సంవత్సరాల తరబడి కష్టపడి డిగ్రీ తెచ్చుకుంటాం. హమ్మయ్యా..డిగ్రీ అయిపోయిందని జాబ్స్ కోసం వేట మొదలు పెడతాం. అప్పట్లో డిగ్రీ ఉంటే చాలు ఉద్యోగం వస్తుందని అనుకునేవాళ్లు. ఇప్పుడు డిగ్రీ అనేది పేపర్‌పై ఉంటుంది. దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. స్కిల్స్ ఉంటేనే జాబ్ లేదంటే నో జాబ్. ఇండియాలో డిగ్రీల ఆకర్షణ ఎంత గొప్పగా ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు రోజులు మారాయి. స్కిల్స్.. అడాప్టబిలిటీ.. రియల్ వరల్డ్..ఎక్స్‌పీరియన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? డిగ్రీల కంటే స్కిల్స్ ఎందుకు ముఖ్యం? ఈ మార్పు యువతను ఎలా ప్రభావితం చేస్తుంది?
డిగ్రీ ఉన్నా లేనట్టేనా?
ఇక ఇండియాలో ఉద్యోగాలు గురించి మాట్లాడితే ఒకప్పుడు డిగ్రీకి చాలా విలువ ఉండేది. కాలేజీ పూర్తి చేస్తే మంచి జాబ్ వస్తుందని అందరూ నమ్మేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు మీ పేపర్ కంటే మీ చేతిలో ఉన్న నైపుణ్యాలు.. అనుభవం.. మార్పులకు సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్ని చూస్తున్నారు. ఉదాహరణకు ఒక యువకుడు డిగ్రీ లేకుండా ఆన్లైన్ కోర్సులు చేసి AIలో స్కిల్స్ నేర్చుకుని లక్షల జీతంతో జాబ్ పొందుతున్నాడు. ఇక ఈ మార్పు వెనుక కొన్ని ముఖ్యమైన రిపోర్టులు ఉన్నాయి. 2025 ఉడమీ రిపోర్ట్ ప్రకారం యువ ప్రొఫెషనల్స్‌లో 67 శాతం మంది డిగ్రీని అత్యవసరమని భావిస్తున్నారు కానీ రిక్రూటర్లలో కేవలం 32 శాతం మంది మాత్రమే అనుకుంటున్నారు. అంటే యువకులు డిగ్రీపై ఆధారపడుతున్నారు కానీ కంపెనీలు మాత్రం స్కిల్స్ చూస్తున్నాయి. ఇంకా 80 శాతం రిక్రూటర్లు ఇప్పుడు స్కిల్స్ ఫస్ట్ అప్రోచ్‌తో హైరింగ్ చేస్తున్నారని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2025 రిపోర్ట్ చెబుతోంది. 40 శాతం రిక్రూటర్లు ఎంట్రీ లెవల్ పొజిషన్లకు డిగ్రీ రిక్వైర్మెంట్ తీసివేశారు. మల్టీనేషనల్ కంపెనీలు ముఖ్యంగా స్కిల్స్ బట్టి హైర్ చేస్తున్నాయి.
సర్వేలు ఏం చెబుతున్నాయ్?
గ్లోబల్‌గా కూడా 2023 లింక్డిన్ రిపోర్ట్ ప్రకారం అమెరికాలో 19 శాతం జాబ్ పోస్టింగ్స్ డిగ్రీ అవసరం లేకుండా ఉన్నాయి. 2021లో 15 శాతం నుంచి పెరిగింది. ఇండియాలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఇక ఎకనామిక్ సర్వే 2024-25 ప్రకారం 50 శాతం గ్రాడ్యుయేట్స్ అండర్ఎంప్లాయ్డ్గా ఉన్నారు. లో-స్కిల్ జాబ్స్‌లో పని చేస్తున్నారు. కేవలం 8.25 శాతం మంది మాత్రమే వాళ్ల క్వాలిఫికేషన్‌కు మ్యాచ్ అయ్యే రోల్స్‌లో ఉన్నారు. మెర్సర్-మెట్టల్ ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్ 2025లో ఎంప్లాయబిలిటీ 42.6 శాతానికి డౌన్ అయింది. ముఖ్యంగా HR..డిజిటల్ మార్కెటింగ్ వంటి నాన్-టెక్నికల్ రోల్స్‌లో.. టెక్నికల్ రోల్స్‌లో AI.. మెషీన్ లెర్నింగ్‌లో 46.1 శాతం ఉంది. డాక్టర్ ఉమేష్ కోథారీ.. SP జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్ నుంచి చెప్పినట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ డిగ్రీలపై ఫోకస్ చేస్తోంది.. కానీ జాబ్ మార్కెట్ స్కిల్స్ మరియు అడాప్టబిలిటీని రివార్డ్ చేస్తోంది. మెటా-లెర్నింగ్ అంటే లెర్నింగ్ ఎలా చేయాలో నేర్చుకోవడం ఇప్పుడు ఇదే టాప్ స్కిల్.
మరోవైపు NIIT యూనివర్సిటీ వంటి ఇన్స్టిట్యూట్స్ కరిక్యులమ్‌లో హ్యాండ్స్-ఆన్ ఎక్స్పీరియన్స్ ఎంబెడ్ చేస్తున్నాయి. ప్రతి స్టూడెంట్‌కు రీసెర్చ్ మెథడాలజీ సిక్స్ మంత్స్ ఇండస్ట్రీ ప్రాక్టీస్ మ్యాండేటరీగా ఉంది. రియల్ ప్రాబ్లమ్స్‌పై వర్క్ చేస్తారు. మెడవి స్కిల్స్ యూనివర్సిటీ ఫౌండర్ ప్రవేష్ దుదాని చెప్పినట్టు నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్.. AI-ఎనాబుల్డ్ లెర్నింగ్.. స్కూల్ లెవల్ ఇంటర్న్షిప్స్తో స్కిల్స్-ఫస్ట్ ఫ్యూచర్ ఇప్పటికే షేప్ తీసుకుంటోంది. డిగ్రీ స్కిల్స్‌ను ఫార్మలైజ్ చేసే ఫ్రేమ్‌వర్క్‌గా మారాలి రీప్లేస్ చేయకూడదు.
ఇక ముఖ్యంగా కెరీర్ గ్రోత్, లాంగ్-టర్మ్ ఆపర్చ్యూనిటీస్కు 2025లో డిగ్రీలు ఇంకా ఇంపార్టెంట్ . కానీ వాటి రియల్ వాల్యూ రియల్-వరల్డ్ స్కిల్స్‌తో కంబైన్ అయినప్పుడే. ETS 2025 హ్యూమన్ ప్రొగ్రెస్ రిపోర్ట్ ప్రకారం 85 శాతం ప్రొఫెషనల్స్ స్కిల్స్ క్రెడెన్షల్స్ 2035 నాటికి డిగ్రీలతో ఈక్వల్‌గా వ్యాల్యూ కావాలని బిలీవ్ చేస్తున్నారు. లింక్డిన్ వర్క్‌ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ ప్రకారం 60 శాతం మంది డిగ్రీని ఎసెన్షల్గా చూస్తున్నారు కానీ స్కిల్స్-ఫస్ట్ అప్రోచ్‌తో టాలెంట్ పూల్స్ సిగ్నిఫికెంట్‌గా పెరుగుతాయి. NIIT యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ పారిమల్ మండ్కే చెప్పినట్టు డిజిటల్ ఎకానమీ.. AI టెక్నాలజీస్ అడాప్షన్‌తో డిగ్రీ అలానే సక్సెస్ గ్యారెంటీ కాదు. ప్రూఫ్ ఆఫ్ కేపబిలిటీస్.. హ్యాండ్స్-ఆన్ స్కిల్స్ మాత్రమే కీ. ఇండస్ట్రీ.. అకాడమియా.. సొసైటీ స్కిల్స్-ఫస్ట్ మైండ్‌సెట్‌తో అలైన్ అయితే ఇండియా ర్యాపిడ్‌గా చేంజ్ అయ్యే వరల్డ్‌లో థ్రైవ్ చేసే వర్క్‌ఫోర్స్‌ను బిల్డ్ చేయగలదు. రోట్ లెర్నింగ్ డిగ్రీలపై ఫోకస్ చేయకూడదు.
ALSO READ: AI జమానాలోనూ ఈ డిగ్రీలు సేఫ్.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్!

AI ప్రపంచంలో కనిపించని భాషలు.. ప్రపంచానికి ఆఫ్రికా చెప్పని కథ
AI: మీ అప్పుల బాధను తీర్చే ఏఐ..మనం సంపాదించే ప్రతి రూపాయికి టెక్నాలజీ రక్ష!
BITSAT: ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. BITSAT నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!
SSC GD Constable 2026: పది పాస్ అయ్యారా? 25,487 పోస్టులకు SSC నోటిఫికేషన్ వచ్చేసింది..ఇలా అప్లై చేసుకోండి!
SSC JOBS: మీ కలల ఉద్యోగానికి గోల్డెన్ చాన్స్.. SSCలో 7,948 పోస్టుల భర్తీ!
Job Skills: జాబ్ గ్యారెంటీగా రావాలంటే డిగ్రీలుంటే సరిపోదు బ్రో.. ఊ సబ్జెక్టులపై పట్టు ఉండాలో ఇక్కడ తెలుసుకోండి!