించడానికి కారణం మితీమీరిన మద్యపాన వినియోగం. అదే పనిగా అల్కహాల్‌ సేవించడం కారణంగా ఫ్రెడ్‌ ఆర్గన్స్‌ ఫెయిల్ అయ్యాయి. అతని బతికించడానికి ఎంత ప్రయత్నించినా.. ట్రంప్‌ కుటుంబం ఎంత డబ్బులు ఖర్చు చేసినా లాభం లేకుండా పోయింది.

 

తన సోదరుడు చివరి రోజుల్లో అనారోగ్యంతో ఎంతలా బాధపడ్డారో ట్రంప్‌ కళ్లారా చూశారు. అంత భరించలేని వేదనకు కారణం మద్యపానమేనని అర్థం చేసుకున్న ట్రంప్‌ అల్కహాల్‌ని విపరీతంగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. తన చుట్టూ ఉన్నవాళ్లలో ఎవరైనా మందు తాగితే ట్రంప్‌కు నచ్చదు. తాగద్దని పదేపదే వారికి సూచిస్తుంటారు. అల్కహాల్‌ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో చెబుతుంటారు. తన పిల్లలు ఇలాంటి అలవాట్లు చేసుకోకూడదని వారికి చిన్నప్పటి నుంచే మద్యంతో పాటు సిగరేట్‌, డ్రగ్స్‌ వల్ల జరిగే అనర్ధాల గురించి వివరించారు. తాను మద్యపానానికి దూరంగా ఉండడానికి తన సోదరుడికి చేసిన ప్రామీస్‌ కూడా ఒక కారణంగా చెబుతారు ట్రంప్‌.

సోదరుడు బ్రదర్‌ ఫ్రెడ్‌ మరణానికి ముందు ఎప్పుడూ తాగవద్దు అని తన దగ్గర మాట తీసుకున్నాడని ట్రంప్‌ ఓ సందర్భాంలో చెప్పారు. అప్పటికే మద్యం పట్ల వ్యతిరేకంగా ఉన్న ట్రంప్‌ తన సోదరుడికి మందు తాగనని ఒట్టు వేశారు. అందుకే ఇప్పటికీ ట్రంప్‌ మందు ముట్టుకోరు.. తన పక్కన ఉన్నవారు ముట్టుకున్నా ఊరుకోరు..! ఇక అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేశారు.

Also Read: కష్టాలు, కన్నీళ్లు.. కమల మనసును ముక్కలు చేసిన ఘటన అదే..!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *