America wild fire updates: కార్చిచ్చు రగులుతూనే ఉంది..! వేలాది ఇళ్లను దహిస్తూనే ఉంది..! అగ్నిమాపక సిబ్బంది రేయింబవళ్ళు చెమటోడ్చుతున్నా వారికి సామాన్యులు సైతం మేం సైతం అని అండగా నిలబడుతూ సాయం చేస్తున్నా నిప్పు మాత్రం చల్లారడం లేదు. సలసల మండుతూనే ఉంది. ఇది ఎంతవరకు వెళ్తుందో.. అసలు అగ్ని ఎప్పుడు శాంతిస్తుందో అధికారులు చెప్పలేకపోతుండడం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం. మరోవైపు ఈ అగ్నిప్రమాదం ఎందుకు జరిగిందో కూడా అధికారులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. అటు సోషల్‌మీడియాలో, కొన్ని అంతర్జాతీయ మీడియా వెబ్‌సైట్లలో మాత్రం ఈ అగ్నిప్రమాదం వెనుక కుట్రా కోణం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ ఏంటా కుట్ర? ఇటు అంతర్జాతీయ సమాజం అమెరికాకు ఎలా అండగా నిలుస్తోంది?
This is the most insane video of the Pacific Palisades Fire I’ve seen yet
📍 Los Angeles, California
My jaw just dropped…. pic.twitter.com/gR2KyvfxUz
— Wall Street Apes (@WallStreetApes) January 12, 2025
కావాలనే తగలబెట్టారా?
2025 జనవరి 1న, పసిఫిక్ ప్యాలిసేడ్స్(Palisades)లో ఒక చిన్న అగ్నిప్రమాదం జరిగింది. ఇది 8 ఎకరాల వరకు వ్యాపించింది. అయితే ఈ మంటలు అదే రోజు అదుపులోకి వచ్చాయని అధికారులు ప్రకటించారు. అయితే అది నిజం కాదన్న ప్రచారం జరుగుతోంది. న్యూఇయర్(New Year) సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదమే ప్రస్తుత ప్యాలిసేడ్స్ ప్రమాదానికి కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే లాస్ ఏంజలెజ్ ఫైర్ చీఫ్ క్రిస్టిన్ క్రౌలీ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ఈ రెండు అగ్నిప్రమాదాల మధ్య సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని క్లారిటి ఇస్తున్నారు. అయితే ఈ అంశంపై ఇన్‌వెస్టిగేషన్ మాత్రం కొనసాగుతుందని చెప్పారు.
Another huge water drop from Canadian aerial firefighters battling the wildfires in California. pic.twitter.com/lvkZevZlHj
— Made In Canada (@MadelnCanada) January 9, 2025
ప్రభుత్వ అసమర్థత ఉందా?
అటు మరికొంతమంది వాదన ఇంకోలా ఉంది. ఈ అగ్నిప్రమాదాలకు విద్యుత్ లైన్లు కారణమని చెప్పేవారు కూడా ఉన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే మంటలు ఇంతలా వ్యాపిస్తున్నాయని మండిపడుతున్నారు. మరికొందరు వాతావరణ మార్పులు, పొడి వాతావరణం కారణమని భావిస్తున్నారు. మరికొంతమంది ఈ అగ్నిప్రమాదాలను ప్రభుత్వ కుట్రగా అభిప్రాయపడుతున్నారు. బైడెన్ ప్రభుత్వం పోతూ పోతూ కావాలనే ఈ మంటలు సృష్టించిందని హార్డ్‌కోర్ రిపబ్లికన్ పార్టీ సపోర్టర్లు పోస్టులు పెడుతున్నారు. ఇది డెమొక్రాటిక్ పార్టీ ఉద్దేశపూర్వకంగా సృష్టించిన కార్చిచ్చు అని ట్రంప్ మద్దతుదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ కుట్రా సిద్ధాంతాలకు ఎలాంటి ఆధారాలు లేవు. అధికారికంగా ఈ అగ్నిప్రమాదాల కారణాలుపై ఇప్పటివరకు క్లారిటీ లేదు.
బైడెన్ వర్సెస్ ట్రంప్
మరోవైపు ఈ అగ్నిప్రమాద ఘటనలు రాజకీయంగానూ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా రాజకీయాల్లో వివాదానికి దారితీస్తున్నాయి. ట్రంప్, బైడెన్ మధ్య ఇది ఓ మినీ సైజ్ యుద్ధానికే కారణమైంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే సమయంలో కెనడా నడుచుకుంటున్న తీరు కూడా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ విషాదకర పరిస్థితుల్లో అమెరికాకు అన్నీ విధాల అండగా నిలబడుతోంది కెనడా. అధికారంలోకి వచ్చిన తర్వాత కెనడా-అమెరికా సరిహద్దులను చెరిపేస్తానని.. కెనడాను అమెరికాలో విలీనం చేస్తానని ట్రంప్ ఇటివలే కామెంట్స్ చేశారు. అయితే కెనడా మాత్రం అమెరికాకు పూర్తి సహకారం అందిస్తోంది. ఇప్పటికే 60 మంది అగ్నిమాపక సిబ్బందిని కాలిఫోర్నియాకు పంపించింది. మరోవైపు ట్రంప్ నిత్యం విమర్శించే మెక్సికో సైతం సహాయక చర్యల్లో యాక్టీవ్‌గా పాల్గొంటోంది. అగ్నిమాపక సిబ్బందిని కాలిఫోర్నియాకు పంపింది. ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ 150 మంది అగ్నిమాపక సిబ్బందిని అమెరికాకు పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇలా అమెరికాకు ప్రపంచదేశాల నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇందులో ప్రధానంగా కెనడా ఉండడం ఆసక్తిని కలిగించే అంశం.
లక్షల కోట్ల నష్టం
ఇక ఈ అగ్నిప్రమాదంతో అమెరికా భారీ నష్టాన్ని చవిచూస్తోంది.ప్యాలిసేడ్స్ అగ్నిప్రమాదం 23,713 ఎకరాలను దహించింది, 5,000 కంటే ఎక్కువ నిర్మాణాలను నాశనం చేసింది. ఈటన్ అగ్నిప్రమాదం 14,117 ఎకరాలను దహించి, 1,213 నిర్మాణాలను నాశనం చేసింది. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ అగ్నిప్రమాదం కారణంగా సుమారు 1,53,000 మంది తమ ప్రాంతాలను వదిలి వెళ్లిపోయారు. ఇక జనవరి 12 నాటికి ఈ కార్చిచ్చు కారణంగా అమెరికాకు సుమారు 11 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా!
ఇది కూడా చదవండి: మంటల్లో తగలబడుతోన్న కాలిఫోర్నియా? ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి?