చదువులు అయిపోగానే సంపాదనపై దృష్టి పెడతాం. ఎన్నో కష్టాలు పడి ఒక జాబ్ సంపాదించుకుంటాం.. జీతం లక్షల్లో ఉంటుంది కానీ ఖర్చులు అంతకు మించి ఉంటాయ్. ప్రతి నెల శాలరీ క్రెడిట్ అవుతుంది కానీ ఏదో ఒక టెన్షన్ ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి, బిల్లులు చూస్తే భయమేస్తుంది, బోనస్ వస్తుందని ప్లాన్ చేసినవన్నీ ఆలస్యమైతే ఏం చేయాలో తెలియదు. చాలా మంది ఇలాంటి సమస్యలోనే ఉంటారు కదా? బాగా ఎర్న్ చేస్తున్నా ఎందుకు డబ్బు స్ట్రెస్ తగ్గడం లేదు? ఇంక్రిమెంట్ రాకపోతే లైఫ్ ఎలా సాగుతుంది? మరి దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంటే ఎలా ఉంటుంది? ఒక సూపర్ ప్రాక్టికల్ రూల్ ఉంది. అదే 70శాతం శాలరీ రూల్.. అదేంటో తెలుసుకోండి!
70:30 రూల్:
చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ వాలియా ఇటీవల లింక్డిన్లో ఈ ఐడియా షేర్ చేశారు. ఆయన చెప్పిన పాయింట్ చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. చాలా మంది పెద్ద పొరపాటు ఏం చేస్తారంటే పూర్తి శాలరీ మీదే తమ లైఫ్‌స్టైల్‌ని ప్లాన్ చేసేస్తారు. అంటే రెంట్, షాపింగ్, బయట తినడం, ట్రిప్స్, అన్నీ పూర్తి ఇన్కమ్ వచ్చినట్టు కాల్కులేట్ చేసి ఖర్చు పెంచేస్తారు. కానీ అది పెద్ద రిస్క్. ఎందుకంటే మన శాలరీలో ఫిక్స్‌డ్‌గా వచ్చేది ఒక్కటే టేక్-హోమ్ పే. ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లోకి పడే ఆ అమౌంట్ మాత్రమే నిజంగా మనది.
మిగతావి బోనస్‌లు, ఇంక్రిమెంట్స్, ESOPs, CTCలో చూపించే ఎక్స్‌ట్రాలు… అవన్నీ గ్యారంటీ కావు. బోనస్ డిలే అవ్వచ్చు, తక్కువ రావచ్చు, కొన్ని సార్లు రాకపోవచ్చు. ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇలాంటి అనిశ్చితమైన డబ్బు మీద ఆధారపడి ఖర్చులు పెంచుకుంటే, ఒక్కసారి ప్లాన్ తప్పితే మొత్తం బడ్జెట్ దెబ్బతింటుంది. అందుకే అభిషేక్ చెబుతుందన్నది ఏంటంటే.. మీ లైఫ్‌స్టైల్‌ని మీ టేక్-హోమ్ శాలరీలో 70శాతం మీద మాత్రమే బిల్డ్ చేయండి. అంటే రోజువారీ ఖర్చులు, రెంట్, గ్రోసరీస్, బిల్లులు, ఫన్ కోసం కూడా ఆ 70 శాతంతోనే సరిపడేలా ప్లాన్ చేసుకోండి.
మరోవైపు మిగిలిన 30శాతం ఏం చేయాలంటే..అది కేవలం సేవింగ్స్. అనూహ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, జాబ్ లాస్ అయినా, ఫ్యామిలీలో ఏదైనా సడన్ ఖర్చు వచ్చినా ఆ 30 శాతం హెల్ప్ అవుతుంది. ఇండియాలో ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్‌గా కనీసం 6 నుంచి 12 నెలల ఖర్చులు పక్కన పెట్టుకోవాలి. ఈ 30 శాతాన్ని ప్రతి నెల సేవ్ చేస్తే క్రమంగా ఆ ఫండ్ బిల్డ్ అవుతుంది. ఇది సేవ్ చేసి పడనిచ్చే డబ్బు కాదు మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ఉండే బఫర్.
ఇక చాలా మంది ఫైనాన్షియల్ స్ట్రెస్‌కి కారణం ఇన్కమ్ తక్కువ కాదు, టైమింగ్ ప్రాబ్లమ్. స్టేబుల్ కాని డబ్బుని ముందే ఖర్చు పెట్టేస్తారు. ఫలితంగా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మొత్తం బడ్జెట్ గందరగోళమవుతుంది. కానీ ఈ 70 శాతం రూల్ ఫాలో చేస్తే మీరు ఎప్పుడూ సేఫ్ జోన్లో ఉంటారు. ఎంత సంపాదించినా సరే ఖర్చు హ్యాబిట్స్ సరిగ్గా లేకపోతే సమస్యలు తప్పవు. ఎంత ఎర్న్ చేస్తున్నామో కాదు లైఫ్‌స్టైల్ డిజైన్ ఎలా ఉంటుందో అది ముఖ్యం.ఈ రూల్ ట్రై చేస్తే మీ ఫైనాన్షియల్ లైఫ్ చాలా రిలాక్స్డ్ అవుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది, ఫ్యూచర్ కోసం స్ట్రాంగ్ బేస్ పడుతుంది.
ALSO READ: స్టాఫ్ సెలక్షన్ నుంచి సూపర్ న్యూస్.. 25వేల జాబ్స్‌కు గ్రీన్ సిగ్నల్!

Step Up SIP: రిటైర్మెంట్ కోసం ఎలా ప్లాన్ చేయాలి? ఈ SIPతో మీ రాబడి రెట్టింపు!