Menu

AI Fake Videos: AIతో పచ్చి బూతులు.. వికృత బుద్ధి చూపిస్తోన్న మగాళ్లు!

Lakshmi Aruna 7 months ago

ఇంటిలిజెన్స్ అనేది మనుషులకి వర్తిస్తుంది దాన్నే హ్యూమన్ ఇంటిలిజెన్స్ అంటారు. అది మెషీన్లకూ వచ్చింది దాన్నే ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అంటాం. కానీ దాన్ని వాడే మనుషులకి ఇంటిలిజెన్స్ ఉందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకిలా అంటున్నానో తెలుసా! ఈ స్టోరీ మొత్తం అయ్యాక మీకే తెలుస్తుంది నేను అన్నది తప్పా.. ఒప్పా అని.

AI ఇది ఇప్పుడు అందరి జీవితాలనే తారుమారు చేస్తోంది…దీని అవసరం లేని వారు లేరంటే ఆశ్చర్యం లేదు అంతగా ఈ టెక్నాలజీ మనుషులతో అనుబంధం ఏర్పరచుకుంది…కానీ ఆ బంధాన్ని మంచికి ఉపయోగిస్తున్నారా అంటే? కాదు పనికి మాలిన పనులకి వాడుకుంటున్నారు.అసలు AI ఎవరికి సేవ చేయాలి? విద్యకి? పరిశోధనకి? కడుపు నింపే ఉద్యోగాలకి? కాదు సార్, ఇప్పుడు AI ను వాడుతున్నది… అమ్మాయిల ఫొటో తీసుకొని… పచ్చి బూతులకి రంగులు అద్దేందుకు.అవును మీరు విన్నది నిజమే ఏంటి నమ్మట్లేదా! మీకు వివరంగా చెప్తా వినండి.

స్టాండ్-అప్ కామెడీ అంటారు. మీకు తెలిసే ఉంటుంది. ఒకరు నిలబడి అందర్నీ నవ్వించడమే ఆ షో కాన్సెప్ట్. కానీ ఇప్పుడు మనవాళ్ళు AI వాడుకునే పుణ్యమాని స్టాండ్-అప్ హాస్యమా? లేక స్టాండ్-అప్ బూతులా అనిపిస్తుంది. ఓ అందమైన అమ్మాయి ఫొటో కనిపిస్తే, ఆమెను AI తో జనరేట్ చేసి,దానికి ఒక అసభ్యకరమైన డైలాగుని జత చేసి వాళ్ళ కామెడీ చానెల్ లో షేర్ చేశారు. ఎంత దారుణం అండీ ఇది?

“AI తో డీప్ ఫేక్ ఫొటో, ఫేక్ వాయిస్, బూతుల స్క్రిప్ట్..ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని ఇవన్నీ కలిపి కామెడీ పేరుతో దూకుడుగా పోతున్నారు…నువ్వు కంటెంట్ చేసావు. వాళ్లు నవ్వారు. ఒక్కసారి ఆలోచించండి…ఇదే విధంగా నీ ఇంట్లోవాళ్ళ ఫోటోమీద వస్తే? పాపం ఆ అమ్మాయి లైఫ్ ఏం కావాలి ? ఆమె గురించి ఒక్కక్షణం అయినా ఆలోచించావా? కామెడీ కోసం ఒకరి గౌరవాన్ని తక్కువ చేయడమే మీ మార్గమా?” ఒకరకంగా అది వ్యభిచారమే కదా!

AI నీ చేతిలో ఉంది. కానీ నీ బుర్ర నీ చేతిలో ఉందా? దానిని తప్పుదోవకి పంపడం ఆ టెక్నాలజీ తప్పు కాదు సుమా… మనిషి దురాలోచన తప్పు.టెక్నాలజీ మనిషికి ఉపయోగపడాలి కానీ నిన్ను నువ్వు నాశనం చేసుకుంటూ ఇంకో పదిమందిని నాశనం చేయటానికి కాదు.నీ చదువు నీ సంస్కారం ఏమైంది? ఇంత నీచపు ఆలోచనలు చేసే సంపాదించాలా?

హాస్యం అంటే ఇతరుల బాధ మీద చేయటం కాదు, మనమెంత దయతో నవ్వించగలమన్నది ముఖ్యం. AI అంటే ఇతరుల దేహాన్ని ఎడిట్ చేయడమే కాదు, వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడమూ కావాలి. బూతు వీడియోలు చూస్తూ నవ్వడమంటే నీ లోపాన్ని ప్రపంచానికి చాటి చెప్పటమే. మనిషిగా పుట్టావ్ కాబట్టి… AIని మానవత్వంతో వాడుకో. అసభ్యతకు టెక్నాలజీని ఆయుధం చేయకు. ఏమో ఇదంతా చూస్తుంటే కొన్నాళ్ళకు AI తో వ్యభిచారం కూడా చేయిస్తారేమో అనిపిస్తుంది నాకు. ఇప్పటికే AI చాటింగ్ మొదలైంది. దానివల్ల ఎంతో మంది ఇబ్బందులపాలు అవుతున్నారు.

చివరగా నేను చెప్పేది ఒక్కటే.. AI ని మనం సమాజానికి మంచిగా ఉపయోగించాలి. కానీ దాన్ని తప్పుడు మార్గాల్లో వాడితే, అది వ్యక్తిగత గౌరవాన్ని, మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది. అందమైన అమ్మాయిల ఫోటోలు తీసుకొని, దానికి అశ్లీల కాన్సెప్ట్స్ కలిపి “హాస్యం”గా చూపించడం హాస్యం కాదు అది అవమానం. ఇలాంటివి చేయటమే నేరం కాదు.. చూడటం, వాటిని ప్రోత్సహించటం ఇంకా పెద్ద నేరం. చూసేవాళ్ళుంటే చేసేవాళ్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ఈ రోజు ఎవరికో జరిగింది రేపు నీ చెల్లికో తల్లికో కూడా జరగొచ్చు తస్మాత్ జాగ్రత్త…!

ALSO READ: మళ్లీ రాని రోజులు.. మరుపురాని జ్ఞాపకాలు..90s కిడ్స్‌ చిలిపి ఆటలు, కోపతాపాలు!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *