పండుగ సందడి ముందుగానే తెస్తూ, దిగ్గజ షాపింగ్ సైట్స్ అమెజాన్ ,ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల మేళా ప్రకటించేశాయి. అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నిర్వహించే సేల్ ఈనెల సెప్టెంబర్ 27 నుంచి మొదలై అక్టోబర్ 6న ముగుస్తుంది. కానీ అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 26వ తేదీన సేల్‌లో కొనవచ్చు.
దీంట్లో పది వేల లోపు నుండి లక్ష పైన ఉండే మొబైల్ వరకు అన్నిటి మీద ఆఫర్లు నడుస్తున్నాయి.
10 వేల లోపు నుంచి 20వేల వరకు బడ్జెట్‌లో మొబైల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయ్యండి.
20 వేల నుంచి 30 వేల రూపాయల మధ్య ఎన్నో ఆల్‌రౌండర్ , కెమెరా, గేమింగ్ కోసం మంచి ఫోన్స్ ఉన్నాయి. ఎవరి బడ్జెట్ మేరకు ఆ బడ్జెట్ రేంజ్ లో ఏం ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
అమెజాన్ లో SBI క్రెడిట్, డెబిట్ కార్డుల మీద, ఫ్లిప్‌కార్ట్ లో హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) క్రెడిట్, డిబిట్ కార్డుల మిద ఆఫర్లు ఉన్నాయి..బజాజ్ నో కాస్ట్ EMI కూడ లభిస్తుంది.
ఈ బడ్జెట్ లో అన్నీ Amoled డిస్‌ప్లేతో, IP 68 రేటింగ్‌తో వస్తాయి.
క్వాల్‌కప స్నాప్ డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో, HDR 10+ Amoled డిస్‌ప్లే. 8 GB RAM 128 GB మెమరీ.
Camera : 50MP మెయిన్ OIS 8MP వైడ్ యాంగిల్ 16MP సెల్ఫీ. Battery: 5500mAh, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
ధర: ₹21,999
2. Poco F6:
క్వాల్‌కప్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 లాంటి పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఈ బడ్జెట్ లో ఇదే ఉత్తమ ప్రాసెసర్. గేమ్స్ కోసం బాగా పనికొస్తుంది. 8GB RAM 256GB మెమరీ. Camera: 50 MP OIS + 8MP బ్యాక్ కెమెరా 20MP సెల్ఫి కెమెరా. Battery: 5000mAh బ్యాటరీ 90W ఫాస్ట్ ఛార్జింగ్ (బాక్స్ లో 120W అడాప్టర్ ఇస్తున్నారు) ధర: ₹21,999
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. 8GB RAM 128GB మెమరీ. Camera: 50MP OIS + 8MP వైడ్ యాంగిల్ – 16MP సెల్ఫీ కేమెరా. Battery: 5500mAh బ్యాటరీ 100W సూపర్ వూక్ ఛార్జింగ్. లిమిటెడ్ ఆఫర్ లో వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2 ఆర్ ఫ్రీ గా ఇస్తున్నారు
ధర: ₹21,999
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో, కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 గ్లాస్ తో డాల్బీ విజన్ తో వస్తుంది. 8GB RAM 128GB మెమరీ. Camera: 50MP 8MP వైడ్ యాంగిల్ 32MP సెల్ఫీ కేమెరా. Battery: 5500mAh 120W సూపర్ పూక్ ఛార్జింగ్.(ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు) ధర; ₹25,499
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో మెటల్ బాడీ తో వస్తుంది. 8GB RAM 128GB మెమరీ. Camera: 50MP OIS+ 8MP వైడ్ యాంగిల్ – 16MP సెల్ఫీ కేమెరా. Battery: 5500mAh 100W వూక్ ఛార్జింగ్. ధర: ₹25,999
గూగుల్ సొంత ప్రాసెసర్ Tensor G2. స్టిల్ ఫోటోగ్రాఫీ కోసం ఈ బడ్జెట్ లో బెస్ట్ ఫోన్. హై గ్రాఫిక్స్ గేమింగ్ ను ఎక్కువ హాండీల్ చెయ్యలేదు. గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్లకు రిలీజ్ చేసే ప్రతి సాప్ట్వేర్+ సెక్యూరిటీ అప్డేట్స్ 5 ఏళ్ళ పాటు మొదట పిక్సెల్ ఫోన్స్ కే ఇస్తాయి. Camera: 64MP + 13MP వైడ్ – 13MP సెల్ఫీ Storage: 8GB RAM 128GB మెమరీ. Battery: 4385mAh 25W ఫాస్ట్ ఛార్జింగ్. ధర: 25,999
శామ్సంగ్ కంపెనీ నుండి Flagship కిల్లర్ ఫోన్ S23 FE. ఈ బుడ్జెట్ లో ఒక మంచి allround మొబైల్. AI features, KNOX సెక్యూరిటీ, NFC వంటి flagship ఫీచర్స్ ఉన్నాయి. ఎక్సీనోస్ 2200 ప్రాసెసర్ ఉంది. Camera: 50MP+12MP టెలిఫోటో+8MP ఆప్టికల్ జూమ్ – 10MP సెల్ఫీ. Battery: 4500mAh 25W వైర్డ్, 15W వైర్ లెస్ ఛార్జింగ్. ధర:27,999
Ee బడ్జెట్ లో మిడియటెక్ డైమండ్ సిటీ 9200+ powerful ప్రాసెసర్ వాడారు. హై రిజల్యూషన్ గేమింగ్ కి బాగుంటుంది. 8GB RAM 128GB మెమరీ. Camera: 50MP + 8MP – 50MP సెల్ఫీ . Battery: 5500mAh 80W ఫాస్ట్ ఛార్జింగ్ ధర: 28,999
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. కెమెరా బాగుంది. Camera:50MP+10MP+13MP బ్యాక్ కెమెరా – 50MP సెల్ఫీ.
Battery: 4500mAh 125W టర్బో ఛార్జింగ్,50W వైర్ లెస్ ఛార్జింగ్,10W రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ధర: 27,999
ఇవి 20,000 నుంచి 30,000 మధ్య ఉన్న మంచి స్మార్ట్ ఫోన్స్.
పైన పేర్కొన్న ధరలు కొన్ని బ్యాంక్ ఆఫర్ తో కలిపి ఉన్నాయి.
NOTE: ఫ్లిప్‌కార్ట్, అమేజాన్‌లో ధరలు ఎప్పుడైనా మారొచ్చు, ఇక్కడ పేర్కొన్న ధరలు ఆయా వెబ్ సైట్లు అధికారికంగా ప్రకటించినవి.)