Menu

ISCA: అవునులే మనకి సైన్స్‌ ఎందుకు.. వాట్సాప్‌ యూనివర్శిటీ చాలు.. సూడో పాలకులతో అంతే!


మనిషి మెదళ్లలో మూఢనమ్మకాలు మళ్లీ విజృంభిస్తున్న కాలం ఇది.. సూడో సైన్స్‌ మాటున నిజమైన సైన్స్‌ నలిగిపోతున్న సమయం ఇది.. ఇలాంటి టైమ్‌లో ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ఇండియన్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహణ రద్దవడం నిజంగా బాధాకరం.


Sumanth Thummala
The cancellation of the annual session of the Indian Science Congress Association (ISCA) this year hasn’t surprised sections of scientists who view it as a fallout of the Centre’s efforts to promote an alternative science festival linked to Vijnana Bharati, the science wing of the RSS

Indian Science Congress Association: మార్నింగ్‌ లేచిన వెంటనే ఫోన్‌ చూసే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది ఇండియాలోనే కాదు.. మిగిలిన దేశాల్లోనూ ఈ అలవాటు ఉన్నవాళ్లు కాస్త ఎక్కువగానే ఉంటారు. అయితే భారత్‌లో ఓ ఎక్స్‌ట్రా బోనస్‌ కూడా ఉంటుంది. నిద్రలేవగానే ఫోన్‌ చూడడంతో పాటు ఓ ఫేక్‌ సైన్స్‌ వార్తను చదవగలగడం బీజేపీ పాలనలో ప్రజలు చేసుకున్న అదృష్టం! లేకపోతే చప్పట్లకు కరోనా పోవడమేంటో.. ఈ సూడో సైన్స్ ప్రచారమేంటో దానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎండోర్స్‌ చేయడమేంటో ఉన్నాడో లేదో తెలియని ఆ దేవుడికే తెలియలి. ఇక కాస్తో కూస్తో ప్రజలకు విజ్ఞానాన్ని అందించే ప్రొగ్రామ్‌లను సైతం జరగని దౌర్బగ్య పరిస్థితులు ఇండియాలో దాపరించాయి. 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ని రద్దు చేయడం నిజంగా బాధకారం.

యూజ్‌ లేదనుకున్నారేమో:
ఐన్‌స్టీన్‌, స్టీఫెన్ హాకింగ్, న్యూటన్ థియరీలు ఇదివరకే తమ పురాణాల్లో ఉన్నాయని ఈ విషయం ఆ శాస్త్రవేత్తలు కూడా చెప్పారని కల్పితపు మాటలు మాట్లాడుతూ ఎంతో మందిని విస్మయానికి గురిచేసే కేంద్ర మంత్రులు, ఎంపీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోని బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి చాలా కాలంగా ఫేస్బుక్ వాట్సాప్ లలో వచ్చే కల్పితపు శాస్త్రీయమైన అంశాలు శాస్త్రీయతకు దిక్సూచిగా నిలవాల్సిన వేదిక మీదకు వచ్చాయి. అటు 2019లో సైతం ఇండియన్‌ సైన్స్ కాంగ్రెస్‌ నిర్వహణ వేదిక మీద కూడా విమర్శలు వచ్చాయి. ఇక ఈ సంవత్సరం జరగాల్సిన 109వ సదస్సు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) వేదికగా నిర్ణయించినప్పటికీ మళ్లీ వెనక్కి తగ్గారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులను నిరాకరిస్తూ తీసుకున్న నిర్ణయంతో సదస్సును కొనసాగించడం అసాధ్యమని ఎల్పీయూ నిర్వాహకుడు చెప్పడం విచారకరం.

మార్చ్ ఫర్ సైన్స్:
2017 ఆగస్టు 9న దాదాపు 12 వేల మంది శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా 40 నగరాలలో “మార్చ్ ఫర్ సైన్స్ “అనే అంశంతో\ బ్రేక్‌త్రూ సైన్స్ సొసైటీ ద్వారా మార్చ్ చేశారు. ప్రభుత్వం జీడీపీలో మూడు శాతం R&D కి కేటాయించాలని, అలాగే భారత రాజ్యాంగం చెప్పినట్లు “అశాస్త్రీయమైన, అస్పష్టమైన ఆలోచనల ప్రచారం, మత అసహనాన్ని అంతం చేయడం” చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) వ్యవస్థాపక డైరెక్టర్ ప్రముఖ శాస్త్రవేత్త పీఎం భార్గవ సదస్సు నిర్వాహకుల పైన తీవ్రంగా విరుచుకోబడ్డారు. 1948 నుంచి తన సదస్సులకు హాజరవుతున్నప్పటికీ మూఢనమ్మకాలు,ఆధ్యాత్మికత, నిరూపితం కానీ అశాస్త్రీయమైన అంశాలు చర్చకు వస్తున్నాయని ఇది దేశానికి మంచిది కాదని హెచ్చరించారు. ఈ ధోరణి వల్లనే ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కొందరు ఈ వేదిక మీదకు రావడానికి ఇష్టపడడం లేదనేది బహిరంగ రహస్యం.

శైలిని మార్చుకోవాలి.

దేశంలో జరిగే అతిపెద్ద సైన్సు సదస్సు ఇదే. పైగా స్వతంత్రం నుంచి దేశ ప్రధాని తప్పకుండా ప్రతి ఏటా పాల్గొంటున్న కార్యక్రమం ఇది. ఈ సదస్సులకు స్కూలు కాలేజీ విద్యార్థులు వేల సంఖ్యలో ప్రతి ఏటా హాజరవుతారు. అటువంటి రాబోయే తరాలకు ఈ వేదిక ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. అదే కాకుండా ఎన్నో శాస్త్రీయ విషయాలను అంత మంది శాస్త్రజ్ఞులు చర్చించుకుంటూ ఎన్నో ప్రముఖ విషయాలకు ఈ సదస్సు వేదిక అవుతుంది. ఒక దేశంగా మనం ప్రగతి పదంలో ముందుకు నడుస్తూ ఉండాలంటే పాలకులు- ప్రజలు శాస్త్రీయ దృక్పథంతో ఉండాల్సిందే దానికి ఇలాంటి సదస్సులు సక్రమంగా నిర్వహిస్తే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఈ సదస్సు కచ్చితంగా నిర్వహించేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ఈ వేదిక మూఢనమ్మకాలకు అశాస్త్రీయతకు చోటు అవ్యకూడదని ఎందరో శాస్త్రజ్ఞులు సైన్స్ ప్రేమికులు కోరుకుంటున్నారు.

Also Read:  కోతల కల్లోలం.. మళ్లీ ఉద్యోగాలు ఊడుతున్నాయ్!

 


Written By

1 Comment

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *