Menu

Bike Number Plates: వెర్రితనం.. ఇవేం నంబర్‌పేట్లు బాబోయ్.. ఎవడూ తగ్గట్లేదుగా!

Tri Ten B

Bike Number Plates: అప్పుడెప్పుడో విజయవాడలో ఓ కలర్‌ కలర్స్‌ బైక్‌ను చూసినట్టు గుర్తు.. ఎగ్జిక్యూటివ్ క్లబ్ ఎదురుగా రోడ్డుపై పార్క్‌ చేసి ఉన్న బైక్ అది.. కాస్త దూరం నుంచి చూస్తే అది ఎరుపు రంగు బైకో.. పసుపు రంగో బైకో అర్థమైచావలేదు. కాస్త దగ్గరకు వెళ్లాక తెలిసింది అన్నగారి కుటుంబ అభిమానుల బైక్ అని. సర్లే అవన్ని సాధారణమే. ఆ మాటకొస్తే సినీ హీరోల ఫ్యాన్స్‌ బైక్‌లపై స్టిక్కర్లు ఎక్కువగా కనిపించడం చాలా కాలంగా చూస్తున్నదే. ఇంకొంతమంది వారి కులాల పేర్లు కూడా బైక్‌పై అంటించుకుంటారు. రెడ్డి రాక్స్‌ అని.. కాపు యూత్‌ అని.. కమ్మ కింగ్స్‌ అని రకరకాల పేర్లు కనిపిస్తుంటాయి. ఇది కూడా మోస్ట్‌ కామన్‌ థింగే. మోటర్‌ వెహికల్ చట్టం ప్రకారం ఇదంతా పెద్ద క్రైమ్. అయినా మాకు అనవసరం.. మా గుండెల్లో అయినా బండిపై అయినా శరీరంపై టాటుగా అయినా మా అభిమాన నటుడు, నాయకుడు, కొన్నిసార్లు దేవుడు కూడా ఉంటాడు. ఈ రూల్‌ ఎలాగో ‘కట్నం’ విషయం లాగా ఎవరూ పట్టించుకోనదిగా నార్మలైజ్ అయిపోయింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు నంబర్‌ ప్లేట్లపై అంకెలే లేని బైక్‌లు దర్శనమిస్తున్నాయి. అసలు కొన్ని వాహనాలకు నంబర్‌ ఉండదు..అయినా రయ్‌రయ్‌ అని పోతారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదు.. నన్ను అడగకండి. వారినే అడగండి.

దొందు దొందే:
మోటర్‌ వెహికల్ యాక్ట్‌లో ఎలాంటి నిబంధన తప్పినా ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్ వేస్తుంటారు. అలాంటిది ఓ బండికి నంబర్‌ ప్లేట్‌పై అంకెలే లేకపోతే అది చట్టవిరుద్ధమే కదా. అలాంటివారిపై ఎలాంటి యాక్షన్‌ తీసుకుంటున్నారో తెలియదు కానీ ఈ తరహా బైకులు మాత్రం ఏపీలో కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం వైసీపీ అభిమానుల బైకులే అనుకుంటే మీరు పసుపు కరపత్రాలను ఎక్కువగా చదివి వాటిని నమ్ముతున్నట్టే లెక్క. 2019కు ముందు కూడా కొంతమంది టీడీపీ అభిమానుల బైకులు ఇలానే కనిపించేవి. అప్పుడు అధికారంలో ఉన్నది వారే కదా. టీడీపీ సైకిళ్లకి, క్రికెట్‌ కిట్లకి పసుపు కొడితే వైసీపీ బిల్డుంగులకు ఏకంగా పక్షులకు కూడా బులుగు రంగు పూసినట్టు.. వారి లాగే వీరు కూడా బైక్‌ నంబర్‌ ప్లేట్‌ అంకెలు లేకుండా అంతా జగన్‌మయం చేస్తున్నారు.


ఇదేరా మా కాన్ఫిడెన్స్:
అప్పుడు టీడీపీ ఫ్యాన్స్ చేసినా, ఇప్పుడు వైసీపీ ఫ్యాన్స్ చేసినా అధికారంలో ఉన్నది తామేనన్న అహంకారంతో కావొచ్చు. కానీ 175 స్థానాల్లో ఒక సీటే గెలిచిన జనసేన అభిమానులు సైతం ఇలానే బైక్‌ నంబర్‌ ప్లేట్‌పై అంకెలు లేకుండా రోడ్డుపై దూసుకుపోతున్నారు. అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమైనా, టీడీపీ అయినా, హిట్లర్‌ రాజైనా జనసేన నేతలు అసలు వెనక్కి తగ్గరు. వారి కాన్ఫిడెన్స్‌ ముందు బిల్‌గేట్స్‌ కూడా పనికిరాడు.

మేమేం తక్కువ కాదు:
ఇటు తెలంగాణలోనూ ఈ తరహా ట్రెండ్‌ మొదలైనట్టే కనిపిస్తోంది. మతం రుద్దుడులో అందరికంటే ముందుండే బీజేపీ నాయకులే ఈ ట్రెండ్‌కు బీజం వేసినట్టుగా అర్థమవుతోంది. కామారెడ్డిలో ఇటీవలి మొత్తం ‘నమో’మయంగా మారిన బైక్‌ నంబర్‌ ప్లేట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అది కూడా ఎమ్మెల్యేది. మరి చూడాలి గులాబీ సార్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు ఎలాంటి నంబర్‌ ప్లేట్లతో దూకుతారో!

Also Read: :డార్విన్ సిద్ధాంతం! ప్రతి జీవి కథ. మతాలు పెట్టే పేచీ!

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *