నా ఫ్రెండ్‌కి ఐఫోన్ అంటే చాలా ఇష్టం. తనకి నేను గిఫ్ట్ ఇద్దామని చాలాసార్లు అనుకున్నా.. కానీ లక్ష రూపాయల కంటే ఎక్కువ కాస్ట్ ఉండడంతో కొనలేకపోయా.. ఇంతలోనే ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తుంటే ఐఫోన్‌పై బంపర్ ఆఫర్ అనే న్యూస్ కనిపించింది. వెంటనే ఓపెన్ చేసి చూశా.. 87వేల రూపాయలకే ఐఫోన్ 17 వస్తుందని తెలుసుకోని ఆశ్చర్యపోయా.. ఆ వెంటనే ఆర్డర్ పెట్టేశా.. ఇంతకీ ఈ ఐఫోన్-17 డిస్కౌంట్ ఆఫర్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ మీరు కూడా వివరాలను తెలుసుకోండి!
భారీ డిస్కౌంటే కానీ.. లాస్ట్‌లో ట్విస్ట్:
యాపిల్ ఐఫోన్ అభిమానులు ప్రపంచమంతా ఉంటారు. వారంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన iPhone 17 సిరీస్ లాంచ్ తర్వాత ఈ ఫోన్ కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముందుగా ఇండియాలో iPhone 17 సిరీస్ ధరల విషయానికి వస్తే, iPhone 17 (256GB) ధర రూ.82,900 నుంచి ప్రారంభమవుతోంది. iPhone 17 Pro ధర రూ.1,34,900గా కంపెనీ ప్రకటించింది. ఇక టాప్ మోడల్ అయిన iPhone 17 Pro Max ధర రూ.1,49,900 నుంచి ఉంది. ధరలు ఎక్కువగా కనిపించినప్పటికీ, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ముఖ్యంగా అమెజాన్‌లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ట్రేడ్-ఇన్ ఆఫర్.
పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే, రూ.44,350 వరకు విలువ లభిస్తుంది. దీని వల్ల రూ.1,34,900 ధర ఉన్న iPhone 17 Pro, రూ.90,550కి తగ్గుతుంది. ఇదేకాకుండా, SBI, ICICI, IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డులు వాడే వినియోగదారులకు అదనంగా రూ.3,000 డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్‌తో iPhone-17 Pro ఫైనల్ ధర రూ.85,550 కే లభిస్తుంది.
అంటే సాధారణ ధరతో పోలిస్తే దాదాపు రూ.50,000 వరకు సేవింగ్ పొందే అవకాశం ఉంది. అందువల్ల iPhone అప్‌గ్రేడ్ చేయాలనుకునే వినియోగదారులకు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. డిజైన్ విషయానికి వస్తే, ఈసారి Apple కొత్తగా Cosmic Orange కలర్ ఆప్షన్‌ను అందించింది. ఈ కలర్ ప్రస్తుతం ఎక్కువగా ఆకట్టుకుంటోంది. అలాగే కెమెరా, పనితీరు, బ్యాటరీలో కూడా మెరుగుదలలు ఉన్నాయని యాపిల్ తెలిపింది. మొత్తానికి, iPhone 17 సిరీస్ లాంచ్‌తో పాటు వస్తున్న ఈ ఆఫర్లు, కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి కిక్కిచ్చేలా ఉన్నాయి. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి, ఇంకెందుకాలస్యం.. ఐఫోన్‌ను ఇప్పుడే బుక్ చేసుకుని ఇంటికి తెచ్చుకోండి. ఒకవేళ నాకు లాగా ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా కొనేసి ఇచ్చేయండి!
ALSO READ: ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. BITSAT నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!

Loan Offers: వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్.. అమెజాన్, ఫ్లిప్‌కార్టు నుంచి బిజినెస్ లోన్స్.. పూర్తి వివరాలివే!
Black Friday Sale: రూ.45,900కే ఐఫోన్.. క్రోమా బంపర్ ఆఫర్.. కొద్దీ రోజులే సమయం.. త్వరపడండి!
iPhone Offer: 50 వేలకే కొత్త ఐఫోన్!! అదిరిపోయే ఆఫర్లు, సూపర్ పెర్ఫార్మెన్స్ Flagship మొబైల్స్!