మంచి జీతాలున్న ఉద్యోగాలంటూ ఎంతో కష్టపడి తెచ్చుకుంటాం..కానీ జీతంలో పాటు టెన్షన్ మధ్య బతుకుతున్నాం..జీతాలు లక్షల్లో ఉన్నా ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి..శాలరీ చేతిలో పడడం, ఈఏంఐలకు కట్టడం.. ఎన్ని లెక్కలు వేసినా నెలాఖరు వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ ఉండదు. కరెంట్ బిల్లు, వాటర్ బిల్, ఇంటి రెంట్, స్కూల్ ఫీజ్ ఇలా ఎన్నో ఖర్చులు. మన జీతం అసలు సరిపోదు. అప్పుడు అప్పులపై అప్పులు చేసుకుంటూపోతాం. ఇంకేముంది వచ్చిన జీతమంతా కట్టుకోవడానికి సరిపోతుంది. అందుకే ఈ కష్టాలను తగ్గించడానికి ఏఐ మన తోడు ఉంది. మన సమస్యలకు ఏఐ పరిష్కారం చూపుతుందా? వ్యక్తిగత బడ్జెట్ విషయంలో ఏఐ సహాయపడుతుందా? ఇప్పుడు చూద్దాం!
ఇక అసలు విషయానికి వస్తే సాధారణంగా మనం గత నెలలో ఏం ఖర్చు చేశామో బడ్జెట్ వేసుకుంటాం. కానీ దీనికి ఏఐ బిన్నంగా ఆలోచిస్తుంది. అంటే ఎలా అంటారా? మీ గత ఆరు నెలల ఖర్చు తీరును గమనించి వచ్చే నెలలో మీ ఆర్థిక పరిస్థితేంటో అంచనా వేస్తుంది. అంతేకాదు జూన్లో మీ పిల్లల స్కూల్ ఫీజు ఖర్చులు ఉంటాయని ఏప్రిల్ నుంచే అప్రమత్తం చేస్తుంది. వచ్చే రెండు నెలల్లో మీకు భారీ ఖర్చు ఉంది కాబ్బటి షాపింగ్ తగ్గించండని హెచ్చరిస్తుంది..
మరోవైపు ఆర్థిక నిపుణులు చెప్పే సూత్రం తెలుసు కదా సంపాదనలో 50 శాతం అవసరాల, 30 శాతం కోరికలు, 20 శాతం పెట్టుబడులకు కేటాయించాలి. దీని ఆచరణలో పెట్టడం కష్టం..కాబట్టి మన జీతం పడగానే వేర్వేరు భాగాలు చేసి ఏఐ అందుబాటులో ఉంచుతుంది. అలాగే చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే చిన్నచిన్న ఖర్చులవుతుంటాయి. ఇలాంటి వాటిని ఏఐ గుర్తించి అప్రమత్తం చేస్తుంది.
ఇక ఆన్లైన్ షాపింగ్ విషయానికొస్తే దాని ధర పోల్చి చూసి సరైనదే కొంటున్నారా లేదా అని విశ్లేషిస్తుంది. మరోవైపు మనం ఫ్రెండ్స్ కలిసినపుడు ఆనందంతో చాలా ఖర్చులు చేస్తాం. కానీ ఏఐ సందర్భాన్ని, సమయాన్ని భట్టి మానసిక స్థితిని అర్థం చేసుకోగలదు. అర్ధరాత్రి ఆన్లైన్ షాపింగ్ చేస్తే ఇది అన్నవసరపు ఖర్చు..ఒక్కసారి ఆలోచించండి అని నోటిఫికేషన్ పంపుతుంది. మరోవైపు చాలా మంది కారు కొనాలి, ఇల్లు కట్టాలి అనుకుంటారు. కానీ దాని ఖర్చు ఊహించలేము. ఏఐ ఎలా జమా చేయాలో చెబుతుంది. మీతో మిగిలిన చిల్లరను మీరు అనుకున్న లక్ష్యం వైపు మళ్లిస్తుంది.
మరోవైపు ఏఐ ఒక అద్భుతమైన సాంకేతికత. కేవలం ఆర్బీఐ గుర్తింపు పొందిన పేరున్న బ్యాంకులకు సంబంధించిన ఏఐ టూల్స్ మాత్రమే వాడాలి. యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీ మొబైల్‌కు వచ్చే సందేశాలను చదివేందుకు అనుమతి అడుగుతుంది. ఈ విషయంపై అవగాహన ఉండాలి. ఏఐ సలహా ఇస్తుంది కానీ అంతిమంగా చెయ్యాలా?.. వద్దా ? అని మీ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
ALSO READ: మీ లైఫ్ పార్ట్‌నర్‌తో చెప్పకూడని నాలుగు విషయాలు.. ఇది సిక్రెసీ కాదు ప్రైవసీ!

AI ప్రపంచంలో కనిపించని భాషలు.. ప్రపంచానికి ఆఫ్రికా చెప్పని కథ
Careers and Education: డిగ్రీతో ఉపయోగం లేదు.. ఈ స్కిల్స్ ఉంటే మాత్రం జాబ్ ఫిక్స్!
రూపాయి ప్రయాణం: నాటి ‘ICU’ విమర్శల నుంచి నేటి ₹88/$ వరకు – వాస్తవాలు, వాదనలు
తెలంగాణ విద్యాసంస్థల్లో Facial Recognition హాజరు: లాభమా? నష్టమా?
AI Fake Videos: AIతో పచ్చి బూతులు.. వికృత బుద్ధి చూపిస్తోన్న మగాళ్లు!