లగిశెట్టి మాధవి(Lagisetty Madhavi) పేరు వినగానే చాలామందికి ఒక జర్నలిస్టు గుర్తుకు వస్తుంది. కానీ ఆమె జర్నలిజం కేవలం రాతలకే పరిమితం కాదు. MAమాస్ కమ్యూనికేషన్ చదివిన ఆమె, తెలంగాణ యూనివర్శిటీలో నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రజల నిజ జీవిత సమస్యలతో కలిపి చూసే వ్యక్తి. టీవీ9, టీన్యూస్, ఆర్టీవీ, హెచ్‌ఎమ్‌టీవీ, జీ తెలుగు లాంటి ప్రముఖ సంస్థల్లో పని చేసిన ఆమె.. సమాజంలో జరుగుతున్న సమస్యలను దగ్గరగా చూసింది. వార్తలు రాయడమే కాదు, ఆ వార్తల వెనుక ఉన్న మనుషుల జీవితాలను అర్థం చేసుకుంది. అదే ఆమెను మిగతావాళ్లతో పోల్చితే భిన్నంగా నిలబెడుతుంది.
ఈరోజు ఆమె లక్ష్మాపూర్ గ్రామం 3వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి కారణం కూడా అదే. మన గ్రామం మున్సిపాలిటీ అయింది. కానీ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. డ్రైనేజీ లేక మురుగు నిల్వ, పాడైన రోడ్లు.. చిన్న పనికైనా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఒక జర్నలిస్టుగా ఇవన్నీ చూసింది. ఒక గ్రామపు అమ్మాయిగా ఇవన్నీ భరించింది. చూసి మౌనంగా ఉండలేకపోయింది. అందుకే పార్టీ రాజకీయాలకు దూరంగా, స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చింది.
లక్ష్మాపూర్ ప్రజల దైనందిన జీవితాన్ని సులభం చేయడమే ఆమె మొదటి లక్ష్యం. డ్రైనేజీ సమస్యకు తాత్కాలిక పరిష్కారాలు కాదు, శాశ్వతమైన చర్యలు తీసుకోవడం. మురుగు నిల్వలేకుండా శుభ్రత డ్రైవ్‌లు నిర్వహించడం. ఇవన్నీ ఫైల్స్‌లో ఉండే మాటలు కాదు. ప్రజలు రోజూ ఎదుర్కొనే సమస్యలకు నేరుగా ఇచ్చే సమాధానాలు. మహిళల భద్రత విషయంలో మాధవికి స్పష్టమైన అవగాహన ఉంది. మహిళలకు సంబంధించిన సమస్యలు వస్తే వెంటనే స్పందించే విధానం ఉండాలి అన్నది ఆమె నమ్మకం. ఒక మహిళగా, ఒక కుటుంబ సభ్యురాలిగా మహిళల గౌరవం, భద్రత ఆమెకు అత్యంత ముఖ్యమైన అంశం.
యువత విషయంలో కూడా ఆమె ఆలోచన స్పష్టంగా ఉంది. చదువుకున్నా అవకాశాలు లేని యువతను ఆమె దగ్గరగా చూసింది. స్కిల్ ట్రైనింగ్, నాయకత్వ లక్షణాల అభివృద్ధి, క్రీడలకు ప్రోత్సాహం, చదవాలనుకునే వారికి లైబ్రరీ వంటి సదుపాయాలు తీసుకురావాలన్న ఆలోచన ఆమెకు ఉంది. ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో యువతకు సరైన మార్గదర్శనం ఇవ్వడం ఆమెకు అలవాటు. ఇప్పటివరకు వ్యక్తిగతంగా ఎంతమందికి అవకాశాలు చూపించిందో, అదే పని వ్యవస్థబద్ధంగా చేయాలన్నదే ఆమె లక్ష్యం.
మున్సిపాలిటీ పనుల్లో లంచం లేకుండా సేవలు అందించాలన్నది ఆమె మరో ముఖ్య ఆలోచన. సర్టిఫికెట్లు కావాలన్నా, చిన్న మున్సిపల్ పనులైనా ప్రజలు భయపడకుండా చేయించుకునే విధంగా సహాయం చేయాలని ఆమె భావిస్తుంది. అందుకే ప్రతి ఆదివారం ప్రజా వినతులు, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ఫోన్, నెలవారీ ఖర్చుల వివరాలను ప్రజల ముందే ఉంచే పారదర్శక పాలన ఆమె మాటల్లో మాత్రమే కాదు, ఆమె పని తీరులోనూ కనిపిస్తుంది.
నేను బయటివాళ్లను కాదని మాధవి స్పష్టంగా చెబుతుంది. మీ మధ్యే ఉంటాను అని ధైర్యంగా చెప్పగలుగుతుంది. పార్టీకి కాదు, ప్రజలకు జవాబుదారీ అని నమ్ముతుంది. చదువు ఉన్న నాయకత్వం అవసరం అని ఈ రోజున ప్రజలే కోరుకుంటున్నారు. సమస్య అర్థం చేసుకునే జ్ఞానం, పరిష్కారం చూపించే అవగాహన, అమలు చేసే ధైర్యం ఉన్న వ్యక్తే లీడర్‌గా ఉండాలి. ఆ లక్షణాలు మాధవిలో ఉన్నాయి. లక్ష్మాపూర్ గ్రామం 3వ వార్డుకు మాధవి ఒక రాజకీయ ప్రయోగం కాదు. ప్రజల మధ్య నుంచి వచ్చిన ఒక ఆశ. మాట్లాడే నాయకురాలు కాదు, పని చేసే మనిషి. అదే ఆమె బలం. అదే ప్రజలకు నమ్మకం.
ALSO READ: ‘మీ సమస్యలన్నీ తీరుస్తా..’! లక్ష్మాపూర్ ప్రజల కోసం నిలబడుతున్న లగిశెట్టి మాధవి…!

Telangana Holiday Calendar: 2026లో 27 సెలవులు మాత్రమే.. తీవ్ర నిరాశలో ప్రజలు..!
International Day for Girl Child: ఆడపిల్లను బతకనిద్దాం! ఆడపిల్లను ఎదగనిద్దాం!!
Piracy vs OTT: ఓటీటీ లు సినిమాను సమాధి చేస్తున్నాయా? పైసా పై అత్యాశే పైరసీ ని పెంచుతుందా ?
Telangana Assembly-లో Kaleshwaram రచ్చ: KCR-ను Target చేసిన Ghose Commission, CBI-కి Case!
తెలంగాణ విద్యాసంస్థల్లో Facial Recognition హాజరు: లాభమా? నష్టమా?
HCU Land Issue: సుప్రీం చేతిలో రేవంత్‌కు చివాట్లు! అసలు లొల్లి పర్యావరణం కోసమా? ఈ వివాదం వెనక పూర్తి చరిత్ర ఏంటి?