అందరూ ఎంతగానో ఎదురుచూసే దసరా సేల్ వచ్చేసింది. ఆఫర్లు ఎప్పుడు వస్తాయా, సంవత్సరం అంతా డబ్బు పోగేసి, మనకు కావాల్సింది కొనుక్కుందామని ఎదురుచూసే సగటు మధ్యతరగతి వ్యక్తి కోసం ప్రముఖ ఈ-కామర్స్ షాపింగ్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు తమ సేల్ తేదీలను ప్రకటించాయి.
అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నిర్వహించే సేల్ ఈనెల సెప్టెంబర్ 27 నుండి మొదలయి అక్టోబర్ 6న ముగుస్తుంది. కానీ అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి, ఫ్లిప్కార్ట్ లో ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 26వ తేదీన సేల్ లో కొనవచ్చు.
ఈ సేల్ లో అందరూ ముఖ్యంగా ఎదురుచూసేది మొబైల్ ఫోన్స్ కోసం.
ఒకప్పుడు కాస్త ఖరీదు చేసిన 5G మొబైల్స్ ఇప్పుడు తక్కువలో వస్తున్న 10 వేల లోపు నుండి 20వేల వరకు ఆ బడ్జెట్ రేంజ్ లోమంచి ఫోన్స్ ఏం ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
అమేజాన్ లో SBI క్రెడిట్, డెబిట్ కార్డుల మీద, ఫ్లిప్‌కార్ట్ లో హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) క్రెడిట్, డిబిట్ కార్డుల మిద ఆఫర్లు ఉన్నాయి..బజాజ్ నో కాస్ట్ EMI కూడ లభిస్తుంది.
10,000 లోపు:
ఎంట్రీ లెవల్ బడ్జెట్ లో 5 మొబైల్స్ ఉత్తమ ఫీచర్స్ తో ఉన్నాయి.
1. Poco M6
4GB RAM-64GB స్టోరేజ్ వేరియంట్ 5000mAh బాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో 6.74 HD+ డిస్ప్లే తో వస్తుంది. దీని ధర ఫ్లిప్‌కార్ట్ లో ₹7,999 కే లభిస్తుంది. ఐసిఐసిఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా ₹500 అదనపు డిస్కౌంట్ ఉంది.
2. Redmi 13C
50MP AI కెమెరా, 4GB RAM 128GB స్టోరేజ్ తో 5000mAh బాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది (కానీ బాక్స్ లో 10W ఛార్జర్ లభిస్తుంది.)
₹9,999 బడ్జెట్ లో క్లీన్ ఆండ్రాయిడ్ తో ఉన్న క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్ తో 4GB RAM 128 మెమొరి 120Hz ఎల్సిడి డిస్ప్లే తో 5000mAh బాటరీ 18W చార్జింగ్ (బాక్స్ లో 20W చార్జర్ వస్తుంది)
4. Samsung A14
సామ్ సంగ్ లవర్స్ కోసం ₹9,999 కే ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ బడ్జెట్ లో ఉన్న ఒకే ఒక్క ఫుల్ హెచ్ డి+ డిస్ప్లే 6.6 ఇంచ్ ఫోన్ ఇది. 5000mAh బాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ తో ఉంది.
5. IQOO Z9 lite
మీడియాటెక్ డైమండ్ సిటీ 6300 ప్రాసెసర్ తో, 5000mAh బ్యాటరీ 15W ఛార్జింగ్ తో 50MP AI కామెరా తో ఉంటుంది. బ్యాంకు ఆఫర్ తో ₹9,499 కే అమెజాన్ లో లభిస్తుంది.
10వేల పైనుండి 20వేల వరకు బడ్జెట్
6.5 ఫుల్ హెచ్+ Amoled డిస్ప్లే, 6000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ తో, మీడియాటెక్ డైమండ్ సిటీ 6100+ ప్రాసెసర్ తో వస్తుంది. ధర 10,999.
మిడియాటెక్ డైమండ్ సిటీ 7300 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ 5W వైర్లెస్ ఛార్జింగ్ తో గేమింగ్ కి మంచి ఫోన్. ఫ్లిప్‌కార్ట్ లో ₹12,999 కు లభిస్తుంది.
3. Samsung M35:
6.67 Amoled డిస్ప్లే, సామ్ సంగ్ కే చెందిన Exynos 1380 ప్రాసెసర్ తో 50MP OIS మెయిన్ కెమెరా 8MP వైడ్ యాంగిల్ తో మంచి కెమెరా ఉంది. 6GB RAM 128GB మెమరీ. ధర: 13,749
4. Poco X6 :
6.67 Amoled 1.5k డాల్బీ విజన్ డిస్ప్లే తో స్నాప్ డ్రాగన్ 7s Gen2 ప్రాసెసర్ 64MP OIS మెయిన్ కెమెరా 5100mAh బ్యాటరీ 67W ఫాస్ట్ ఛార్జింగ్, గొరిల్లా విక్టస్ 1 గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ధర: 14,999
మిడియాటెక్ 7300 ప్రాసెసర్ 6.67 OLED డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ తో , IP 65 వాటర్ – డస్ట్ రెసిస్టెంట్ తొ వస్తుంది. ధర : 14,999
జనరల్ వాడకానికి, క్లీన్ ఆండ్రాయిడ్,POLED డిస్ప్లే తో,వేగన్ లెదర్ ఫినిష్ 50MP మెయిన్ కెమెరా. 5000mAh బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ధర: 15,999
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782G ప్రాసెసర్,5000mAh బ్యాటరీ – 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP OIS కెమెరా తో లభిస్తుంది. ధర: 15,749.
8. Poco X6 pro:
మీడియాటెక్ డైమండ్ సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ తో గేమింగ్ కోసం మంచి మొబైల్ ఇది. 1.5k Amoled డిస్ప్లే, 5000mAh – 67W ఫాస్ట్ ఛార్జింగ్ 8GB RAM- 256GB మెమరీ తో లభిస్తుంది. ధర: 18,999
క్లీన్ ఆండ్రాయిడ్ తో, IP 68 వాటర్ – డస్ట్ రెసిస్టెంట్, గొరిల్లా గ్లాస్ 5 ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్స్,5000mAh బ్యాటరీ 68W టర్బో చార్జింగ్, 50MP+13MP బ్యాక్ కెమెరా తో మంచి ఫొటోస్ వస్తాయి.(గేమింగ్ కి సహకరించదు) ధర: 19,999
ఇవి 10 వేల లోపు నుండి 20 వేల లోపు ఉన్న మంచి మొబైల్స్.
పైన పేర్కొన్న ధరలు కొన్ని బ్యాంక్ ఆఫర్ తో కలిపి ఉన్నాయి.
(NOTE: ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ లో ధరలు ఎప్పుడైనా మారొచ్చు, ఇక్కడ పేర్కొన్న ధరలు ఆయా వెబ్ సైట్లు అధికారికంగా ప్రకటించినవి.)