ఈ రోజుల్లో సేవింగ్స్ అంటే జీవితంలో చాలా ముఖ్యం అయిపోయింది. మన ఖర్చులు అధికమవుతున్నాయి. ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఆదుకునేది మనం సేవింగ్స్ చేసుకున్నవే. అందుకే ప్రతి ఒక్కరు సేవింగ్స్‌పై ప్రత్యేక దృష్టి పెడతారు. ఎవరైనా కూడా రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని సంతోషంగా గడపాలని కలలు కంటారు.దీని కోసం ఒక సూపర్ పరిస్కారం దొరికింది. అదే స్టెప్-అప్ SIP. అయితే రిటైర్మెంట్ కోసం ఎలా ప్లాన్ చేయాలి? ఏం చేస్తే మన సేవింగ్స్ భవిష్యత్తులో కూడా వాల్యూ కోల్పోకుండా ఉంటుంది? స్టెప్-అప్ SIP మీ రిటైర్మెంట్ ప్లాన్‌ని ఎలా స్ట్రాంగ్ చేస్తుందో తెలుసుకోండి!
SIP అంటే ఏంటి?
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటే నెలనెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయడం. ఇది సరళంగా ఉంటుంది, డిసిప్లిన్‌ను తెస్తుంది. కానీ సాధారణ SIPలో మొత్తం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. దీర్ఘకాలికంగా 20-30 సంవత్సరాలు పెట్టుబడి చేస్తున్నప్పుడు ఇది సరిపోకపోవచ్చు. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ వల్ల మన ఖర్చులు పెరుగుతాయి. ఇక్కడే స్టెప్-అప్ SIP ఉపయోగపడుతుంది. స్టెప్-అప్ SIP అంటే మీ SIP మొత్తాన్ని నిర్దిష్ట వ్యవధిలో సాధారణంగా సంవత్సరానికి ఒకసారి పెంచడం. ఈ పెంపు ఒక ఫిక్స్‌డ్ రూపాయల మొత్తం కావచ్చు లేదా పర్సెంటేజ్ ఆధారంగా ఉదాహరణకు 10% పెంపు.
ఆదాయ వృద్ధికి ఎలా సరిపోతాయి?
మన కెరీర్ ముందుకు సాగుతున్నకొద్దీ జీతాలు పెరుగుతాయి, అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. కానీ స్టెప్-అప్ SIPలతో మీ అదనపు ఆదాయంలో కొంత భాగం ఆటోమేటిక్‌గా పెట్టుబడికి వెళ్తుంది. ఒకసారి సెట్ చేసుకుంటే పెంపు అలోమెటిక్‌గా జరుగుతుంది. జీవితం బిజీగా ఉన్నప్పుడు కూడా మీ ఇన్వెస్ట్‌మెంట్ క్రమం తప్పకుండా కొనసాగుతుంది.
దీర్ఘకాలంలో భారీ ప్రభావం చూపుతాయా?
ఇక కాంపౌండింగ్ పవర్ ఇక్కడ కీలకం చిన్న మొత్తంతో మొదలుపెట్టి ప్రతి సంవత్సరం పెంచుతూ వెళ్తే సాధారణ SIP కంటే చాలా పెద్ద కార్పస్ సృష్టించవచ్చు. తర్వాతి సంవత్సరాల్లో పెద్ద మొత్తాలు పెట్టుబడి చేస్తున్నప్పుడు మార్కెట్ గ్రోత్ నుంచి ఎక్కువ లాభం వస్తుంది. ఉదాహరణకు మీరు నెలకు 10,000 రూపాయలతో SIP మొదలుపెడతారుజ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో 10% సంవత్సరానికి పెంపు ఎంచుకుంటారు. 12% సగటు రిటర్న్ అనుకుంటే 20 సంవత్సరాల తర్వాత మీ టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ 68,73,000 రూపాయలు అవుతుంది. అంచనా రిటర్న్స్ 1,17,58,383 రూపాయలు, మొత్తం కార్పస్ 1,86,31,383 రూపాయలు. ఒకవేళ మీరు సాధారణ SIPగా 10,000 రూపాయలు ఫిక్స్‌డ్‌గా కొనసాగిస్తే మొత్తం కార్పస్ సుమారు 92 లక్షలు మాత్రమే అవుతుంది. చిన్న పెంపు ఎంత తేడా తెస్తుందో. ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల తర్వాతి సంవత్సరాల్లో పెద్ద మొత్తాలు ఎక్కువ సమయం పెరుగుతాయి.
ఇన్‌ఫ్లేషన్‌తో పోరాడటంలో సహాయపడతాయా ?
ఇన్‌ఫ్లేషన్ వల్ల డబ్బు విలువ తగ్గుతుంది. సాధారణ SIPలో మొత్తం ఫిక్స్‌డ్ ఉంటే అది భవిష్యత్ ఖర్చులతో సరిపడకపోవచ్చు. కానీ స్టెప్-అప్ SIPలు మొత్తాన్ని క్రమం తప్పకుండా పెంచుతాయి. దాని వల్ల మీ సేవింగ్స్ ఇన్‌ఫ్లేషన్‌ను ఓడిస్తాయి. ఉదాహరణకు ఇండియాలో సగటు ఇన్‌ఫ్లేషన్ 6-7% ఉంటుంది కానీ.. మీ SIP పెంపు 10-15శాతం ఉంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ దాని కంటే ఎక్కువ పెరుగుతుంది. ఇది రిటైర్‌మెంట్ సమయంలో మీకు సౌకర్యవంతమైన జీవితాన్ని అందిస్తుంది. మెడికల్ ఖర్చులు, రోజువారీ అవసరాలు సరిపోయేలా ఉపయోగపడుతుంది.
మరోవైపు స్టెప్-అప్ SIPలు ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి కానీ.. డిసిప్లిన్‌ను కోల్పోకుండా మీరు మీ ఆదాయం, సౌకర్యం ఆధారంగా పెంపు రేటును ఎంచుకోవచ్చు. 5% నుంచి 20% వరకు అవసరమైతే పాజ్ చేయవచ్చు లేదా మార్చవచ్చు. ఇది దీర్ఘకాలిక ప్లాన్‌ను బ్రేక్ చేయకుండా అడ్జస్ట్ చేసుకోవడానికి సహాయపడుతుంది. మరిన్ని ఉదాహరణలు చూస్తే మీరు 5,000 రూపాయలతో మొదలుపెట్టి 10% పెంపుతో 25 సంవత్సరాల్లో 2 కోట్ల టార్గెట్ చేరుకోవచ్చు. ఇది రిటైర్‌మెంట్, పిల్లల చదువు వంటి లక్ష్యాలకు బాగా సరిపడుతుంది.
ఇక రిటైర్‌మెంట్ ప్లానింగ్ ఒక దీర్ఘకాలిక ప్రయాణం. ఇప్పుడు పెట్టుబడి చేసిన డబ్బు 20 సంవత్సరాల తర్వాత ఇన్‌ఫ్లేషన్ వల్ల తక్కువ విలువైపోవచ్చు. స్టెప్-అప్ SIPలు మీ సేవింగ్స్‌ను పెరిగే ఖర్చులతో సమానంగా పెంచుతాయి. దాని వల్ల మీ రిటైర్‌మెంట్ కార్పస్ జీవన వ్యయంతో పాటు పెరుగుతుంది. ఇది రియలిస్టిక్ మార్గం. చిన్న మొత్తంతో మొదలుపెట్టి ఆదాయ పెరుగుదలను ఉపయోగించుకుని కాంపౌండింగ్ పవర్‌తో భారీ వెల్త్ సృష్టించవచ్చు. ముఖ్యంగా ఇది రిటైర్‌మెంట్ ప్లానింగ్‌ను సులభంగా అనుసరించేలా చేస్తుంది.
ALSO READ: రూ.75వేల శాలరీ.. ఇండియన్ ఆర్మీకి సర్వీస్ చేసే ఛాన్స్.. పూర్తి డీటెయిల్స్ ఇవే!

Salary: 70:30 రూల్ ఫాలో అవ్వండి.. లేదంటే మీకు శాలరీ ఎంత భారీగా వచ్చినా వెంటనే అయిపోతుంది!
SIP: లక్ష పెడితే రూ.51లక్షలు..! ఇన్వెస్టర్లకు ఫేవరెట్ స్కీమ్ ఇది..!
Business Ideas: ఈ 6 బిజినెస్ ఐడియాస్తో మీరు లక్షలు సంపాదించవచ్చు.. పెట్టుబడి కూడా చాలా తక్కువ!
Investment Ideas: PPF బెటరా? FD బెటరా? మీ ఫైనాన్షియల్ గోల్స్‌కి ఏది సరిపోతుంది?
Gold Investment: బంగారంలో పెట్టుబడి పెట్టడం ఎలా? ఉన్న ఆప్షన్స్ ఏంటి?
Investment Plans: రూ.10,000తో రూ.కోటి ఎలా సంపాదించొచ్చు? అదిరిపోయే పెట్టుబడి ఐడియా!