విద్యార్థులకు శుభవార్త…ఇంజినీరింగ్ చదవాలనుకునే అభ్యర్థులకు కీలక సమాచారం ఇది. BITS పిలానీ నిర్వహించే BITSAT 2026 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్ష ద్వారా BITS పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌లలో.. B.E, B.Pharm, M.Sc ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు.
BITSAT అనేది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్. ఇందులో ఎలాంటి రిజర్వేషన్ విధానం లేదు. అడ్మిషన్లు పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతాయి.
BITSAT 2026కు సంబంధించిన ముఖ్య తేదీలు ఇవే:
రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 15, 2025 నుంచి ప్రారంభమవగా.. మార్చి 16, 2026 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
Session-1 పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 17 వరకు, Session-2 పరీక్షలు మే 24 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఒకటి లేదా రెండు సెషన్లకు హాజరయ్యే అవకాశం ఉంది. రెండు సెషన్లలో వచ్చిన ఉత్తమ స్కోర్‌ను మాత్రమే అడ్మిషన్‌కు పరిగణలోకి తీసుకుంటారు.
ఇంజినీరింగ్ కోర్సులకు అప్లై చేయాలంటే 12వ తరగతి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో పూర్తి చేసి ఉండాలి. PCM కలిపి కనీసం 75 శాతం మార్కులు, ప్రతి సబ్జెక్టులో 60 శాతం మార్కులు తప్పనిసరి. పరీక్ష వ్యవధి మూడు గంటలు, మొత్తం 130 ప్రశ్నలు, 390 మార్కులు ఉంటాయి. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ కూడా వర్తిస్తుంది.
BITSAT అప్లికేషన్ ఫీజు.. పురుష అభ్యర్థులకు రూ. 3500, మహిళా అభ్యర్థులకు రూ. 3000గా నిర్ణయించారు.
కంప్యూటర్ సైన్స్ వంటి టాప్ బ్రాంచ్‌లకు సాధారణంగా 330కి పైగా మార్కులు కట్ ఆఫ్‌గా ఉండే అవకాశం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు admissions.bits-pilani.ac.in అనే అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. పూర్తి నోటిఫికేషన్, సిలబస్, అడ్మిట్ కార్డ్, ఫలితాల వివరాలు కూడా
అదే వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
ALSO READ: పది పాస్ అయ్యారా? 25,487 పోస్టులకు SSC నోటిఫికేషన్ వచ్చేసింది..ఇలా అప్లై చేసుకోండి!

Careers and Education: డిగ్రీతో ఉపయోగం లేదు.. ఈ స్కిల్స్ ఉంటే మాత్రం జాబ్ ఫిక్స్!