Menu

Shreyas-Ishan: అబద్ధాలకు చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం.. ఆ ఇద్దరిని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కిన బీసీసీఐ!

Praja Dhwani Desk

BCCI Annual Contract News: బద్ధకం, అబద్ధం.. ఈ రెండిటికి చెల్లించుకో తప్పదు భారీ మూల్యం. ఎంత టాలెంటెడ్‌ ప్లేయర్‌ అయినా క్రమశిక్షణ లేకపోతే కెరీర్‌కి ఎండ్‌ కార్డ్‌ పడినట్టే లెక్కా. ఏదో యూనిక్‌ స్కిల్‌ ఉంటే తప్ప క్రమశిక్షణ లేకుండా నడుచుకునే ప్లేయర్లను భారత్‌ క్రికెట్‌ బోర్డు(BCCI) ఎప్పటికి ఉపేక్షించదు. నిన్నగాక మొన్న టీమిండియాలోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer), ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan)కి ఎంత బలుపు, బద్ధకం ఉందో వారి ఆటలోనే కనిపిస్తుంటుంది. న్యూఇయర్‌ ఎంజాయ్‌మెంట్‌ కోసం ఆరోగ్యం బాలేదని దక్షిణాఫ్రికా సిరీస్‌ను మధ్యలోనే వదిలేసి దుబాయ్‌ చెక్కేసిన ఇషాన్‌కిషన్‌ ఆ ఒక్క అబద్ధంతో తన కెరీర్‌నే ప్రమాదంలో పడేసుకున్నాడు. ఇటు ఆట తక్కువ ఆటిట్యూడ్‌ ఎక్కువగా ఉన్నట్టు అనిపించే శ్రేయస్‌ అయ్యర్‌ ఏకంగా తనకు గాయం తగిలినట్టు పెద్ద డ్రామానే క్రియేట్ చేశాడు. రంజీలు ఆడడానికి బద్ధకం కాబోలు.. హ్యాపీగా ఐపీఎల్‌ ఆడుకోవచ్చులే అని ఇంజ్యూరీ యాక్టింగ్‌ చేశాడు. తీరా బీసీసీఐకి అసలు విషయం తెలిశాక అతని ఏం చేయాలో అది చేసింది. ఈ ఇద్దరిని ఎక్కడ తొక్కలో అక్కడ తొక్కింది.

వారి పేర్లే లేవు:
ప్రతి ఏడాది బీసీసీఐ ప్లేయర్లకు వార్షిక కాంట్రాక్టను అనౌన్స్ చేస్తుంది. ఏ ఆటగాడు ఏ లిస్ట్‌లో ఉన్నాడో.. వారికి ఏడాదికి ఎంత చెల్లిస్తున్నామో అఫిషియల్‌గా ప్రకటిస్తుంది. ఈ ఏడాది కూడా కాంట్రాక్ట్‌ ప్లేయర్ల లిస్ట్‌ను బీసీసీఐ ప్రకటించగా.. ఈ జాబితాలో శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ పేర్లు కనిపించలేదు. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో శ్రేయస్‌ 500కు పైగా పరుగులు చేశాడు. భారత్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అటు ఇషాన్‌ కిషన్‌ ఖాతాలో ఇప్పటికే ఓ వన్డే డబుల్ సెంచరీ ఉంది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్ బీసీసీఐను రెండుసార్లు చీట్ చేసేందుకు ట్రై చేసి అడ్డంగా దొరికిపోయాడు. న్యూఇయర్‌ సెలబ్రేషన్‌ కోసం సౌతాఫ్రికా సిరీస్‌ నుంచి లీవ్‌ తీసుకున్నాడు. బీసీసీఐకి మాత్రం అనారోగ్య కారణాలు చెప్పుకొచ్చాడు.

ఇంజ్యూరీ యాక్టింగ్‌:
మరోవైపు ప్రతిభకు కొలమానంగా నిలిచే రంజీ సీజన్‌ నడుస్తోంది. ఇటు ఇషాన్‌ మాత్రం ఐపీఎల్‌ ఆడేందుకు రంజీల నుంచి కామ్‌గా తప్పుకున్నాడు. హార్దిక్‌ పాండ్యాతో కలిసి ఐపీఎల్‌ కోసం ప్రాక్టీస్‌కు వెళ్లాడు. దీంతో బీసీసీఐకి చిర్రెత్తుకొచ్చింది. కనీసం 4-5 రంజీలు ఆడని వారికి ఐపీఎల్‌లో ఆడే ఛాన్స్‌ లేదని కుండబద్దలు కొట్టింది. ఇటు శ్రేయస్‌ అయ్యర్‌ అయితే మరింత ఘోరం. ఇంగ్లండ్‌పై తొలి రెండు టెస్టుల్లో ఫెయిలైన అయ్యర్‌ను సెలక్టర్లు 3,4,5 టెస్టు మ్యాచ్‌లకు ఎంపిక చేయలేదు. దీంతో అయ్యర్‌ కొత్త డ్రామాకు తెరలేపాడు. ఎక్కడ రంజీలు ఆడాల్సి వస్తుందోనని తనకు గాయమైందని బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. అటు నేషనల్‌ క్రికెట్‌ అకాడమి మాత్రం అయ్యర్‌కు ఎలాంటి గాయంకాలేదని..అతను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐకి రిపోర్ట్ చేసింది. దీంతో అయ్యర్‌కు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. ఈ ఇద్దరు ఆడిన అబద్ధాలకు బీసీసీఐ తగిన చర్యలు తీసుకుంది. ఏకంగా వార్షిక కాంట్రాక్ట్‌ ప్లేయర్ల లిస్ట్‌లో ఇద్దరిని తప్పించింది.

Also Read: అభిమానుల మద్దతుతో వచ్చిన ఆటగాడు.. సర్ఫరాజ్‌ తండ్రి కన్నీళ్లే సాక్ష్యం..!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *