Menu

CTET: టీచర్ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌..! CTET నుంచి కీలక అప్‌డేట్.. ముఖ్యమైన తేదీలివే!

Praja Dhwani Desk 2 months ago
CTET notification news

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) 21వ ఎడిషన్ ఫిబ్రవరి 8, 2026న (ఆదివారం) నిర్వహించనున్నట్టుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకటించింది. ఈ పరీక్ష 132 నగరాల్లో, 20 భాషలలో పేపర్-I, పేపర్-I రెండింటినీ కవర్ చేస్తుంది. సిలబస్, పరీక్షా విధానం, భాషా ఎంపికలు, అర్హత నియమాలు, ఫీజు, ముఖ్యమైన తేదీలు లాంటి వివరాలను కలిగి ఉన్న సమాచార బులెటిన్‌ను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించనున్నట్లు CBSE ధృవీకరించింది, అంటే ctet.nic.in లో ఈ సమాచారం త్వరలోనే రానుంది. రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించే ముందు బులెటిన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిగా చదవవడం తప్పనిసరి. మొత్తం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఫారమ్‌లు CTET పోర్టల్ ద్వారా మాత్రమే అంగీకరిస్తారు.

ALSO READ: AI జమానాలోనూ ఈ డిగ్రీలు సేఫ్‌.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్!

ఫిబ్రవరి 2026 CTET సెషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్వల్ప ఆలస్యం తర్వాత నవంబర్ 27, 2025న ప్రారంభమైంది. అభ్యర్థులు డిసెంబర్ 18, 2025 (రాత్రి 11:59) వరకు తమ దరఖాస్తులను సమర్పించి పరీక్ష రుసుము చెల్లించవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ప్రాథమిక (I–V తరగతులు), ఉన్నత ప్రాథమిక (VI–VIII తరగతులు) స్థాయిలలో బోధించాలనుకునే వ్యక్తులకు CTET జాతీయ స్థాయి అర్హత పరీక్షగా నిలుస్తోంది.

షెడ్యూల్:

రిజిస్ట్రేషన్ ప్రారంభం–నవంబర్ 27, 2025

దరఖాస్తు & రుసుము చెల్లింపుకు చివరి తేదీ – డిసెంబర్ 18, 2025 (రాత్రి 11:59)

పరీక్ష తేదీ: ఫిబ్రవరి 8, 2026

మోడ్ – OMRఆధారిత (ఆఫ్‌లైన్)

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అభ్యర్థులు ctet.nic.in ద్వారా మాత్రమే నమోదు చేసుకోవాలి.

వ్యక్తిగత, విద్యా వివరాలను పూరించడం

అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి

నిర్దేశించిన పరీక్ష రుసుము చెల్లించాలి

దరఖాస్తుదారులు దరఖాస్తుల తుది సమర్పణకు ముందు అర్హతను ధృవీకరించుకోవాలని CBSE కోరింది. అసంపూర్ణమైన లేదా తప్పు దరఖాస్తులు తిరస్కరణకు దారితీయవచ్చు.

అర్హతా:

రెండు స్థాయిల పరీక్షకు వేర్వేరు విద్యార్హతలు అవసరం.

పేపర్ I (తరగతులు I–V)

అభ్యర్థులు కింది వాటిలో కనీసం ఒకదానిని కలిగి ఉండాలి:

50% మార్కులతో సీనియర్ సెకండరీ (10+2), 2 సంవత్సరాల D.El.Ed.

50% మార్కులతో సీనియర్ సెకండరీ, 4 సంవత్సరాల B.El.Ed.

50% మార్కులతో సీనియర్ సెకండరీ, స్పెషల్ ఎడ్యుకేషన్‌లో 2 సంవత్సరాల డిప్లొమా.

50% మార్కులతో గ్రాడ్యుయేషన్, NCTE నిబంధనల ప్రకారం B.Ed.

పేపర్ II (తరగతులు VI–VIII)

కనీస అవసరమైన మార్కులతో గ్రాడ్యుయేషన్, B.Ed డిగ్రీ (పూర్తి లేదా చివరి సంవత్సరంలో)

కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి లేదు

పరీక్షా నమూనా, మార్కింగ్ పథకం:

CTET పరీక్ష పూర్తిగా మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతో (MCQలు) ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఉంటుంది. ఎలాంటి నెగిటివ్‌ మార్కులు లేవు.

ఈ పరీక్ష మల్టి భాషలలో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ నింపేటప్పుడు తమకు నచ్చిన మాధ్యమాన్ని ఎంచుకోవాలి. పేపర్ వారీగా పూర్తి వివరాలు సమాచార బులెటిన్‌లో జాబితా చేయబడతాయి.

అభ్యర్థులు తర్వాత ఏం చేయాలి?

CBSE అభ్యర్థులకు ఈ క్రింది సలహాలు ఇస్తుంది:

సమాచార బులెటిన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని జాగ్రత్తగా చదవండి.

వారి విద్యా అర్హతను ధృవీకరించండి

పత్రాలు సరైన ఫార్మాట్‌లో స్కాన్ చేయబడ్డాయని నిర్ధారించుకోండి

నిర్ధారణ పేజీ ముద్రిత కాపీని ఉంచుకోండి.

CBSE లేదా NCTE మార్గదర్శకాలను అనుసరించి కేంద్రీయ పాఠశాలలు, సంస్థలలో నియామకాలకు CTET సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుంది.

ఫిబ్రవరి 2026 సెషన్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్‌లు, ప్రకటనల కోసం అభ్యర్థులు అధికారిక CTET వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండాలి.

ALSO READ: డిగ్రీతో ఉపయోగం లేదు.. ఈ స్కిల్స్‌ ఉంటే మాత్రం జాబ్‌ ఫిక్స్!

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *