Flagship ఫోన్స్ ఈసారి సేల్స్ లో తక్కువ ధరలోకి అందుబాటులోకి వచ్చాయి. ఆపిల్ ఐఫోన్స్, పిక్సెల్, సాంసంగ్, వన్ ప్లస్ వంటి మొబైల్స్ మంచిగా ఆఫర్ తో వస్తున్నాయి.
30 వేల రూపాయల నుండి 50 వేల వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో ఎన్నో స్మార్ట్ ఫోన్స్ ఊరిస్తున్నాయి.
అమెజాన్ లో SBI క్రెడిట్, డెబిట్ కార్డుల మీద, ఫ్లిప్‌కార్ట్ లో హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) క్రెడిట్, డిబిట్ కార్డుల మిద ఆఫర్లు ఉన్నాయి..బజాజ్ నో కాస్ట్ EMI కూడ లభిస్తుంది.
₹10,000 లోపు నుండి ₹20,000 లోపు బడ్జెట్ మొబైల్ ఫోన్స్ కోసం ఇక్కడ చూడండి
₹20,000 నుండి ₹30,000 మధ్య ఉన్న మొబైల్స్ కోసం ఇక్కడ చూడండి
₹30,000 నుంచి ₹50,000 వేల మధ్య ఏం మొబైల్స్ ఉన్నాయో ఓ లుక్కేయండి.
1. Google Pixel 8 :
6.1 ఇంచ్ Amoled డిస్ప్లే , గూగుల్ సొంత టెన్సార్ G3 ప్రాసెసర్ తో వస్తుంది. Storage: 8GB RAM 128GB మెమరీ Camera: 50MP+ 12 అల్ట్రా వైడ్ – 10.5MP ఫ్రంట్ కెమెరా. Battery: 4575mAh, 27W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్ లెస్. ఫొటోస్ కోసం బెస్ట్ ఆప్షన్. అధునాతన AI టూల్స్. 7ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ సపోర్ట్. మంచి బ్యాటరీ లైఫ్. IP 68.
కాన్స్: హీటింగ్ ఇష్యూస్ తో గేమింగ్ కి సూటబుల్ కాదు, స్లో ఛార్జింగ్,వీడియో లో ఎక్సపోజర్ తక్కువ. ధర: ₹31,999
6.78 ఇంచ్ 1.5k LTPO AMOLED డిస్ప్లే . క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8Gen 2 ప్రాసెసర్ తో పాటు గేమింగ్ కోసం ప్రత్యేకంగా సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1 ఉంది. Storage: 12GB RAM 256GB మెమరీ. Camera: 50MP+ 8MP(అల్ట్రావైడ్)+ 64MP(3X టెలిస్కోపిక్) 16MP సెల్ఫీ కెమెరా. Battery: 5160mAh, 120W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్,రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్. 0%-50% ఛార్జింగ్ 11 నిమిషాల్లోనే. కాన్స్: 8MP అల్ట్రావైడ్ క్లారిటీ తక్కువ. ఫన్ టచ్ లో UI ప్రీమియం అనుభూతి ని ఇవ్వదు. ధర: ₹33,999
3. OnePlus 12R:
6.78 ఇంచ్ XDR LTPO AMOLED curved కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 డిస్ప్లే . క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్. Storage: 8GB RAM 128GB మెమరీ. Camera: 50MP+8MP(అల్ట్రావైడ్)+2MP(మాక్రో) 16MP సెల్ఫీ. Battery: 5500mAh, 100W సూపర్ వూక్ ఛార్జింగ్.
కాన్స్: ప్రభావవంతంగా లేని మాక్రో లెన్స్,3 ఏళ్లు మాత్రమే అప్డేట్స్ వస్తాయి.ధర: ₹34,999.
4 . Samsung S23:
6.1 ఇంచ్ కాంపాక్ట్ సైజ్ లోక్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ వాడారు. Storage: 8GB RAM 128GB మెమరీ. Camera: 50MP+ 20MP(అల్ట్రావైడ్)+ 10MP(టెలిస్కోపిక్)
12MP సెల్ఫీ కెమేరా. Battery: 3900mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్. మంచి 90Fps గేమింగ్ కి, ఫొటోస్, వీడియోస్ కి సహకరించే ఆల్రౌండ్ మొబైల్. Samsung AI టూల్స్ ప్రత్యేక ఆకర్షణ. KNOX సెక్యూరిటీ.
కాన్స్: స్లో ఛార్జింగ్,బ్యాటరీ సామర్థ్యం తక్కువ. ధర: ₹36,999
5 . Iphone 13:
ఆపిల్ A-1 5బయోనిక్ చిప్, గేమింగ్ కి సహకరిస్తుంది. Camera: 12MP(2X optical Zoom)+ 12MP(అల్ట్రావైడ్) 12MP సెల్ఫీ.
Storage: 4GB RAM – 256GB మెమరీ. Battery: 3227mAh, 20W, 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్ .
కాన్స్: నెమ్మదైన ఛార్జింగ్, 60Fps డిస్ప్లే, ఫ్రంట్ కెమెరా లో తక్కువ క్లారిటీ. ధర: ₹37,999
6.7 ఇంచ్ కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 గ్లాస్ తో ఉంది. టెన్సర్ G2 ప్రాసెసర్. Storage: 8GB RAM ,128GB మెమరీ. Camera: 50MP+12MP+48MP – 10MP సెల్ఫీ కేమెరా. Battery: 5000mAh, 23W వైర్ – 23W వైర్‌లెస్ ఛార్జింగ్.
కాన్స్: స్లో ఛార్జింగ్, హీటింగ్ ఇష్యూస్. ధర: ₹40,999
7. Xiaomi 14 :
6.36 ఇంచ్ LTPO Oled డిస్ప్లే. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్. Storage : 12GB RAM 512GB మెమరీ. Camera: లైకా భాగస్వామ్యంతో 50MP+ 50MP(అల్ట్రావైడ్)+ 50MP(టెలిఫోటో 3.2X జూమ్) . Battery: 4610mAh, 90W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.
కాన్స్: కొన్ని డివైస్స్ లో కెమెరా లెన్స్ ఫాగింగ్ సమస్య ఉంది. హీటింగ్ ఇష్యూస్.ధర: ₹47,999
8. IQOO 12:
6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే.క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో పాటు గేమింగ్ పెర్ఫార్మెన్స్ కోసం ప్రత్యేకంగా సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1 ఉంది. Storage; 12GB RAM 256GB మెమరీ. Cameras: 50MP+ 50MP(అల్ట్రా వైడ్)+ 50MP(3X పెరిస్కోపిక్ లెన్స్) – 16MP సెల్ఫీ కెమెరా. Battery: 5000mAh, 120W ఫ్లాష్ ఛార్జింగ్. కాన్స్: ఈ ధరలో వైర్‌లెస్ ఛార్జింగ్ లేదు. iqoo బ్లోట్‌వేర్ ఉంది. ధర: ₹47,999
9. OnePlus 12:
6.82 ఇంచ్ pro XDR LTPO AMOLED డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. Storage: 12GB RAM 256GB మెమరీ. Camera: హాజల్ బ్లేడ్ భాగస్వామ్యంతో 50MP+ 48MP(అల్ట్రావైడ్) + 64MP (టెలిఫోటో 3X జూమ్) 32MP సెల్ఫీ. Battery: 5400 mAh,100W సూపర్ వూక్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్. ఈ సేల్ లో వన్ ప్లస్ బడ్స్ ప్రో 2 ఉచితంగా ఇస్తున్నారు.
కాన్స్: అల్ట్రావైడ్ కెమెరా లో క్లారిటీ తక్కువ. ధర: 47,999
10. Iphone 15:
6.1 ఇంచ్ కాంపాక్ట్ సైజ్ లో సెరామిక్ బాడీ తో వస్తుంది. ఆపిల్ -16 బయానిక్ చిప్ తో మల్టీటాస్కింగ్, గేమ్స్ కి బాగుంటుంది. Storage: 6GB RAM 128GB మెమరీ. Camera: 48MP+ 12MP(వైడ్ యాంగిల్) – 12MP సెల్ఫీ. Battery: 3349mAh,20W ఛార్జింగ్ – 15W వైర్‌లెస్ మాగ్ సేఫ్ ఛార్జింగ్. పెద్ద విషయం ఈసారి USB – C ఛార్జింగ్ పోర్ట్ తో వస్తుంది.
కాన్స్: ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. స్లో ఛార్జింగ్, తక్కువ బ్యాటరీ, 60Hz డిస్ప్లే. ధర: 49,999.
ఇవి 30వేల నుండి 50 వేల రూపాయల మధ్య ఉన్న ఫోన్స్.
పైన పేర్కొన్న ధరలు కొన్ని బ్యాంక్ ఆఫర్ తో కలిపి ఉన్నాయి.
NOTE: ఫ్లిప్‌కార్ట్, అమేజాన్‌లో ధరలు ఎప్పుడైనా మారొచ్చు, ఇక్కడ పేర్కొన్న ధరలు ఆయా వెబ్ సైట్లు అధికారికంగా ప్రకటించినవి.)