Menu

Corona Cricket: ఇదెక్కడి గోలరా మావా.. కరోనా పాజిటివ్‌గా తేలినా ఆడిస్తున్నారు!


బౌలింగ్ చేసే సమయంలో వికెట్లు పడినప్పుడు గ్రీన్ దూరంగా ఉంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.


Sumanth Thummala

Cameron Green Playing with Corona: కరోనా వస్తే ఐసోలేషన్‌లో ఉండే రోజులు పోయాయి. కరోనా ఎప్పుడో జలుబు స్థాయికి పడిపోయింది కూడా. కరోనాని దాదాపు ప్రపంచమంతా లైట్‌ తీసేసుకుంది. ఆ కొత్త వేరియంట్‌..ఈ కొత్త సబ్‌ వేరియంట్ అంటూ కొన్నాళ్లు వార్తలు చక్కర్లు కొట్టినా అది ఏ న్యూస్‌ దొరక్క మీడియా హైలెట్‌ చేసే వేరియంట్లే తప్ప పెద్దగా ముప్పుగా మారిన స్ట్రెయిన్లు లేవు. కరోనా సోకిన తర్వాత బయటకొస్తే కఠిన శిక్షలు పడే రోజులు పోయి.. ఏకంగా గ్రౌండ్‌లోకి బరిలోకి దూకే రోజులొచ్చేశాయి. ఇది ఏ గల్లిలోనో అనుకుంటే ఉప్పు లేని పప్పులో కాలేసినట్టే. ఓ అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లో ఓ ఆటగాడు కరోనాతోనే బరిలోకి దిగాడు.


ఇలా ఎలా ఆడిస్తారు?
తాజాగా మొదలైన ఆస్ట్రేలియా వర్సెస్ విండీస్ రెండో టెస్ట్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్, కోచ్ ఆండ్రూ మెక్ డోనాల్డ్ ఇద్దరూ కోవిడ్ బారిన పడ్డారు. అయితే కోవిడ్ వచ్చినప్పటికీ కూడా గ్రీన్‌ బరిలోకి దిగాడు. అంతేకాదు బౌలింగ్‌ కూడా వేశాడు. అయితే జాతీయ గీతం పాడుతున్నప్పుడు మాత్రం మిగతా ఆటగాళ్లకు ఆరడుగుల దూరం నిలబడ్డాడు. ఇక బౌలింగ్ చేసే సమయంలో వికెట్లు పడినప్పుడు గ్రీన్ దూరంగా ఉంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.


అదే బాల్‌ని పట్టుకుంటారు కదా?
ఇక్కడే అభిమానులకు ఓ ప్రశ్న తలెత్తింది. సెలబ్రేషన్‌ దూరంగా ఉండి చేసుకుంటున్న గ్రీన్‌తో బౌలింగ్‌ వేయిస్తున్నారు కదా.. అదే బంతితో ఇతర ఆటగాళ్లూ బౌలింగ్‌ చేస్తున్నారు కదా. మరి ఇది కరోనా వ్యాప్తికి కారణం అవొచ్చు కదా..! ఇలా కోవిడ్ బారిన పడ్డ ప్లేయర్‌ను ఎందుకు ఆడిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీన్ని కొందరు సరదగా తీసుకుంటుండగా.. మరికొందరు మాత్రం ప్రాణాలతోనే ఆటలా అని సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. జాతీయగీతం పాడేటప్పుడు పక్కనే నిలబడడానికి అవకాశం లేనప్పుడు ఆటలో ఎలా ఆడతాడ అని క్వశ్చన్‌ చేస్తున్నారు. ఫ్యాన్స్‌ లాజిక్‌లో అర్థం ఉంది. ఎందుకంటే గ్రీన్‌ పట్టుకున్న బాల్‌నే ఇతరులు కూడా పట్టుకుంటారు కదా.. తను బౌలింగ్ వేసినప్పుడు ఫీల్డర్లు అదే బంతిని ఆపుతున్నారు కూడా‌. మరి జాతీయ గీతం పాడేటప్పుడు మాత్రం దూరంగా నిలబెట్టడంలో అర్థమేముంది? అయితే కోవిడ్ కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో గ్రీన్ ని ఆడిస్తున్నారని తెలుస్తోంది. అటు మొదటి టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ కోవిడ్ కూడా బారిన పడ్డాడు.


డే అండ్‌ నైట్:
బ్రిస్బేన్ లోని గబ్బాలో జరుగుతున్న రెండవ టెస్ట్ డే/నైట్ మ్యాచ్ కావడం విశేషం. పింక్ బాల్ టెస్టుల్లో ఆస్ట్రేలియాకు అజేయమైన రికార్డు ఉంది. 11 మ్యాచ్ లు ఆడితే అన్నిటిలోనూ విజయం సాధించింది. ఈ రెండో టెస్ట్ లో కూడా ఆస్ట్రేలియా పట్టు బిగిస్తుంది. మిచెల్ స్టార్క్ అద్భుతంగా రాణించాడు. టెస్టుల్లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఆస్ట్రేలియాకు అత్యధిక టెస్టులు వికెట్లు తీసిన ఐదవ బౌలర్ గా స్టార్క్ నిలిచాడు. వెస్టిండీస్ తో మొదటి టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్లతో గెలిచింది.


Also Read: బాజ్ బాల్ వర్సెస్ స్పిన్‌ బాల్‌ పోటీలో బాస్‌ ఎవరు? తుది జట్టు ఇవే!

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *