WPL 2026 మెగా వేలంలో అత్యంత చర్చకు కారణమైన పేర్లలో దీప్తి శర్మ(Deepti Sharma) ముందుంది. యూపీ వారియర్జ్ ఆమెను వేలంలోకి విడుదల చేయగా.. దీప్తి కోసం ఫ్రాంచైజీలు పోటి పడ్డాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆమె కోసం రూ.3.20 కోట్ల బిడ్ పెట్టింది. ఇదే సమయంలో యూపీ వారియర్జ్ తమ రైట్ టు మ్యాచ్ కార్డు వినియోగించి అదే మొత్తాన్ని మ్యాచ్ చేసి దీప్తిని తిరిగి తమ జట్టులోకి తీసుకుంది. ఈ మొత్తం ఆమెను WPL చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాలోకి తీసుకెళ్లింది. మొదటి స్థానంలో 2023లో రూ.3.40 కోట్లకు కొనుగోలు చేసిన స్మృతి మంధాన ఉంది.
వరల్డ్‌కప్‌లో దుమ్మురేపిందిగా:
దీప్తికి ఇంత భారీ డిమాండ్ రావడానికి కారణం ఆమె తాజా అంతర్జాతీయ ప్రదర్శన. 2025 మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఆమె భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ టోర్నమెంట్‌లో ఆమె 9 మ్యాచ్‌లలో 215 పరుగులు చేయడంతో పాటు 22 వికెట్లు తీసింది. ఒకే వరల్డ్ కప్‌లో 200కు పైగా పరుగులు, 20కు పైగా వికెట్లు పడగట్టిన తొలి క్రికెటర్‌గా నిలిచింది. ఈ ప్రదర్శన దీప్తిని ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన ఆల్‌రౌండర్లలో ఒకరిగా నిలబెట్టింది.
అన్నయ్యతో పాటే..:
దీప్తి శర్మ క్రికెట్ ప్రయాణం కూడా ఎంతో ప్రేరణాత్మకంగా ఉంటుంది. ఆమె ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో 1997లో జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు క్రికెట్‌పై ఆసక్తి ఎక్కువ. ఆమె అన్నయ్య ఫీల్డ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బంతులు సేకరించడమే ఆమె మొదటి పరిచయం. అదే సమయంలో ఆమె ఆటపై అభిరుచి పెరిగింది. కుటుంబం నుంచి బలమైన ప్రోత్సాహం లభించడంతో ఆమె మహిళల క్రికెట్‌లో అడుగు పెట్టింది. తక్కువ వయసులోనే ఆమె తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. ఆమె బౌలింగ్‌లో నియంత్రణ, బ్యాటింగ్‌లో ధైర్యం, ఫీల్డింగ్‌లో చురుకుదనం దీప్తిని ఒక సంపూర్ణ ఆల్‌రౌండర్‌గా మార్చాయి. భారత జట్టులో ప్రవేశించిన తర్వాత ఆమె అనేక మ్యాచ్‌లలో కీలక పాత్ర పోషిస్తూ నిలకడగా ఎదిగింది.
అందుకే వేలంలో ఆమె పట్ల ఈ స్థాయిలో ఆసక్తి ఏర్పడటం సహజమే. బ్యాటుతోనూ బంతితోనూ సమానంగా ప్రభావం చూపగల దీప్తి లాంటి ఆటగాళ్లు ఏ జట్టుకు అయినా అమూల్యమైన ఆస్తిగానే చెప్పాలి. అందుకే యూపీ వారియర్జ్ చివరి నిమిషంలో కూడా ఆమెను విడిచిపెట్టకుండా మళ్లీ తమ జట్టులోకి తీసుకునేలా నిర్ణయం తీసుకుంది. ఆమె రాబోయే సీజన్‌లో ఎలా రాణిస్తుందో అన్నదానిపై ఇప్పుడు అందరి చూపులు ఉన్నాయి.
ALSO READ: బంగాళాఖాతంలో మరో తుఫాను? ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు తప్పదా?

WTC Finals 2025 : ఇక చోకర్స్ కాదు ఛాంపియన్స్! ఎన్నో ఏళ్ల ‘ఆశ ‘ను నిజం చేసిన బవూమా!!
CT Final 2025: టీమిండియా గెలుపుకు 5 ప్రధాన కారణాలు.. లాస్ట్‌లో ట్విస్ట్!
Imran Khan: థ్రిల్లింగ్ క్రికెట్ మ్యాచ్‌ను తలపిస్తోన్న ఇమ్రాన్ లైఫ్.. వరల్డ్ కప్ నుంచి జైలు శిక్ష వరకు..
Gautham Gambhir: గమ్మునుండవోయ్.. అందరితో గొడవలేందుకు భయ్యా నీకు.. ప్చ్..!
Ambati Rayudu-Virat Kohli row: అంబటి రాయుడిని తొక్కేసింది కోహ్లీయేనా? రాబిన్ ఊతప్ప కామెంట్స్‌తో దుమారం! ఇందులో నిజమెంత?
Ashwin-Hindi Language row: హిందీ జాతీయ భాష కాదా? అశ్విన్ ఏం అన్నారు? రాజ్యాంగం ఏం చెబుతోంది?