Menu

AP Rains: 200ఏళ్ళ రికార్డు బద్దలు.. బెజవాడ గజ గజ… ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతమంటే?

Praja Dhwani Desk
vijayawada rains

Vijayawada Rains: అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh)లోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్డు, రైలు రవాణాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా(Krishna), గుంటూరు జిల్లా(Guntur District)ల్లో 12 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం గత కొన్ని దశాబ్దాల్లో ఇదే తొలిసారి. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన అధికారులు.. అటు అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.

200ఏళ్ల రికార్డు బ్రేక్

విజయవాడ(Vijayawada)లో 24 గంటల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. బెంజ్ సర్కిల్ వద్ద 16.1 సెంటీమీటర్లు రికార్డయింది. ఇది గత 200 ఏళ్లలో విజయవాడలో ఆగస్టులో నమోదైన అత్యధిక వర్షపాతం. అటు తాడేపల్లిలో 12.1 సెంటీమీటర్లు, మంగళగిరిలో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

విజయవాడతో పాటు మచిలీపట్నంలో 18 సెంటీమీటర్లు, గుడివాడలో 17 సెంటీమీటర్లు, కైకలూరులో 15 సెంటీమీటర్లు, నరసాపురంలో 14 సెంటీమీటర్లు, అమరావతిలో 13 సెంటీమీటర్లు, మంగళగిరి, నందిగామలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

జాగ్రత్తగా ఉండండి

వర్షాల పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో చంద్రబాబు శనివారం ఒంగోలు పర్యటనను రద్దు చేసుకుని వర్ష పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, చెరువులు, రిజర్వాయర్ల పరిస్థితిని ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయం చేసుకుని పర్యవేక్షించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు నీటి సమస్యను పరిష్కరించాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయాలన్నారు. వర్షాలు, వరదల వల్ల తాగునీరు, ఆహారం కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నీటి కలుషితంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

పెరుగుతున్న మృతుల సంఖ్య

విజయవాడ, గుంటూరు పట్టణాల్లోని అన్ని ప్రధాన కూడళ్లలో రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నై-కోల్‌కతా హైవేపై కాజా వద్ద ఉన్న టోల్‌గేట్ కూడా భారీగా నీట మునగడంతో పలు ట్రక్కులు, ఇతర వాహనాలు కదలడానికి వీలు లేకుండా పోయింది. పలు ప్రాంతాల్లో బైకులు ఇతర వాహనాలు మునిగిపోయాయి. బండరాళ్లు ఇళ్లపై పడటంతో విజయవాడ సున్నపుపట్ల సెంటర్‌లో ముగ్గురు(మేఘన, బొల్లెం లక్ష్మి, లాలూ, అన్నపూర్ణ) చనిపోయారు. ఇక ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలకు మరణించిన వారి సంఖ్య 9కు(సెప్టెంబర్ 1 ఉదయం నాటికి) చేరింది.


Also Read: ప్రకృతి ప్రకోపం..! చరిత్రలో జీవితాలను ముంచేసిన కన్నీటి వరదలు..!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *