పిల్లలు పుట్టగానే తల్లి దగ్గరకి తీసుకొని హత్తుకుంటుంది. పుట్టిన బిడ్డ మొట్టమొదటిసారి అమ్మ పాలే తాగుతారు. ఆ క్షణం తల్లి ఆనందం అంతాఇంతా కాదు..కానీ ఇప్పుడు మీకు హృదయాన్ని కదిలించే ఒక విషయం చెప్తాను. బిహార్‌లో జరిగిన ఒక కొత్త అధ్యయనం ఈ రహస్యాన్ని వెలికితీసింది. యురేనియం అనే రేడియోయాక్టివ్ మెటల్, తల్లుల పాలలో కనుగొనబడింది. యురానియం అంటే ఏమిటో తెలుసా? అది న్యూక్లియర్ బాం*బ్స్ తయారీలో ఉపయోగించేది. కానీ ఇప్పుడు అది బిహార్‌లోని మాతృల పాల్లో కనుగొంది. అవి పాలు కాదు పిల్లలకు విషం అని తేలింది. తల్లి పాలు తాగితే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.. ఇంతకి ఈ యురేనియం పిల్లల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఏం చేయాలి?
బిహార్(Bihar)లోని గంగా లోయల్లో.. ఆర్సెనిక్.. లెడ్.. మెర్క్యురీ వంటి భారీ మెటల్స్‌కు చెందిన విషపు ప్రభావం ఇంతకు ముందే కనుగొనబడింది. కానీ ఇప్పుడు యురేనియం(Uranium) అనే కొత్త విషం పాలలో గుర్తించారు. ఈ పరిశోధన సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. మహావీర్ క్యాన్సర్ సంస్థన్ పట్నా.. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ.. నిపెర్ హజీపూర్ వంటి సంస్థల శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని బయటపెట్టారు. వారు బిహార్‌లోని ఆరు జిల్లాలు భోజపూర్.. సమస్తీపూర్.. బేగుసరాయి.. ఖగరియా.. కటిహార్.. నాలందా నుంచి 17 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న 40 మంది తల్లుల పాల శాంపిళ్లను సేకరించారు. ప్రతి తల్లి నుంచి అనుమతి తీసుకుని వారి బ్రెస్ట్‌ఫీడింగ్ అలవాట్లు.. పిల్లల గురించి.. నివాస చరిత్ర గురించి సమాచారం తీసుకున్నారు. ఇది మొదటిసారి గంగా ప్రదేశంలో పాలలో యురేనియం పరీక్ష.
మరోవైపు 100 శాతం శాంపిళ్లలో యురేనియం కనుగొనబడింది. అంటే ఒక్క శాంపిల్ కూడా యురేనియం ఫ్రీగా లేదు. కాన్సన్ట్రేషన్ 0.85 మైక్రోగ్రామ్‌లు పర్ లీటర్ నుంచి 5.25 మైక్రోగ్రామ్‌లు పర్ లీటర్ వరకు ఉంది. ఇది యూనిట్స్‌లో చెప్పాలంటే మిక్రోగ్రామ్లు అంటే చాలా తక్కువ. కానీ పిల్లలకు ఇది పెద్ద సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ డ్రింకింగ్ వాటర్‌కు 30 మైక్రోగ్రామ్‌లు పర్ లీటర్ లిమిట్ పెట్టింది కానీ పాలకు ఎలాంటి ఆఫీషియల్ లిమిట్ లేదు. అయినా రేడియోయాక్టివ్ మెటల్ అనేది పిల్లల ఆహారంలో ఉండటం ఆందోళనకరం. ఈ అధ్యయనం యూరేనియం కెమికల్ టాక్సిసిటీని ఎక్కువగా హైలైట్ చేసింది. రేడియేషన్ కంటే ఇది మరింత ప్రమాదకరం.
ఇక జిల్లాల వారీగా చూస్తే ఖగరియాలో యురేనియం లెవల్స్ ఎక్కువగా ఉన్నాయి. సగటు 4.035 మైక్రోగ్రామ్‌లు పర్ లీటర్. తర్వాత సమస్తీపూర్ 3.307.. బేగుసరాయి 3.18.. కటిహార్ 2.736.. భోజపూర్ 2.52.. నాలందా 2.35. కటిహార్‌లో ఒక శాంపిల్‌లో 5.25 అనే హైయెస్ట్ పీక్. ఈ డేటా మ్యాప్స్‌లో చూస్తే భూగర్భ జలాల్లో యురేనియం వ్యాప్తి ఎలా ఉందో అర్థమవుతుంది. ఇది భూమి రసాయనిక వ్యవస్థలు..పర్యావరణ మూలాలతో ముడిపడి ఉంది. బిహార్‌లో 11 జిల్లాల్లో గ్రౌండ్‌వాటర్‌లో యురేనియం ఎక్కువగా ఉంది. సుపౌల్‌లో 82.. నాలందాలో 77.. వైశాలీలో 66 మైక్రోగ్రామ్‌లు.. ఇవన్నీ WHO లిమిట్‌ను మించాయి. ఇది 273 వాటర్ సాంపిళ్ల అధ్యయనం నుంచి వచ్చిన డేటా.
పిల్లలకు ఇది ఎంత ప్రమాదకరం?
శాత్రవేత్తలు మోంటే కార్లో సిమ్యులేషన్ అనే స్టాటిస్టికల్ మెథడ్ ఉపయోగించి 10 వేల ఇటరేషన్స్ రన్ చేశారు. ఫలితం ఏంటంటే 70 శాతం పిల్లలు నాన్-క్యాన్సర్ హెల్త్ ఎఫెక్ట్స్‌కు రిస్క్‌లో ఉన్నాయి. పిల్లల తల్లుల కంటే ఎక్కువ డేంజర్లో ఉన్నాయి ఎందుకంటే వాళ్ల అవయవాలు ఇంకా అభివృద్ధి చెందుతున్నాయి.. బాడీ వెయిట్ తక్కువ.. యురేనియంను బాడీ నుంచి త్వరగా తీసివేయలేరు. క్యాన్సర్ రిస్క్ లేదు కానీ కిడ్నీ డ్యామేజ్.. న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్.. కాగ్నిటివ్ ఇష్యూస్.. బిహేవియరల్ డిసార్డర్స్.. బోన్ గ్రోత్‌లో సమస్యలు.. ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్లో ఆటంకం.. మోటార్ స్కిల్స్‌లో డిలేలు ఇవన్నీ సాధ్యమవుతాయి. యురేనియం బ్లడ్-బ్రెయిన్ బారియర్.. ప్లాసెంటల్ బారియర్‌ను క్రాస్ చేస్తుంది. బ్రెయిన్ డెవలప్మెంట్కు హాని చేస్తుంది. ఇండియాలో 18 రాష్ట్రాల్లో 151 జిల్లాల్లో గ్రౌండ్‌వాటర్‌లో యురేనియం సమస్య.. బిహార్‌లో 1.7 శాతం సోర్సెస్ ఆఫెక్టెడ్. గ్లోబల్‌గా కెనడా.. అమెరికా.. ఫిన్లాండ్.. బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా ఇది పెద్ద సమస్య.
ఈ యురేనియం ఎక్కడి నుంచి వస్తుంది?
మెయిన్ సోర్స్ గ్రౌండ్‌వాటర్.. బిహార్ ప్రజలు డ్రింకింగ్ వాటర్.. వ్యవసాయానికి భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడతారు. జియోజెనిక్ సోర్సెస్ యురేనియం అధికంగా ఉన్న రాళ్లు.. ఓవర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ వాటర్.. ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్స్.. ఇండస్ట్రియల్ ఎఫ్లూఎంట్స్.. పూర్ ట్రీటెడ్ వాస్ట్వాటర్ ఇవన్నీ కారణాలు. పాలలో లెవల్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఇది రీసెంట్ ఎక్స్పోజర్ను చూపిస్తుంది. యురేనియం బోన్స్.. కిడ్నీల్లో అక్యుమ్యులేట్ అవుతుంది. పాలలో బైయోఅక్యుమ్యులేట్ కాదు. అందుకే రెసిడెన్షియల్ డ్యూరేషన్‌తో వీక్ అసోసియేషన్. మహిళలు డ్రింక్ చేసే వాటర్.. డైట్ నుంచి వస్తుంది.
తల్లులు బ్రెస్ట్‌ఫీడింగ్ ఆపేయాలా?
అబ్సల్యూట్గా కాదు! అధ్యయనం స్పష్టంగా చెబుతోంది పాలు పిల్లలకు బెస్ట్ న్యూట్రిషన్.. ఇమ్యూనాలజికల్ బెనిఫిట్స్ ఇస్తాయి. యురేనియం లెవల్స్ WHO లిమిట్ కంటే చాలా తక్కువ. 5.25 మైక్రోగ్రామ్‌లు vs 30. మెజారిటీ యురేనియం మెథర్ యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. పాలలో కాన్సన్ట్రేట్ కాదు. ఫార్ములా మిక్స్ చేస్తే అది కంటామినేటెడ్ వాటర్‌తో చేస్తారు అది మరింత డేంజర్. డాక్టర్ అశోక్ శర్మ.. AIIMS ఢిల్లీ.. చెప్పారు. బ్రెస్ట్‌ఫీడింగ్ కంటిన్యూ చేయాలి.. క్లినికల్ ఇండికేషన్ లేకుండా ఆపకూడదు. ఇది పబ్లిక్ హెల్త్ కన్సర్న్ కాదు లెవల్స్ తక్కువ అని NDMA సైంటిస్ట్ డాక్టర్ దినేష్ కె అస్వల్ చెప్పారు.
అయితే, ఏమి చేయాలి?
స్టేట్‌వైడ్ బయోమానిటరింగ్.. రెగ్యులర్ గ్రౌండ్‌వాటర్ టెస్టింగ్.. లాక్టేటింగ్ మాతృలకు అడ్వైజరీస్.. రీసెర్చ్ ఆన్ యూరానియం మొబిలిటీ ఇన్ వాటర్.. సాయిల్.. ఫుడ్. RO సిస్టమ్స్ లాంటి ఫిల్టర్స్ ఉపయోగించండి. రీసెర్చ్ టీమ్ బిహార్ సీఎం నితీష్ కుమార్‌ను కలవబోతోంది యాక్షన్ తీసుకోవాలని అడుగుతోంది.

Rationalist Files: ‘ఆమెను మోసం చేశారు..’ నిజమైన హేతువాదం సోషల్‌మీడియాలో కాదు.. నిజ జీవితంలో కనిపించాలి..! సిద్ధాంతాల వెనుక దాక్కునే పిరికితనం!
Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Marriage System: ఇది పెళ్లి కాదు..దోపిడి..! ఇదేం సన్నాసి సంత.. ఇంతటి నీతిమాలిన వివాహ వ్యవస్థ ఎక్కడా ఉండదు!
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?
Business Ideas: ఈ 6 బిజినెస్ ఐడియాస్తో మీరు లక్షలు సంపాదించవచ్చు.. పెట్టుబడి కూడా చాలా తక్కువ!