Menu

Disasters in Asia: వీధిన పడ్డ బతుకులు.. ఆసియాపై పగబట్టిన ప్రకృతి.. లక్షలమంది బలి!

Archana 2 months ago
Severe floods hit Asia's top tourist destinations, leaving thousands dead, injured Nearly 600 people have already died in Indonesia, while over 350 people have lost their lives in Sri Lanka.

థాయ్‌లాండ్(Thailand) బీచ్‌లలో సూర్యాస్తమయం చూస్తూ కాఫీ తాగుతు ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు..వియత్నాం(Vietnam) గ్రీన్ ఫీల్డ్స్‌లో సైకిల్ రైడ్ చేస్తూ షికార్లు కొడుతున్నారు..శ్రీలంక(Srilanka)లో ఎలిఫెంట్స్‌తో ట్రెక్కింగ్ చేస్తున్నారు. అలా పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆకాశం నల్లగా మారిపోయింది..భయంకరమైన ఉరుములు..ఈదురు గాలులు..కుండపోత..ఆసియా దేశాలపై ప్రకృతి పగ పట్టింది. ఒక్కసారిగా భారీ వరదల్లో లక్షలాది మందిని బలితీసుకుంది. టూరిస్ట్ ప్యారడైజ్‌లు డిజాస్టర్ జోన్‌లుగా మారాయి. ఆసియా దేశాల్లో జరిగిన ఈ మహా ప్రకృతి విపత్తు వెనుక ఏముంది? టూరిజం పరిశ్రమకు ఇది ఎంత దెబ్బ తీసింది?

తుఫాన్లతో అల్లకల్లోలం:

నవంబర్ 2025లో ఆసియా మొత్తం తుఫానులతో కుంగిపోయింది. ఇండోనేషియాలో 600 మందికి పైగా మరణించారు, శ్రీలంకలో 350 మంది ప్రాణాలు కోల్పోయారు. థాయ్‌లాండ్‌లో 176 మంది, ఫిలిప్పీన్స్‌లో 200 మంది మరణించారు. వియత్నాం, మలేషియా, ఇండియా వరకు ప్రభావం. సెన్యార్, దిత్వా తుఫాన్లు భారీ వర్షాలు తెచ్చాయి. ల్యాండ్‌స్లైడ్‌లు, ప్రవాహాలు సృష్టించాయి. మొత్తం 1300 మందికి పైగా చనిపోయారు. లక్షలాది మంది గాయపడ్డారు లేదా ఇళ్లు కోల్పోయారు. ఇది కేవలం సంఖ్యలు కాదు ప్రతి ఒక్కరి వెనుక కుటుంబాల కథలు. ఇండోనేషియా సుమాత్రాలో 442 మంది మాత్రమే మరణించగా 464 మంది మిస్‌ అయ్యారు. శ్రీలంకలో ఇది 2004 సునామీ తర్వాత అతిపెద్ద విపత్తు.

రికవరీ ఇప్పట్లో కష్టమే:

మరోవైపు ఆసియా దేశాలు ప్రపంచ పర్యాటకులకు ప్రియమైనవి. థాయ్‌లాండ్, వియత్నాం GDPలో 15 శాతం టూరిజం నుండి వస్తుంది. నవంబర్ నుండి మార్చి వరకు పీక్ సీజన్ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారు. కానీ ఈసారి భయంకరమైన వరదలతో పర్యాటకులను భయపెట్టింది.. ఎయిర్‌పోర్ట్‌లు, రోడ్లు, హోటళ్లు డ్యామేజ్ చేశాయి. బాలీలో బీచ్‌లు మునిగాయి, బ్యాంకాక్ స్ట్రీట్స్ నదుల్లా మారాయి. శ్రీలంకలో కోలంబోలో రికార్డ్ లెవల్స్ ఫ్లడింగ్. పర్యాటకులు క్యాన్సిలేషన్స్ చేస్తున్నారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పెరిగాయి. ఆర్థిక నష్టం 20 బిలియన్ డాలర్లు , థాయ్‌లాండ్‌లో 781 మిలియన్ డాలర్లు మాత్రమే సౌత్‌లో క్రాప్స్, ఇండస్ట్రీలు ఆగిపోయాయి. టూరిస్ట్ అట్రాక్షన్స్ క్లోజ్ అయ్యాయి. ఇది రికవరీకి సంవత్సరాలు పట్టవచ్చు.

వీధిన పడ్డ బతుకులు:

ఇక రెడ్ అలర్ట్స్, ప్రొటెస్ట్‌లు కూడా జరుగుతున్నాయి. ఇండియా కోస్టల్ ఏరియాల్లో రెడ్ అలర్ట్, చక్రవాతం ఇండియాకు వస్తోంది. శ్రీలంక నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది, డిట్వాను అతిపెద్ద డిజాస్టర్ అని చెప్పింది. థాయ్‌లాండ్‌లో ఫ్లడ్స్ రికార్డ్ హైట్స్ చేరాయి. ఫిలిప్పీన్స్‌లో వేలాది మంది స్ట్రీట్లకు వచ్చారు. ప్రభుత్వ ఫ్లడ్ కంట్రోల్ ప్రాజెక్ట్స్‌లో కరప్షన్, డబ్బులు దొంగిలించారని అల్లుకున్నారు. ఆ ప్రాజెక్ట్స్ పూర్తి కాలేదు అందుకే 200 మంది చనిపోయారు. చర్చ్, సివిల్ సొసైటీ కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నారు, స్టోలెన్ ఫండ్స్ తిరిగి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం డిజాస్టర్ కాదు గవర్నెన్స్ ఫెయిల్యూర్ కూడా.

ALSO READ: వాతావరణ మార్పులతో ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలం..ఈ రాష్ట్రానికి ఏమైంది?

మరోవైపు ప్రపంచం సహాయం చేస్తోంది. జపాన్ థాయ్‌లాండ్‌కు ఎమర్జెన్సీ రిలీఫ్ గూడ్స్ పంపింది, టెంట్స్, బ్లాంకెట్స్, వాటర్ ప్యూరిఫైయర్స్. JICA ద్వారా UK, US, సౌత్ కొరియా, న్యూజిలాండ్ వియత్నాం‌కు హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఇచ్చాయి. ఇండియా ప్రధాని మోదీ శ్రీలంకకు ఆపరేషన్ సాగర్ బంధు ప్రారంభించారు. రిలీఫ్ మెటీరియల్స్, HADR సపోర్ట్ పంపారు. మరిన్ని అవసరాలకు రెడీగా ఉన్నామని చెప్పారు. ఇలా గ్లోబల్ కమ్యూనిటీ కలిసి రికవరీకి సహాయపడుతోంది.ఈ ఫ్లడ్స్ కేవలం వెదర్ కాదు క్లైమేట్ చేంజ్ వార్నింగ్. ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ ఈవెంట్స్ పెరుగుతాయి. మనం ఏమి చేయాలంటే..సస్టైనబుల్ టూరిజం ప్రమోట్ చేయాలి, క్లైమేట్ యాక్షన్ తీసుకోవాలి.

ALSO READ: షేక్‌.. షేకాడిస్తోంది.. నెల రోజుల్లో 1400 భూకంపాలు.. ఆ దేశానికి ఏమైంది?


Written By

S. Archana is an SEO specialist and sub-editor known for her strong adaptability and dedicated work ethic. A committed professional and an eager everyday learner, she continually sharpens her skills to deliver thoughtful, effective results.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *