Menu

Job Skills: జాబ్‌ గ్యారెంటీగా రావాలంటే డిగ్రీలుంటే సరిపోదు బ్రో.. ఊ సబ్జెక్టులపై పట్టు ఉండాలో ఇక్కడ తెలుసుకోండి!

Archana 3 months ago
AI course telugu

స్కూల్‎లో మన చదువు పూర్తి అవ్వగానే నెక్స్ట్ ఏం చేయాలనీ ఆలోచనలో పడతాం..తల్లిదండ్రుల సలహాలు తీసుకుంటాం..ఫ్రెండ్స్‎ని అడుగుతాం..కానీ ఆ సమయంలో ఏం తీసుకోవాలో అర్థం కాదు..డిగ్రీ ఎంచుకోవాల్సి వచ్చింది. టెక్ ఫీల్డ్ పట్టుకోవాలా.. బిజినెస్ మేనేజ్‌మెంట్ వైపు వెళ్లాలా.. లేక కామర్స్ లాంటి సేఫ్ ఆప్షన్‌తో వెళ్లాలా? ఈ రోజుల్లో జాబ్స్ మార్కెట్ ఏమిటి? ఏ డిగ్రీ చదివితే 2026లో ఇంటర్వ్యూలు లైన్‌లో నిలబడతాయి? MBA చేస్తే గ్యారెంటీగా జాబ్ వస్తుందా.. లేక ఇంజినీరింగ్‏లో వస్తుందా? ఇలా ఎన్నో ఆలోచనలో పడతాం..అసలు మన ఫ్యూచర్‎ని ఏ సబ్జెక్ట్ డిసైడ్ చేస్తుందో తెలుసుకుందాం.

ఇక ETS..CII..AICTE..AIU..Taggd లాంటి బిగ్ ఆర్గనైజేషన్స్ కలిసి చేసిన స్టడీ. లక్షల మంది స్టూడెంట్స్ గ్లోబల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్ రాసి వెయ్యికి పైగా కంపెనీల నుంచి డేటా కలిగి వచ్చింది. ఇండియాలో ఓవరాల్ ఎంప్లాయబిలిటీ 2025లో 54.81% నుంచి 2026కి 56.35%కి పెరిగింది. అంటే మన యూత్ మరింత రెడీ అవుతోంది. కానీ డిగ్రీ వైజ్ చూస్తే.. టాప్ స్పాట్‌లో కంప్యూటర్ సైన్స్ 80%తో IT 78%తో రాకింగ్. ఇంజినీరింగ్ BE లేదా BTech 70.15%తో మంచి పొజిషన్. MBA గతంలో 78% ఉండేది 72.76%కి డ్రాప్ అయింది. కామర్స్ 62.81%కి జంప్ చేసింది. సైన్స్ నాన్-IT 61%.. ఆర్ట్స్ 55.55%. వోకేషనల్ లాంటి ITI 45.95%, పాలిటెక్నిక్ 32.92%. ఇది చూస్తే టెక్ డామినేట్ చేస్తోంది కానీ ఇతర ఫీల్డ్స్ కూడా గ్రౌండ్ గెయిన్ చేస్తున్నాయి.

ఎందుకు కంప్యూటర్ సైన్స్, IT టాప్‌లో ఉన్నాయి?

AI..డేటా అనలిటిక్స్..క్లౌడ్ టెక్నాలజీలు అన్ని ఇండస్ట్రీల్లో బూమ్ అవుతున్నాయి. రిపోర్ట్ ప్రకారం ఇండియా గ్లోబల్ AI టాలెంట్‌లో 16% షేర్ కలిగి ఉంది 2027 నాటికి 1.25 మిలియన్ AI ప్రొఫెషనల్స్ వస్తారు. కంపెనీలు డేటా విత్ ఇంజినీరింగ్ కలిపిన టాలెంట్ కోరుకుంటున్నాయి. ఫ్రెషర్స్‌లో 35% IT రోల్స్‌లో హైర్ అవుతున్నారు. అంటే డేటా సైన్స్.. AI స్పెషలైజేషన్ చేస్తే జాబ్ గ్యారెంటీ. ఇది ఫ్యూచర్-ప్రూఫ్ ఎంట్రీ లెవల్ హైరింగ్‌లో సేఫెస్ట్ బెట్.

MBA ఎందుకు స్లిప్ అవుతోంది?

ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి.. 78% నుంచి 72.76%కి డౌన్. ఎందుకంటే ఎంప్లాయర్స్ ప్యూర్ మేనేజ్‌మెంట్ థియరీ కాకుండా డిజిటల్ స్కిల్స్ విత్ బిజినెస్ అక్యుమెన్ కావాలనుకుంటున్నారు. ఇంజినీరింగ్ ప్లస్ MBA కాంబినేషన్ బెటర్ పెర్ఫార్మ్ అవుతోంది. AI..రిమోట్ వర్క్.. ప్లాట్‌ఫాం బిజినెస్‌ల వల్ల.. అజైల్.. డేటా-లిటరేట్ మేనేజర్స్ కావాలి. కామర్స్ గ్రాడ్స్ కంపిట్ చేస్తున్నారు. అంటే MBA చేస్తే జనరల్ కాకుండా అనలిటిక్స్.. ఆపరేషన్స్ టెక్.. డిజిటల్ స్ట్రాటజీ స్పెషలైజ్ చేయండి. లేకపోతే ఇంటర్వ్యూలు టఫ్ అవుతాయి.

కామర్స్ ఎందుకు స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ చేస్తోంది?

ఇక 55% నుంచి 62.81%కి రైజ్అయింది. BFSI ఫిన్‌టెక్ సెక్టర్స్ బూమ్ వల్ల ఫైనాన్స్..ఆపరేషన్స్..బిజినెస్ అనలిటిక్స్‌లో డొమైన్ నాలెడ్జ్ కావాలి. కంపెనీలు జనరల్ MBA కంటే కాస్ట్-ఎఫెక్టివ్.. డొమైన్-ఓరియెంటెడ్ టాలెంట్ కోరుకుంటున్నాయి. డిజిటల్ స్కిల్స్ యాడ్ చేస్తే టాప్ రోల్స్ వస్తాయి. సైన్స్ గ్రాడ్స్ 61%తో..ఆర్ట్స్ 55.55%తో ఇంటర్‌డిసిప్లినరీ రోల్స్‌లో ఎంటర్ అవుతున్నారు. నాన్-టెక్ ఫీల్డ్స్ కూడా హైబ్రిడ్ రోల్స్‌లో స్కోప్ ఉంది.

మరోవైపు వోకేషనల్ స్ట్రీమ్స్ గురించి మాట్లాడితే ITI 45.95%.. పాలిటెక్నిక్ 32.92%కి పెరిగాయి. ఎందుకంటే స్కిల్-ఫస్ట్ హైరింగ్. మాన్యుఫాక్చరింగ్.. EV.. రెన్యూవబుల్స్.. టెక్-ఎనేబుల్డ్ ఆపరేషన్స్ గ్రోత్ వల్ల హ్యాండ్స్-ఆన్ ట్రైనింగ్.. ప్రాక్టికల్ స్కిల్స్.. ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమోటివ్ రోల్స్‌లో ఈ గ్రాడ్స్ డిమాండ్‎లో ఉన్నాయి.

ఇక స్టూడెంట్స్‌కి CS లేదా IT చేస్తే సేఫ్.. డేటా లేదా AI స్పెషల్ చేయండి. కామర్స్.. వోకేషనల్ రూట్స్ ఇప్పుడు వాల్యూ.. BFSI ఆపరేషన్స్‌లో గుడ్. MBA అంటే స్పెషలైజేషన్ మ్యాండేటరీ. యూనివర్సిటీలకి కరిక్యులమ్‌ని టెక్ విత్ బిజినెస్ మిక్స్ చేయాలి. ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్స్ పెంచాలి. ఎంప్లాయర్స్‌కి టెక్ తప్పా కామర్స్.. వోకేషనల్ గ్రాడ్స్‌ని హైర్ చేయాలి. డొమైన్ ప్లస్ అనలిటికల్ స్కిల్స్ రివార్డ్ చేయాలి.మహిళల ఎంప్లాయబిలిటీ 54%కి పురుషులు 51.5%కి ఫస్ట్ టైమ్ మహిళలు లీడ్. టియర్-2 సిటీస్ లాంటి లక్నో.. కోచి కూడా ఎమర్జింగ్ హబ్స్‎గా మారాయి .టెక్.. BFSI..హెల్త్‌కేర్‌లో హైరింగ్ ఇంటెంట్ 40%కి పెరిగింది.

మరోవైపు డిగ్రీ మాత్రమే కాదు స్కిల్స్ ప్లస్ స్పెషలైజేషన్ కీ రోల్ . డిజిటల్ ఫ్లూయెన్సీ.. AI లిటరసీ .. క్రిటికల్ థింకింగ్ టాప్ స్కిల్స్. ఫ్యూచర్ వర్క్ గిగ్.. ఫ్రీలాన్సింగ్.. రిమోట్‌తో మిక్స్ అవుతోంది. సో మీ కరీర్ ప్లాన్ చేస్తున్నారా అయితే CS/ITతో స్టార్ట్ చేయండి. కానీ స్కిల్స్ అప్‌స్కిల్ చేయండి.

ALSO READ: 10th,12th టాపర్.. చివరకు IFS ర్యాంకర్..! అదితి సక్సెస్ సీక్రెట్ ఇదే!


Written By

S. Archana is an SEO specialist and sub-editor known for her strong adaptability and dedicated work ethic. A committed professional and an eager everyday learner, she continually sharpens her skills to deliver thoughtful, effective results.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *