Menu

Smoke-Cigarattee Prices: కొనలేరు.. తాగకుండా ఉండలేరు.. తిక్కకుదిరింది..! సిగరెట్ ప్రియుల జేబులకు చిల్లు..

Archana 1 month ago
cigarattee prices on hike

ఉదయం లేవగానే కొట్టు దగ్గరకు వెళ్లి అన్నా ఓక సిగరెట్ అని తాగితే కానీ వారికి తృప్తి ఉండదు. టీ తాగక..తిన్న తర్వాత ఇలా రోజంతా ఏదో విధంగా తాగుతూనే ఉంటారు. ఇలాంటి వారిని తరుచుగా మనం చూస్తూనే ఉంటాం. రోజూ తగితే ఆరోగ్యం దెబ్బతింటుందని తెసిలిన కూడా వదలరు. ధూమపానం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోయిన కూడా మిగతావారు మారడంలేదు. వాటికి బానిసగా మారిపోతున్నారు. సిగరెట్ లేనిదే బతకలేము అన్నట్టు అయిపోతున్నారు . ఇలాంటి వారి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలో టొబాకో ప్రొడక్ట్స్‎పై టాక్స్ పెరిగిపోతోంది కాబట్టి సిగరెట్ ధరలు పెరగబోతున్నాయి. కేంద్రం నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?

ఇక ఇండియాలో ఏటా 13 లక్షల నుంచి 13.5 లక్షల మంది టొబాకో వల్ల చనిపోతున్నారు. క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాస సమస్యలు ఇలా చాలా రోగాలకి టొబాకో మూల కారణం. 26 కోట్లకు పైగా పెద్దలు టొబాకో వాడుతున్నారు అందులో సిగరెట్, బీడీ, గుట్కా, పాన్ మసాలా. ఇది ఆరోగ్యానికే కాదు ఆర్థికంగా కూడా పెద్ద నష్టం. అందుకే వాటిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1, 2026 నుంచి టొబాకో ప్రొడక్ట్స్‎పై కొత్త టాక్స్ సిస్టమ్ తెచ్చింది. సిగరెట్స్‎పై వెయ్యి స్టిక్స్‎కి 2000 నుంచి 11 వేల వరకు ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. సిగరెట్స్ సైజు‎ని భట్టి ట్యాక్స్ ఉంటుంది అంటే చిన్నవి తక్కువ, పెద్దవి ఎక్కువ టాక్స్. గుట్కా, చూయింగ్ టొబాకోపై కూడా డ్యూటీ భారీగా పెరిగింది. దీని వల్ల సిగరెట్ ధరలు 15 నుంచి 40 శాతం వరకు పెరగవచ్చు. ప్రీమియం బ్రాండ్స్ ఒక్కో స్టిక్‎కి 5 రూపాయలు ఎక్కువ అవుతుంది.

మరోవైపు ఈ పెంపు తర్వాత కూడా ఇండియాలో సిగరెట్స్‎పై టోటల్ టాక్స్ రిటైల్ ప్రైస్‎లో సుమారు 53 శాతం మాత్రమే ఉంటుంది . టొబాకో వాడకం తగ్గించడానికి కనీసం 75 శాతం టాక్స్ ఉండాలి. ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పటికే 75 నుంచి 90 శాతం వరకు టాక్స్ వేస్తున్నాయి. ఫిన్లాండ్ లాంటి దేశాల్లో 90 శాతం వరకు టాక్స్ ఉంటుంది. కానీ ఇండియాలో సామాన్యుడు సులభంగా కొనగలిగేలా అఫర్డబుల్‎గా ఉన్నాయి.

ఇక WHO రీసెర్చ్ ప్రకారం టొబాకో ధరలు 10 శాతం పెరిగితే వాడకం 4 శాతం తగ్గుతుంది మనలాంటి మిడిల్ ఇన్కమ్ దేశాల్లో 5 శాతం తగ్గుతుంది. అంటే టాక్స్ పెంచడం టొబాకో కంట్రోల్‎కి బెస్ట్ వే. ధరలు పెరిగితే ముఖ్యంగా యంగ్ జనరేషన్, పేదవాళ్లు వాడకం మానేస్తారు లేదా తగ్గిస్తారు. ఈ టాక్స్ పెంపు మంచి స్టెప్ అయినా ఇంకా ఎక్కువ చేయాలి . బీడీలు, స్మోక్ లెస్ టొబాకోపై కూడా ఎక్కువ ట్యాక్స్ వేయాలి. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ మంది అవే వాడుతున్నారు. ఇలా చేస్తే టొబాకో వాడకం తగ్గి లక్షల మంది ప్రాణాలు కాపాడొచ్చు .

ALSO READ: మహీంద్ర నుంచి మరో కొత్త వెర్షన్‌ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే!


Written By

S. Archana is an SEO specialist and sub-editor known for her strong adaptability and dedicated work ethic. A committed professional and an eager everyday learner, she continually sharpens her skills to deliver thoughtful, effective results.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *