Menu

New Year Resolutions 2026: ఈసారైనా న్యూఇయర్‌ రిజల్యూషన్‌ పాటిస్తారా? బిస్కెట్ చేస్తారా?

Archana 1 month ago
new year resolution reasons failed

కొత్త సంవత్సరం వస్తుందంటే అందరిలో తెలియని ఉత్సాహం మొదలవుతుంది..ముందు రోజు నుంచే సంబరాలు ప్రారంభం అవుతాయి ..డాన్సులు వేస్తూ..కేక్ కట్ చేసి ఆ ఆనందంలో మునిగిపోతారు..ఇది పక్కన పెడితే ప్రతి ఒక్కరిలో న్యూ ఇయర్ రిజల్యూషన్ అని కొని నిర్ణయాలు తీసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ నాలో చాలా మార్పులు రావాలని అనుకుంటారు.. బరువు తగ్గాలి, జాబ్ చేంజ్ అవ్వాలి, చెడు అలవాట్లు మానేయాలి, మొబైల్ వాడకం తగ్గించాలి, డబ్బు ఆదా చేయాలి ఇలా ఎదో ఒకటి అనుకుంటారు..జనవరి ఒకటి నుంచి ప్రారంభిస్తారు .కానీ కొని రోజులకే వారి నిర్ణయాలు అటకెక్కేకుతాయి. కొద్దీ రోజుల్లో బద్ధకం మొదలవుతుంది. ఎప్పటిలాగే వచ్చే ఏడాది చూద్దాంలే అనుకుంటారు. అసలు ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఎందుకు విఫలమవుతున్నాయి ? దీనికి కారణాలేంటి?

ఇక కొత్త ఏడాదిలో తమ జీవితాన్ని వెంటనే మార్చుకోవాలని భావిస్తుంటారు. ఉదాహరణకు క్రమం తప్పకుండా జిమ్‎కి వెళ్ళాలి బరువు తగ్గాలని అనుకుంటారు. వ్యాయాయం, డైట్ అని మొదలుపెడతారు. కానీ ఇవ్వని అనుకోవడానికి బాగుంటాయి. ఎందుకంటే ప్రారంభించిన మొదటి రోజుల్లో ఉత్సాహంతో అతిగా వ్యాయాయం చేస్తారు అది కొద్దీ రోజులకి నావల్ల కాదని చేతులెత్తేస్తారు. లక్ష్యాలు ఉండొచ్చు కానీ కఠినంగా ఉండకూడదు. చిన్నపాటిగా మొదలుపెట్టి పెంచుకుంటూ పోవాలి.

మరోవైపు చాలా మంది కొత్త సంవత్సరం క్రమశిక్షణ పాటించాలి అనుకుంటారు. కానీ కొద్దీ రోజులు మాత్రమే ఆ ఉత్సాహం ఉంటుంది. ఆ తర్వాత నిర్ణయాలు మాయమవుతాయి. నిర్లక్యం, బద్దకం మొదలయి మీరు అనుకున్న న్యూ ఇయర్ రిజల్యూషన్ గాలికి వదిలేస్తారు. న్యూ ఇయర్ రిజల్యూషన్ కొనసాగించాలంటే పట్టుదలతో ప్రతిరోజు అలవాటుగా మలుచుకోవాలి.

ఇక చాలా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనుకుంటారు కానీ సరైన ప్లాన్ వేసుకోరు. తీసుకున్న నిర్ణయాలకు ఎలా మొదలుపెట్టాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని అనుకోరు. కాబట్టి మీరు అనుకున్న దానికి సరైన ప్లాన్ వేసుకొండి. లేదంటే తర్వాత చూసుకుందాంలే అని అనుకుంటారు.

మరోవైపు మీరు తీసుకున్న నిర్ణయాలు ఏదైనా సరే జనవరిలో ఇష్టంగా ప్రారంభిస్తారు..కొన్ని కారణాల వల్ల ఒక్కసారి మిస్ అయితే అంతా వృధానే. ఒక్కసారే కదా అని నిర్లక్ష్యం చేయకండి మళ్లీ ప్రారంభించాలని ఆలోచన రాదు. అందుకే మీరు అనుకున్న న్యూ ఇయర్ రిజల్యూషన్స్ క్రమం తప్పకుండా చేయండి.

మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ విఫలమవకుండా ఉండాలంటే ఒక డైరీలో రాసుకోండి లేదా ఫోన్‎లో రిమైండర్ పెట్టుకోండి. అప్పుడు సాధించాలని ఆలోచన వస్తుంది.

ALSO READ: స్వర్గమని నమ్మాం.. నరకంలో జీవిస్తున్నాం..! ఆత్మాభిమానాన్ని చంపే పెళ్లి ఎప్పటికైనా కూలిపోతుంది! పెద్దల దగ్గర దీనికి సమాధానం ఉందా?

 


Written By

S. Archana is an SEO specialist and sub-editor known for her strong adaptability and dedicated work ethic. A committed professional and an eager everyday learner, she continually sharpens her skills to deliver thoughtful, effective results.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *