ఆర్థిక సంస్కరణలు.. వలస విధానాల్లో మార్పులు.. ఫెడరల్ నియామకాలు నిలిపివేత.. WHO నుంచి వైదొలిగిన అమెరికా.. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా అవుట్.. మెక్సికో గల్ఫ్ పేరు మార్పు.. బర్త్‌రైట్‌సిటిజన్ షిప్ రద్దు..ట్రాన్స్‌జెండర్ల గుర్తింపు క్యాన్సిల్! ఏంటి.. ఇదంతా అని అనుకుంటున్నారా? సరుకుల లిస్ట్‌లా ఇంత పొడుగు ఉందేంటని ఆలోచిస్తున్నారా? ఇవన్నీ అమెరికా అధ్యక్షుడి ట్రంప్ తొలి రోజు నిర్ణయాలు! వామ్మో.. ఒక్క రోజే ఇన్ని నిర్ణయాలా అని బుర్ర పాడు చేసుకోకండి! ఇలా చేస్తానని ట్రంప్ ముందే చెప్పారు.. చెప్పిందే చేశారు కూడా. బర్త్‌రైట్‌సిటిజన్‌షిప్ రద్దు నుంచి గత అధ్యక్షుడి బైడెన్ నిర్ణయాలను రివర్స్ చేయడం వరకు ట్రంప్ చేయాల్సిందంతా తొలి రోజే చేసినట్టుగా అనిపిస్తోంది.
ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ పాలసీల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అమెరికా దక్షిణ సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ట్రంప్. అక్కడ గోడ నిర్మాణానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటు LGBTQ కమ్యూనిటీకి పెద్ద షాక్ ఇచ్చారు ట్రంప్. అమెరికాలో అధికారిక పత్రాలపై ఇకపై రెండు జెండర్స్ మాత్రమే ఉండేలా ఆర్డర్స్‌పై సంతకాలు చేశారు. పురుషులు, మహిళలు అనే కాలమ్స్ మాత్రమే ప్రభుత్వ పత్రాలపై కనిపించేలా ఉత్తర్వులు జారీ చేశారు. అటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ-Doge పేరిట ప్రభుత్వం ఖర్చులు తగ్గించడంపై పనిచేయడానికి కొత్త విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహించనున్నారు. ఇటు కొత్త ఫెడరల్ ఉద్యోగుల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇక క్యాపిటల్ అల్లర్లపైనా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు ట్రంప్. క్యాపిటల్ అల్లర్లలో పాల్గొన్న దాదాపు 1,600 మందికి క్షమాభిక్షలు ప్రకటించారు. ఇక అమెరికా నిధులను విదేశాలకు ఇవ్వకుండా సమీక్షించాలనే ఆదేశాలు ఇచ్చారు. గ్రీన్ ఎనర్జీ ప్రోగ్రామ్స్‌ను కూడా రద్దు చేశారు. అటు మెక్సికో గల్ఫ్‌ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా పేరు మార్చిన ట్రంప్.. మౌంట్ డెనాలీ పేరును మౌంట్ మెక్‌కిన్లీగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన నిర్ణయాలగా రెండు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలుగుతుందని ట్రంప్ ప్రకటించడం సంచలనంగా మారింది. కరోనా కట్టడిలో WHO విఫలమైందని.. చైనా ఆధీనంలో WHO పని చేస్తుందని ట్రంప్ మరోసారి విమర్శించారు. ఇక జనన హక్కు పౌరసత్వ చట్టాన్ని రద్దు చేస్తూ వలసదారులకు గట్టి షాక్ ఇచ్చారు ట్రంప్.
ఇది కూడా చదవండి: భారతీయులకు భారీ దెబ్బ.. ఆ పని చేసేసిన ట్రంప్.. నెక్ట్స్ ఏం జరగబోతుంది?