Menu

Careers: ట్రంప్‌ గారి నిర్వాకం.. అమెరికా వెళ్లాలంటేనే జంకుతున్న భారతీయులు!

Archana 3 months ago
america h1 b indian dreams

‘అమ్మా..నేను అమెరికాకి వెళ్తా..’ ‘నాన్నా నేను అమెరికాలో చదువుకుంటా..’ అని నేటి విద్యార్థుల ఆలోచన. తల్లిదండ్రులు కూడా నా పిల్లలు అమెరికాలో ఉన్నారని గర్వంగా చెప్పుకుంటారు. అమెరికాలో చదువుకున్న..ఉద్యోగం చేసిన మంచి పేరు ఉంటుందని అనుకుంటారు. ఈ రోజుల్లో ప్రతి విద్యార్థి కల ఇదే. అమెరికాలో ఎక్కువ భారతీయులే స్థిరపడి ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ కలలు నెరవేరుతాయా అనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటున్నాయి. ట్రంప్ దెబ్బకు విద్యార్థులకు నిరాశే మిగిలింది. వీసా రిజెక్షన్ లెటర్ వచ్చేస్తుంది. ట్రంప్ పాలిసీలు.. సోషల్ మీడియా చెకింగ్ ఇలా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అమెరికాలో భారతీయ విద్యార్థులు తగ్గుదల మొదలైయింది.

ఎంత తగ్గారు?

ఇక 2025 ఫాల్ సెమెస్టర్‌లో అమెరికా కాలేజీల్లో కొత్త అంతర్జాతీయ విద్యార్థులు 17 శాతం తగ్గారు. టోటల్ అంతర్జాతీయ స్టూడెంట్స్ కూడా 1 శాతం తగ్గింది. అండర్‌గ్రాడ్యుయేట్‌లు కొంచెం పెరిగినా గ్రాడ్యుయేట్ ఎన్‌రోల్‌మెంట్స్ 12 శాతం డ్రాప్. ఎందుకంటే 96 శాతం యూనివర్సిటీలు వీసా డిలేలు.. 68 శాతం ట్రావెల్ రెస్ట్రిక్షన్స్‌ని బ్లేమ్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ మొత్తం 10 శాతం పెరిగి 3.63 లక్షలకు చేరారు. చైనా నుంచి 4 శాతం తగ్గినా ఇండియా టాప్ సోర్స్‌గా మెయింటైన్ చేసింది.

మరోవైపు వీసా క్రాక్‌డౌన్స్ విషయానికి వస్తే..FY 2024లో F1 వీసాలు ఇండియన్స్‌కి 33 శాతం తగ్గాయి. మొదటి అర్ధ సంవత్సరం 2025లో 44 శాతం డ్రాప్ అయ్యారు ఎందుకంటే.. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రిక్ట్ వెట్టింగ్.. ఎక్స్‌ట్రా డాక్యుమెంట్స్.. సోషల్ మీడియా స్క్రీనింగ్ తిరిగి తీసుకొచ్చింది. ఎలక్షన్ ఇయర్‌లో ఇది మరింత అన్‌ప్రెడిక్టబుల్ అవుతుందని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. జూలై..ఆగస్ట్ 2025లో ఇండియన్ స్టూడెంట్స్ ఆరైవల్స్ 50 శాతం తగ్గాయి. గ్రాడ్యుయేట్ ఎన్‌రోల్‌మెంట్స్ 9.5 శాతం డౌన్ ఎందుకంటే మాస్టర్స్.. PhD అప్లికేషన్స్‌లో ఎక్స్‌ట్రా స్క్రూటినీ కానీ మొత్తం నంబర్స్ ఎందుకు పెరిగాయి? ఎక్సిస్టింగ్ స్టూడెంట్స్ మల్టీ-యియర్ ప్రోగ్రామ్స్‌లో ఉన్నారు. OPTలో 21 శాతం పెరిగింది. అంటే ఇప్పటికీ అక్కడ ఉన్నవాళ్లు కొనసాగుతున్నారు కానీ కొత్తవాళ్లు స్లో డౌన్ అయ్యారు.

అమెరికా వైపే ఎందుకు?

ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇంకా అసాధారణం. అమెరికా డిగ్రీతో గ్లోబల్ కంపెనీల్లో జాబ్స్.. హై సాలరీలు.. కట్టింగ్-ఎడ్జ్ రీసెర్చ్ ఇవి ఇండియాలో మ్యాచ్ కావు. బెంగళూరు కన్సల్టెంట్స్ చెప్పినట్టు వీసా ట్రబుల్స్ షార్ట్-టర్మ్.. కానీ పోస్ట్-గ్రాడ్యుయేషన్ పే-ఆఫ్ లార్జ్. రెండోది పోస్ట్-పాండమిక్ సర్జ్ మొమెంటమ్ ఇంకా ఉంది. 2021 తర్వాత ఇండియన్ మొబిలిటీ బూమ్.. యూనివర్సిటీలు రిక్రూటింగ్ టీమ్స్ పెంచాయి.. స్కాలర్‌షిప్స్ ఇచ్చాయి. ఇప్పుడు ఇండియా ప్రయారిటీ మార్కెట్ డిమాండ్ కంటిన్యూ. మూడోది.. సోషల్ అండ్ కల్చరల్ పుల్. అమెరికన్ టెక్ జెయింట్స్.. ఇండియన్-ఒరిజిన్ CEOs లాంటివి మిడిల్ క్లాస్ అస్పైరేషన్స్‌ని బూస్ట్ చేస్తాయి. అమెరికాలో చదువుకోవడం అకాడమిక్ చాయిస్ మాత్రమే కాదు ఐడెంటిటీ మార్కర్. నాలుగోది యూనివర్సిటీలు ఫైట్ చేస్తున్నాయి. 81 శాతం ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ పెంచుతున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ స్టూడెంట్స్ 55 బిలియన్ డాలర్స్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇండియన్ ఫ్యామిలీలు గత ఇయర్ 14 బిలియన్ డాలర్స్ స్పెండ్ చేశాయి. ఇది బ్లైండ్ అస్పైరేషన్ కాదు కాల్కులేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్.

ఇక ఫ్యూచర్ షాడోస్ కూడా ఉన్నాయి. ఎలక్షన్ సైకిల్‌లో వీసా పాలసీలు మరింత టర్బులెంట్ అవుతాయి. కొత్త ఎన్‌రోల్‌మెంట్స్ డిప్ చూస్తే నెక్స్ట్ టూ ఇయర్స్‌లో ల్యాండ్‌స్కేప్ చేంజ్ అవ్వవచ్చు. అయినా మెయిన్ పాయింట్ ఏంటంటే భారతీయ స్టూడెంట్స్ కాల్కులేషన్ మారలేదు. షార్ట్-టర్మ్ అబ్స్టాకల్స్ లాంటి వీసా అన్‌సర్టెయింటీస్.. అడ్మిన్ హర్డల్స్ ఉన్నా లాంగ్-టర్మ్ గెయిన్స్.. బెటర్ కెరీర్ ఆపర్చునిటీస్.. గ్లోబల్ ఎక్స్‌పోజర్.. పర్సనల్ గ్రోత్ ఇంకా స్ట్రాంగ్. అమెరికన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ ఫేజ్‌లో ఉన్నా లక్షలాది ఇండియన్స్‌కి ఈ పర్స్యూట్ వర్త్ ది రిస్క్. 14 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ దాన్ని ప్రూవ్ చేస్తుంది.

ALSO READ: గ్రేడ్-A పోస్టులకు నోటిఫికేషన్ జీతం రూ.89000.. ఛాన్స్ మిస్‌ చేసుకోవద్దు!


Written By

S. Archana is an SEO specialist and sub-editor known for her strong adaptability and dedicated work ethic. A committed professional and an eager everyday learner, she continually sharpens her skills to deliver thoughtful, effective results.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *