Menu

T M Krishna: మనసావాచా కాక్షించిన తమిళ బ్రాహ్మణ విద్వాంసుడు.. దళితులతో కలిసి కచేరీ చేయడమే తప్పైందా?

PK

T M Krishna: మద్రాస్ మ్యూజిక్ అకాడమీ టీఎం కృష్ణకు సంగీత కళానిధి పురస్కారాన్ని ప్రకటించగానే ఇంతకాలం ఆయన్ను విమర్శించిన వాళ్లంతా ఒక్కతాటిపైకి వచ్చేశారు. తమను తాము సంస్కరించుకుని ఆధునిక భావాలవైపు అడుగులు వేయడానికి ఇష్టపడని సోకాల్డ్ సంగీత కళాకారులు అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్నారు.. సంగీత అకాడమీ ప్రదర్శనలను బహిష్కరిస్తున్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ఉద్ధరించేది తామే అన్నట్టుగా ఫోజులు కొడుతున్నారు. త్యాగరాజ కృతుల నుంచి ఎంఎస్ సుబ్బులక్ష్మి వరకు ఎవరిపై టీఎం కృష్ణ వేలెత్తి చూపినా.. వాటికి సహేతుకమైన కారణాలున్నాయి. తనకున్న బ్రాహ్మణ నేపథ్యాన్ని కూడా పక్కన పెట్టి ఎప్పటికప్పుడు తన ఆలోచనలను సంస్కరించుకుంటూ వస్తున్న టీఎం కృష్ణ కులం, మతం, సంప్రదాయం, కట్టుబాట్లు వీటికి అతీతమైన సంగీత ప్రపంచాన్ని కోరుకోవడం తప్పెలా అవుతుంది ? జీవన విధానం కావొచ్చు.. చెవులు కోసుకునే కర్ణాటక శాస్త్రీయ సంగీతమే కావొచ్చు.. అందులో వివక్ష ఉందని తేలిన తర్వాత ఆ వివక్షను ప్రశ్నిస్తేనో… ఆ జాఢ్యాన్ని వదిలించుకుందామని నినదిస్తేనో అది సంగీతానికి చేసిన ద్రోహం ఎలా అవుతుంది ? ఉన్నది ఉన్నట్టుగా ఆమోదించి.. దేనిని ప్రశ్నించకుండా.. సంగీత పరిజ్ఞానాన్ని ప్రదర్శించడమే ఆ సంగీతానికి చేసే సేవ అవుతుందా ? నన్ను విమర్శించండి..నా ఆలోచనలను ప్రశ్నించండి..నా తప్పులను ఎత్తిచూపండి. కానీ నా నోరు మూయించే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే మీరాపని చేయలేరు అంటూ పిడికిలి బిగించి కృష్ణ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా ?

Also Read: ఎవరిచ్చారీ బిరుదులు..? గ్లోబల్ స్టార్.. ఐకాన్‌ స్టార్? మెగా పీఆర్‌ మాములుగా లేదుగా!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *