Menu

Success Story: 10th,12th టాపర్.. చివరకు IFS ర్యాంకర్..! అదితి సక్సెస్ సీక్రెట్ ఇదే!

Archana 3 months ago
aditi chhaparia ifs officer

ఈ రోజుల్లో ఎవరికైనా సరే చదువే పెద్ద ఆస్తి. ఇది నిజం. ఎన్ని కోట్లు ఆస్తి ఉన్నా మన చదువే మనకు అన్నం పెడుతుంది. కష్టపడి కాదు ఇష్టపడి చదివితే అదే మనకు దారి చూపిస్తుంది. మన లక్ష్యాలను శిఖరాలకు చేరుస్తుంది. అందుకే మన జీవితంలో విద్య చాలా ముఖ్యం. మరోవైపు ఏ ఫలితాలు వచ్చినా ఆడపిల్లలదే పైచెయ్యి అని వింటున్నాము. అమ్మాయిలకు అండగా నిలబడేది కూడా చదువే. ఇవ్వన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక అద్భుతమైన కథ చెబుతాను. ఒక అమ్మాయి పదవ తరగతిలో తన రాష్ట్రానికి మొదటి స్థానం తెచ్చుకుంది. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో దేశవ్యాప్తంగా మూడో స్థానం సాధించింది. అయితే యూపీఎస్‌సీలో టాప్ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ కాకుండా ఐఎఫ్‌ఎస్‌ను ఎంచుకుంది. ఆమె ఎవరు? ఆమె జీవితంలో ఏం జరిగింది? ఆమె విజయ రహస్యం ఏమిటి?

ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి?

ఆమె పేరు అదితి చాపరియా. ఉత్తరప్రదేశ్‌-సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఒక ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు అశిష్, సీమ చాపరియా. చిన్నప్పటి నుంచే చదువులో ఆమెకు పోటీ పడటం అలవాటు. గోరఖ్‌పూర్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో ఎనిమిదవ తరగతి వరకు చదివింది. తర్వాత రాజస్థాన్‌లోని అజ్మీర్ మాయో కాలేజ్ గర్ల్స్ స్కూల్‌కు మారింది. పదో తరగతి బోర్డు పరీక్షల్లో తన రాష్ట్రంలో మొదటిస్థానం సాధించింది. ఇంకా 12వ తరగతిలో 99.5 శాతం మార్కులతో దేశవ్యాప్తంగా మూడో స్థానం దక్కించుకుంది. ఆమె చదువు పట్ల అచంచలమైన ఆసక్తితో పాటు కుటుంబం అందించిన మద్దతు ఆమె జీవితంలో మొదటి బలాలు.

ఢిల్లీలో మరింత రాటుదేలింది:

ఇక స్కూలింగ్ పూర్తయ్యాక అదితి ఢిల్లీకి వెళ్లింది. అక్కడ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో బీకాం చదివింది. కాలేజీ రోజుల్లోనే ఆమె మనసులో ఒక ఆలోచన మొలకెత్తింది. యూపీఎస్సీ పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే చదువు ద్వారా దేశానికి సేవ చేయాలని ఆమెకు ఆసక్తి. కాలేజీలో బిజినెస్ స్టడీస్ చదువుతూ ఆమె రోజూ గ్రొత్ ప్లాన్ చేసుకునేది. ఇక్కడే ఆమె ఎకనామిక్స్ ఆప్షనల్ సబ్జెక్ట్‌ను ఎంచుకుంది. ఎందుకంటే అది ఆమెకు సులభంగా అర్థమవుతుందని భావించింది. ఈ కాలేజీ రోజుల్లోనే ఆమె యూపీఎస్సీ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. అది ఆమె జీవితాన్ని మార్చేసింది.

మరోవైపు యూపీఎస్సీ జర్నీకి 2023లో మొదటి అటెంప్ట్‌లోనే అదితి పాస్ అయింది. ఇది చాలా రేర్ విషయం. ఎందుకంటే యూపీఎస్సీలో మిలియన్స్ ప్రయత్నిస్తారు కానీ క్లియర్ చేసేవారు చాలా తక్కువ. ఆమెకు ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ అలాట్ అయింది. అంటే ఐఆర్‌పీఎఫ్‌ఎస్. ఇది కూడా గ్రూప్-ఏ సర్వీస్ చాలా మంది సంతోషిస్తారు. కానీ అదితికు సరిపోలేదు. ఆమె కలలో ఐఎఫ్‌ఎస్ ఉంది ఇండియన్ ఫారిన్ సర్వీస్ అంటే డిప్లమసీ ప్రపంచంలో భారతదేశాన్ని ప్రతినిధి చేయడం కాబట్టి ఆమె నిర్ణయం తీసుకుంది. చాలా మంది ఇక్కడ ఆగిపోతారు కానీ ఆమె ఆగలేదు. ఇది ఆమె ధైర్యాన్ని చూపిస్తుంది.

ఏ ఫ్లాట్‌ఫామ్స్‌ సాయం చేశాయి?

2024లో రెండో అటెంప్ట్‌లో అదితి అద్భుతం సృష్టించింది. ఆల్ ఇండియా ర్యాంక్ 97 తెచ్చుకుంది! ఇది టాప్ 100లో ఒక్కోసారి రావటం కష్టమైన విషయం. ఈ ర్యాంక్‌తో ఐఏఎస్ కూడా అందుబాటులో ఉంది కానీ ఆమె మళ్లీ ఐఎఫ్‌ఎస్ ఎంచుకుంది. ఎందుకంటే ఐఎఫ్‌ఎస్‌లో ప్రపంచ దేశాలతో డీలింగ్.. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి ఇదే ఆమె ప్యాషన్. ఐఎఎస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్‌పై ఫోకస్ పెట్టింది కానీ ఐఎఫ్‌ఎస్ గ్లోబల్. ఈ చాయిస్ చాలా అటెన్షన్ పలికింది ఎందుకంటే చాలా టాప్‌రాంకర్లు ఐఎఎస్ తీసుకుంటారు. అదితి ఇంటర్వ్యూల్లో చెప్పింది ఈ ర్యాంక్‌తో నేను సంతోషిస్తున్నాను ట్రైనింగ్ కోసం ఎక్సైటెడ్‌గా ఉన్నాను అని. ఆమె ప్రిపరేషన్ స్ట్రాటజీ.. ఎకనామిక్స్ ఆప్షనల్‌లో ఫోకస్.. ఎథిక్స్ పేపర్‌లో స్మార్ట్ రైటింగ్.. రెగ్యులర్ మాక్ ఇంటర్వ్యూలు.. వాజిరాం అండ్ రవి.. స్టడీఐక్యూ వంటి ప్లాట్‌ఫామ్‌లు ఆమెకు హెల్ప్ చేశాయి.

అదితి మాటల్లో చెప్పాలంటే పెద్ద సక్సెస్ ఎప్పుడూ సడన్‌గా రాదు. అది కన్సిస్టెంట్ హార్డ్ వర్క్.. ఫోకస్.. గోల్స్ పట్ల కమిట్‌మెంట్‌తో వస్తుంది. ఆమె ఫ్యామిలీ ముఖ్యంగా తల్లిదండ్రులు ఆమెకు బలమైన సపోర్ట్. ఆమె తండ్రి అశిష్ తల్లి సీమ వాళ్లు సోషల్ వర్కర్స్ కూడా. యూపీఎస్సీ రిజల్ట్ తర్వాత ఆమె గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ గారి బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఇప్పుడు ఆమె ఐఎఫ్‌ఎస్ ట్రైనింగ్ చేస్తోంది. భవిష్యత్తులో భారతదేశాన్ని ప్రపంచంలో మరింత బలంగా చేయడానికి పని చేస్తుంది. అదితి కథ మనకు ఏమి చెబుతుందంటే.. మొదటి విజయంతో సంతృప్తి చెందకుండా మరింత ఎదగాలని ప్రయత్నించాలి. మీ కలలు పెద్దవి అయితే కష్టపడటం మాత్రమే సరిపోదు.. స్మార్ట్‌గా ప్లాన్ చేయాలి.

ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న జాబ్ ట్రెండ్‌.. ఈ ఒక్క స్కిల్‌ ఉంటే ఉద్యోగం పక్కా!


Written By

S. Archana is an SEO specialist and sub-editor known for her strong adaptability and dedicated work ethic. A committed professional and an eager everyday learner, she continually sharpens her skills to deliver thoughtful, effective results.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *