Menu

Ukraine-America: యుక్రెయిన్‌ను దొంగదెబ్బ తీసిన అమెరికా.. ఏకంగా గొంతు కోసేసిందిగా!

Tri Ten B 12 months ago
Ukraine feels betrayed by Donald Trump: ‘What has happened is a stab in the back’

వెన్నుపోటు అనే పదం వినగానే ఒక్కొక్కరికి ఒక్కక్కరు గుర్తుకువస్తారు. ఏపీలో అయితే ఒక లీడర్.. ఇండియాలో అయితే మరో లీడర్‌ గుర్తుకురావొచ్చు.. కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం వెన్నుపోటు అనే పదానికి నిలువెత్తు రూపం అమెరికా(America). అగ్రరాజ్యం అనిపించుకోవాలని నిత్యం తహతహలాడే ఈ దేశం నమ్మినవారినే తెగ నరుకుతుంది. విశ్వసించిన వారినే ఈ విశ్వంలో లేకుండా చేయాలని చూస్తుంది. కమ్యూనిజాన్ని అడ్డుకుంటామంటూ వెళ్లి, వియత్నంలో లక్షలాది మంది అమాయకుల ప్రాణాలు తీసిన అమెరికా అప్పటికీ, ఇప్పటికీ ఏమీ మారలేదని చెప్పడానికి ప్రస్తుత పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యం. నిన్నమొన్నటివరకు రష్యా-యుక్రెయిన్‌ యుద్ధంలో జెలెన్‌స్కీ సేనలకు అండగా నిలిచిన అమెరికా ఇప్పుడు ప్లేటు మార్చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డబ్బుల కక్కుర్తి చూపిస్తూ వివిధ దేశాలకు సహాయ నిధులు ఆపేసిన ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఇప్పుడు యుక్రెయిన్‌కు సాయం చేయడం దండగని భావిస్తున్నారు. అంతటితో ఆగుతున్నారా అంటే లేదు.. యుక్రెయిన్‌(Ukraine) అధ్యక్షుడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మరి నోటికి వచ్చింది మాట్లాడితే జెలెన్‌స్కీ ఊరుకుంటారా..!? ట్రంప్‌పైనా విరుచుకుపడుతున్నారు. సాయం చేశాం కదా అని ఏది పడితే అది మాట్లాడితే భరించే ఓపిక ఎవరికీ ఉండదు. అందుకే రష్యా-యుక్రెయిన్‌ మధ్య ఉండాల్సిన ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు అమెరికా-యుక్రెయిన్‌ మధ్య కనిపిస్తున్నాయి. ఎదురుపడితే ఇరు దేశాలు తన్నుకునేలా వారి మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? యుక్రెయిన్ విషయంలో అమెరికా ఎందుకు యూటర్న్ తీసుకుంది ?

ఇదెక్కిడి విడ్డూరం

అమెరికాకు డబ్బు ఒక ఆయుధం.. యుద్ధం ఒక వ్యాపారం! రష్యాపై యుద్ధంలో మొదటి నుంచి యుక్రెయిన్‌ను నడిపించింది అమెరికానే.. ఇప్పుడు అదే యుక్రెయిన్‌పై నిందల వేస్తున్నదీ అమెరికానే. అసలు ప్రపంచంలోని అనేక యుద్ధాలకు మూలకారణం కూడా అమెరికానే! కానీ ఇప్పుడు ట్రంప్ ఏమో రష్యా-యుక్రెయిన్‌ యుద్ధానికి జెలెన్‌స్కీనే కారణమని నింద వేస్తున్నారు. యుక్రెయిన్‌లో జెలెన్‌స్కీకి ప్రజాదరణ లేదని.. అతను ఒక నియంత అని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. జెలెన్‌స్కీ బైడెన్‌ను మోసం చేశాడని ట్రంప్‌ చెబుతున్నారు. జెలెన్‌స్కీ పద్ధతి మారకపోతే ఆయనకు దేశమే మిగలదని హెచ్చరిస్తున్నారు. యుక్రెయిన్‌లో లక్షల మంది మరణిస్తుంటే జెలెన్‌స్కీ మాత్రం అమెరికా డబ్బును దోచుకోవడానికే చూస్తున్నారని ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ కామెంట్స్‌ చూస్తే యుక్రెయిన్‌ విషయంలో అమెరికా పాలసీ పూర్తిగా మారిపోయిందని అర్థం అవుతుంది. ఒకప్పుడు యుక్రెయిన్‌కు సహాయం చేసిన అమెరికా, ఇప్పుడు శత్రు దేశం రష్యాకు మేలు చేసేలా మాట్లాడుతుండడం విడ్డూరం. ఈ విషయం జెలెన్‌స్కీకి అర్థమైంది..అందుకే ట్రంప్‌ టార్గెట్‌గా జెలెన్‌స్కీ కౌంటర్‌ అటాక్‌కు దిగుతున్నారు. ట్రంప్‌ అసత్య ప్రచారాలు మానుకోవాలని గట్టిగానే బదులిచ్చారు. అమెరికా యుక్రెయిన్‌కు ఇచ్చింది ఏమీ లేదని.. ఒకవేళ ఏదైనా సాయం చేసినా అది వారి స్వార్థం కోసమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు జెలెన్‌స్కీ. అమెరికా మద్దతు ఉన్నా లేకున్నా యుక్రెయిన్ ఎప్పటికీ రష్యాకు లొంగదని ధీమా వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నా యుక్రెయిన్ మాత్రం వెనుకడుగు వేయదని తేల్చిచెప్పారు.

ట్రంప్‌ నాటకాలు

నిజానికి అమెరికాకు ఇలా ప్లేట్‌ ఫిరాయించడం కొత్త విషయమేమీ కాదు. ప్రపంచంలోని ఏ దేశానికైనా అమెరికా వెళ్తుంది. డబ్బులు ఇస్తాం.. ఆయుధాలు ఇస్తాం.. మద్దతిస్తామని నమ్మబలుకుతుంది. లిబియాలో గడాఫీని తొలగించేందుకు మద్దతిచ్చి, ఆ దేశాన్ని రక్తసిక్తం చేసింది. సిరియాలో అసద్‌ను తొలగించేందుకు తిరుగుబాటుదారులకు మద్దతిచ్చి, దేశాన్ని యుద్ధ భూమిగా మార్చింది. పాకిస్తాన్‌కు చెందిన లాడెన్‌ను ముందుగా అమెరికానే మోసింది. ఆ తర్వాత అతడినే మోసం చేసింది. ఇటు అఫ్ఘానిస్తాన్‌కు అమెరికా చేసిన ద్రోహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 20 ఏళ్లపాటు అక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టి, ఉన్నట్టుండి వెనక్కు వెళ్లి ఆ దేశాన్ని తాలిబాన్‌కు అప్పగించింది. ఇప్పుడు యుక్రెయిన్‌ విషయంలోనూ అమెరికా వైఖరి అలానే ఉంది. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అమెరికా యుక్రెయిన్‌కు సహాయం చేసిందని అంతా అనుకుంటారు కానీ అందులో సగమే నిజముంది. అది నిస్వార్థ సహాయం కాదు. అమెరికా మిలిటరీ ఇండస్ట్రీ లక్షల కోట్ల రూపాయలు లాభాలు పొందేలా యుక్రెయిన్‌కు ఆయుధాలు అందించింది. ఇదంతా అమెరికా ప్రభుత్వ ఖజానాలోకే వెళ్లింది. ఇటు ట్రంప్ రూటు ఏమో సపరేటూ. ఆయుధాలు అమ్ముకోవడానికి సాయం చేయాలా అని ఆలోచించే రకం ట్రంప్. అందుకే జెలెన్‌స్కీపై ఈ తరహా నిందలు వేస్తున్నారు. అటు రష్యాతో మాత్రం స్నేహంగా ఉన్నట్టు నటిస్తున్నారు. ఇలా ఇరు అగ్రదేశాల నాటకంలో బలైపోతుంది ఎవరు? 2022 ఫిబ్రవరి 22న యుద్ధం మొదలైన నాటి నుంచి యుక్రెయిన్ వీధులన్ని శవాల కుప్పలుగా మారాయి. యుక్రెయిన్‌ గడ్డపై బాంబులు వేసింది రష్యానే కావొచ్చు.. కానీ యుక్రెయిన్‌ కోసం చప్పట్లు కొడుతున్నట్టు నటిస్తూ రష్యాను రెచ్చగొట్టింది మాత్రం అమెరికానే. రష్యా చేసిన దాడుల కారణంగా 12,000 మందికిపైగా యుక్రెయిన్ పౌరులు మరణించారు. 60 లక్షల మందికి పైగా ప్రజలు శరణార్థులయ్యారు. యుక్రెయిన్‌లో 20శాతం భూభాగాన్ని రష్యా ఇప్పటికే ఆక్రమించుకుందని సమాచారం. ఇలా నమ్మిన మిత్రదేశమే నాశనమవుతుంటే అమెరికా ఏం చేస్తున్నట్టు? యుద్ధానికి ముగింపు పలికేలా పెద్దన్న పాత్ర పోషిస్తానని చెప్పిన ట్రంప్‌ ఆ పని చేయకపోగా పుతిన్‌ పక్షాన మాట్లాడుతూ యుక్రెయిన్‌పై నోరు పారేసుకుంటున్నారు. అమెరికా అనే కత్తి రెండువైపులా నరుకుతుందని చెప్పడానికి ట్రంప్‌ చర్యలే ఉదాహరణ. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది యుద్ధం కాదు… అమెరికా ఆడుతున్న రక్త నాటకం!

Also Read: HOLY SHIT అంటే ఇదేనేమో.. మలవిసర్జన నీటిలో తేలియాడుతున్న భక్త కోటి సనాతనీలు!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *