సముద్రం అంటేనే మనకు గుర్తొచ్చేది పెద్ద పెద్ద అలలు..జోరు గాలి! ఒడ్డున కూర్చొని ఆ ప్రకృతిని ఆనందిస్తుంటాం. ఒకవైపు రకరకాల చేపలు..మరోవైపు గవ్వలు..సముద్రం పక్కనే ఇసుకలో ఆడుకుంటూ పిల్లలు అల్లరి చేస్తుంటారు. సముద్రపు లోతుకి వెళ్లి ఎంజాయ్ చేసే వాళ్లూ ఉన్నారు. కానీ సముద్రంలో ఒక పెను ప్రమాదం దాగి ఉంది. అదేంటంటే అగ్నిపర్వతం. అది ఎప్పుడైనా పెలోచ్చు. ఈ అగ్నిపర్వతం పేరు ఆక్సియల్ సీమౌంట్. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఒరెగాన్ తీరం నుంచి 300 మైళ్ల దూరంలో, సముద్రం ఉపరితలం కంటే సుమారు 4,900 అడుగుల లోతులో ఉంది. ఈ అగ్నిపర్వతం ఉత్తర పసిఫిక్ ప్రాంతంలో అత్యంత చురుకైన అగ్నిపర్వతంగా ఉంది. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నారు. ఈ అగ్నిపర్వతం 1998, 2011, 2015 సంవత్సరాల్లో పేలింది. ఇప్పుడు మళ్లీ దీని నుంచి కొన్ని అసాధారణ సంకేతాలు వస్తున్నాయి. ఇది 2025 చివరి నాటికి పేలవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
భూకంపాల జోన్!
జూన్ 2024లో ఒకే రోజులో 2,000 కంటే ఎక్కువ భూకంపాలు ఈ ప్రాంతంలో సంభవించాయి. ఆ తర్వాత భూకంపాల సంఖ్య రోజుకి 100కి తగ్గినప్పటికీ ఇది సాధారణం కంటే ఎక్కువే. ఇంకా ఈ అగ్నిపర్వతం బెలూన్ లాగా ఉబ్బుతోంది. దీని అర్థం లోపల ద్రవ రాళ్లు అంటే మాగ్మా పేరుకుపోతోంది. ఈ రెండు సంకేతాలు అంటే భూకంపాలు, ఉబ్బడం చూస్తే ఈ అగ్నిపర్వతం త్వరలో పేలవచ్చని సైంటిస్టులు అంటున్నారు.
పేలితే ప్రమాదమా?
మరోవైపు ఈ అగ్నిపర్వతం సముద్రంలో చాలా లోతులో తీరానికి చాలా దూరంలో ఉంది. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త విలియం చాడ్విక్ చెప్పినట్లు గత 20 ఏళ్లలో ఈ అగ్నిపర్వతం నుంచి వచ్చిన పేలుళ్లు చాలా చిన్నవి. ఒకవేళ మీరు పడవలో ఈ అగ్నిపర్వతం పైన ఉన్నా ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఇది సునామీలను కలిగించదు, భూమిపై భూకంపాలను రేకెత్తించదు. ఈ పేలుడు సముద్ర ఉపరితలంపై ఎలాంటి ప్రభావం చూపదు కానీ సముద్ర గర్భంలో లావా ప్రవహిస్తుంది
అగ్నిపర్వతాలు ఎప్పుడు పేలుతాయి?
ఈ అగ్నిపర్వతం ఎందుకు ముఖ్యమైనదంటే..ఆక్సియల్ సీమౌంట్ పసిఫిక్ ఉత్తర ప్రాంతంలో అత్యంత చురుకైన అగ్నిపర్వతం..దీన్ని పరిశీలించడానికి శాస్త్రవేత్తలు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. సముద్ర గర్భంలో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా రియల్ టైమ్ డేటాను సేకరిస్తున్నారు. ఈ అగ్నిపర్వతం దాదాపు ప్రతి 10-15 సంవత్సరాలకు ఒకసారి పేలుతుంది కాబట్టి ఇది అగ్నిపర్వతాల అధ్యయనానికి ఒక సహజ ప్రయోగశాల లాంటిది. దీని ద్వారా శాస్త్రవేత్తలు అగ్నిపర్వతాలు ఎలా పనిచేస్తాయి, ఎప్పుడు పేలుతాయి అని ముందుగానే ఊహించే విధానాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పరిశోధన భవిష్యత్తులో భూమిపై ఉన్న అగ్నిపర్వతాల పేలుళ్లను ముందుగా గుర్తించడానికి సహాయపడుతుంది అనేక ప్రాణాలను కాపాడవచ్చు.
ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ అగ్నిపర్వతం వద్ద హైడ్రోథర్మల్ వెంట్స్ అనే ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇవి సముద్ర గర్భంలో ఉన్న వేడి నీటి ఊటలు, అనేక రకాల సముద్ర జీవులు, బ్యాక్టీరియా, ఆక్టోపస్, ట్యూబ్‌వార్మ్స్ వంటివి జీవిస్తాయి. ఈ పేలుడు వాటిని కొంతమేర ప్రభావితం చేసినప్పటికీ కొన్ని నెలల్లోనే ఈ జీవులు మళ్లీ తిరిగి వస్తాయి. ఇది సముద్ర జీవవైవిధ్యం బలాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆక్సియల్ సీమౌంట్ మనకు ఒక రహస్యమైన ప్రపంచాన్ని చూపిస్తోంది. ఇది మనకు ఎలాంటి హాని చేయదు కానీ శాస్త్రవేత్తలకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. 2025లో ఈ అగ్నిపర్వతం పేలితే అది మొదటిసారిగా లైవ్ స్ట్రీమ్ చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు అది ఒక చారిత్రక క్షణం అవుతుంది.

Hayli Gubbi Volcano: ఇథియెపియా అగ్నిపర్వత విస్ఫోటనం గురించి సంచలన నిజాలు.. శాటిలైట్ చిత్రాలు చెబుతున్నది ఏంటంటే?
Breast Milk Uranium: తల్లి పాలల్లోనూ విషం.. సైంటిస్టుల స్టడీలో షాకింగ్ నిజాలు!
Ethiopia Volcano Eruption: ఇండియావైపు దూసుకొచ్చిన భారీ బూడిద.. ఆ అగ్నిపర్వతం పేలుడుతో ముప్పు పొంచి ఉందా?
Moon Endangered: జాబిల్లికి కష్టాలు..! చంద్రుడు కనిపించకుండా పోతాడా?
Human Brain: కొంతమంది వ్యక్తులకు భయమే తెలియదా? మన మెదడు చెబుతున్న షాకింగ్ ఫ్యాక్ట్ ఇదే!
Mount Semeru Volcano: ఆ అగ్నిపర్వతం పేలితే ఏమౌతుంది? వాల్కెనో మిస్టరీస్ ఆఫ్ ది వరల్డ్!