ట్రంప్ గెలిచారు.. కమల ఓడారు.. ఎందుకిలా జరిగింది? అమెరికా ఎన్నికల ఫలితాలను యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూసింది. ఇంతకి కమల ఓటమికి కారణాలేంటి? కమలకు మైనస్‌గా నిలిచిన అంశాలేంటి?
ఆర్థిక వ్యవస్థ
ఆర్థిక వ్యవస్థ…! అమెరికాకు ఎంతో కీలకమైన అంశం ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికాను ప్రపంచానికి పెద్దన్న చేసింది ఈ ఆర్థిక వ్యవస్థే. అయితే గత బైడెన్ పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్న విమర్శలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరగడం, గ్యాస్ ధరలు పీక్స్‌కు వెళ్లడం, ఉద్యోగాల సృష్టి తగ్గడం కారణంగా చాలా మంది అమెరికన్లు నిరాశకు గురయ్యారు. అటు డెమొక్రట్ల రూలింగ్‌లో అమెరికా ప్రజల జీవన వ్యయం కూడా పెరిగింది. దీంతో డెమొక్రటిక్ పార్టీని ఓటర్లు నమ్మలేదన్న వాదన ఉంది. కమల ఓడిపోవడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్పవచ్చు!
బైడెన్ ఫ్యాక్టర్
బైడెన్ అడ్మినిస్ట్రేషన్ రికార్డ్ చెత్తగా ఉండడం కమలకు మైనస్‌గా మారింది. ఆరోగ్య సంరక్షణ, ఇమ్మిగ్రేషన్‌తో పాటు విదేశాంగ విధానాల్లో బైడెన్ సర్కార్ ఘోరంగా ఫెయిలందనని ప్రజలు భావించారు. బైడెన్ పాలన పట్ల ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు కమల అధ్యక్ష పదవి చేపట్టినా అవే విధానాలను అమలు చేస్తారని ప్రజలు అనుకున్నారు. ఎందుకంటే బైడన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కమల వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అంటే బైడెన్ నిర్ణయాల్లో కమల హస్తం కూడా ఉన్నట్టే లెక్క. ఇది ట్రంప్ పార్టీకి ఓట్లు పడేలా చేసింది.
లా అండ్ ఆర్డర్
గత డెమొక్రట్ల పాలనలో అమెరికాలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని రిపబ్లికన్లు బాగా ప్రచారం చేశారు. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేరస్థుల పట్ల పోలీసులు సాఫ్ట్‌గా వ్యవహరించారని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పారు. ట్రంప్ మాటలను ప్రజలు నమ్మారని.. అయితే ప్రజల సేఫ్టీ గురించి డెమొక్రట్ పార్టీ ఎక్కువగా ప్రచారం చేయకపోవడం వారికి విజయాన్ని దూరం చేసిందన్నది విశ్లేషకులు మాట.
కమల ఇమేజ్
కమల హారిస్ ఏ సమస్య గురించి స్పష్టమైన సమాధానం చెప్పలేదన్న విమర్శలున్నాయి. ప్రతీ అంశాన్ని న్యూట్రల్ వేలో ఆన్సర్ చేయడం ఆమెపై ప్రజల్లో నమ్మకాన్ని తగ్గించిందన్న ప్రచారం ఉంది. మరోవైపు చాలా అంశాల గురించి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం ఆయనపై ఓటర్లలో నమ్మకాన్ని పెంచిందంటున్నారు విశ్లేషకులు. ఓవరాల్‌గా పబ్లిక్‌లో కమల ఇమేజ్ తగ్గడానికి ఇది ప్రధాన కారణమైందని చెప్పవచ్చు.
కల్చర్
అమెరికా ఓటర్లను ఎక్కువగా ఆకర్షించే విద్య, కుటుంబ విలువలు, ఇమ్మిగ్రేషన్ లాంటి అంశాల్లో తమ ఆలోచనలను, విధానాలను కమల ప్రజల్లోకి ఆశించిన స్థాయిలో తీసుకెళ్లలేకపోయారన్న వాదన ఉంది. మరోవైపు అమెరికా సాంప్రదాయాలు ముప్పులో ఉన్నాయని ట్రంప్ ఓటర్లను నమ్మించే ప్రయత్నం చేశారు. అమెరికా కల్చర్‌ను రక్షిస్తానని ఆయన పదేపదే చెబుతు వచ్చారు. అదే సమయంలో కమల లిబరల్ విధానాలను ప్రమోట్ చేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది లిబరల్ వర్సెస్ కల్చర్ యుద్ధంగా జరిగింది. ఇందులో ఈ సారి కల్చరే విజయం సాధించింది.
సాఫ్ట్ వర్సెస్ హార్ష్
అమెరికాకు ఇప్పుడు అంతర్జాతీయ సవాళ్లు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చైనా, రష్యాతో వైరం ఎప్పటిలాగా అలానే ఉంది. అటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో యుద్ధ వాతావారణం నెలకొంది. మరికొన్ని దేశాలు ఇప్పటికే తన్నుకుంటున్నాయి. ఈ దేశాల వెనుక పరోక్షంగా, ప్రత్యక్షంగా అమెరికా హస్తం ఉంది. ఇలాంటి విషయాలను డీల్ చేయడంలో సాఫ్ట్‌గా ఉండే కమల కంటే ట్రంపే సమర్థుడని ఓటర్లు భావించినట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఇమ్మిగ్రేషన్
కఠినమైన సరిహద్దు విధానాలు అవసరమని నమ్మే చాలా మంది సంప్రదాయవాద ఓటర్లకు ఇమ్మిగ్రేషన్ ప్రధాన అంశం. ట్రంప్ ఇమ్మిగ్రేషన్‌పై బలమైన వైఖరిని కలిగి ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ విధానాలు మరుస్తానని ఖరాఖండిగా చెప్పారు. నిజానికి అమెరికాను అక్రమ వలసదారుల సమస్య పట్టిపీడిస్తోంది. అయితే ఈ విషయంలో కమల మెతక వైఖరి పాటించారు. ఇమ్మిగ్రేషన్ సమస్యను సాల్వ్ చేయడం మన చేతుల్లోనే ఉంటుందని.. ఇదేదో భూతద్దంలో పెట్టి చూడాల్సిన సమస్య కాదన్నట్టు మాట్లాడారు. ఇది ఆమెకి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు.
దేశభక్తి
ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ లాంటి నినాదాలను ఎక్కువగా ఉపయోగించారు. వాటిని ఓటర్లలోకి తీసుకెళ్లారు. ఇది అక్కడ జాతీయభావాన్ని పెంచింది. అటు కమల మాత్రం నేషనలిజం విషయంలో భిన్న వైఖరిని కలిగి ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో దేశభక్తికే అమెరికా ఓటర్లు పట్టం కట్టడంతో కమలకు ఓటమి తప్పలేదు.
ప్రొగ్రెసీవ్
టు మచ్ ఆప్ ఎనీ థింగ్ ఇజ్ గుడ్ ఫర్ నథింగ్ అని అంటారు కదా.. ఇది కమల కొంపముంచి ఉండొచ్చు. కమల అతిగా ప్రొగ్రెసీవ్‌గా ఉంటారన్న ప్రచారాన్ని ట్రంప్ ప్రచార ర్యాలీల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అమెరికాలో సంస్క్రతి, సంప్రదాయాలకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే రాష్ట్రాలు ఎక్కువే ఉన్నాయి. కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాల తప్ప ఎక్కువమంది కల్చర్‌కి ప్రియోరటి ఇస్తారు. వీరంతా ప్రొగ్రెసీవ్ కమల కంటే సంప్రదాయ ట్రంప్‌కే ఓటు వేశారు.
స్వింగ్ స్టేట్స్
అమెరికా ఎలక్షన్స్‌ను శాసించే స్వింగ్ స్టేట్స్‌లో కమల పైచేయి సాధించకపోవడం ట్రంప్ గెలుపుకు కారణమైంది. పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, విస్కాన్సిన్, మిచిగాన్, అరిజోనా, నెవాడాలను స్వింగ్ స్టేట్స్ అంటారు. ఈ రాష్ట్రాల ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడంలో కమల ఫెయిల్ అయ్యారు.
Also Read: అక్టోబర్ నరమేధం.. ఎవరిది అసలైన ఉగ్రవాదం?