ఒక తల్లి ఆశ్చర్యపోతుంది.. నా పిల్లాడు ఇలా ఎలా మాట్లాడుతున్నాడు? తనకి ఎవరు ఇదంతా నేర్పించారని. కానీ పిల్లలు అలా మాట్లాడటం ఎవరో నేర్పించింది కాదు. అది వాళ్లు పుస్తకాల నుంచి నేర్చుకున్నది కాది స్కూల్ నుంచి నేర్చుకున్నది అంతకన్నా కాదు.. ఇంట్లో రోజూ చూస్తున్న జీవితం నుంచి నేర్చుకున్న పాఠం.
ఇంటి నుంచే ప్రవర్తన మొదలు:
పిల్లల మొదటి ప్రపంచం, మొదటి పాఠశాల.. ఇల్లు మాత్రమే . మొదటి బంధం అమ్మా–నాన్న. ఆ సంబంధంలో జరుగుతున్న ప్రతీ మాట, ప్రతీ మౌనం.. పిల్లల మనసులో నేరుగా ముద్ర పడుతుంది. పిల్లలు అవమానంగా మాట్లాడటం తమంతట తామే నేర్చుకోరు. వాళ్లు ఇంట్లో పెద్దలు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి నేర్చుకుంటారు. ముఖ్యంగా అమ్మా-నాన్న మధ్య జరుగుతున్న సంభాషణలు, ప్రవర్తనలను పిల్లల మెదడు సైలెంట్‌గా గమనిస్తుంది. ఏది సరైనదో, ఏది తప్పో అర్థం చేసుకునే వయసు రాకముందే, సంబంధాలు ఎలా ఉండాలో వాళ్లు నేర్చుకుంటారు. ఇందులో తండ్రి పాత్ర చాలా ముఖ్యమైనది, కానీ చాలాసార్లు దాన్ని మనం గమనించం. పిల్లలు గొడవల సమయంలో ఎలా మాట్లాడాలో, ఎక్కువగా తమ తండ్రిని చూసే అనుకరిస్తారు. తండ్రి అమ్మతో ఎలా మాట్లాడుతున్నాడో అబ్బాయిలు చూస్తారు. తండ్రి మహిళలను ఎలా గౌరవిస్తున్నాడో అమ్మాయిలు గమనిస్తారు.
తండ్రి ప్రవర్తనను చూసే..:
పిల్లలు.. చెప్పిన మాటలను కాపీ చేయరు. పెద్దలు ఒకరితో ఒకరు ఎలా వ్యవహరిస్తున్నారో అదే వాళ్ల ప్రవర్తన అవుతుంది. తండ్రి శాంతంగా, గౌరవంగా, ప్రేమగా మాట్లాడితే.. పిల్లలకు కూడా సహజంగా అదే అనిపిస్తుంది. కానీ తండ్రి కోపంగా మాట్లాడితే, తక్కువ చేసి మాట్లాడితే, లేదా పూర్తిగా మౌనంగా ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. వాళ్లు కావాలని అలా చేయరు. కానీ అలా ఉండాలనేలా వాళ్ల మనసు అలవాటు పడుతుంది.
View this post on Instagram
అమ్మ మీద ప్రతాపం:
ఆ ప్రవర్తన బయటపడేది ఎక్కువగా అమ్మ మీదే. ఎందుకంటే అమ్మ వాళ్లకు భద్రంగా అనిపిస్తుంది. ఆమె అర్థం చేసుకుంటుంది, సహిస్తుంది అని వాళ్లకు తెలుసు. ఒకసారి ప్రేమగా, ఇంకోసారి గట్టిగా అరుస్తూ ప్రవర్తించే తండ్రి ఉంటే పిల్లలు అయోమయానికి గురవుతారు. ఆ అసహనం బయటపడేది ఎక్కువగా అమ్మ మీదే. ఎందుకంటే అమ్మ ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. కానీ తండ్రి గొడవ అయిన తర్వాత సారీ చెప్పగలిగితే, అమ్మను సమానంగా గౌరవిస్తే, శాంతంగా మాట్లాడితే.. పిల్లలు కూడా గౌరవం నేర్చుకుంటారు. కోపం రావడం తప్పు కాదు. కానీ కోపంలో హర్ట్ చేయకూడదని అర్థం చేసుకుంటారు. నిజమైన బలం అంటే అరవడం కాదు.. భయపెట్టడం కాదు.. మనసును నియంత్రణలో ఉంచుకోవడం అని తెలుసుకుంటారు.
ఇది ఎవరి పైనా నింద వేయడానికి కాదు. ఎవరినైనా తప్పుపట్టడానికి కాదు. ఒక నిజాన్ని గుర్తు చేయడానికి మాత్రమే. పిల్లలు అమ్మను అవమానిస్తే.. అది ఆమె బలహీనత కాదు. అది వాళ్లు ఇంట్లో చూసిన ప్రవర్తనకి ప్రతిబింబం. పిల్లలు మన మాటలను వినరు.. మన జీవితాన్ని చూస్తారు. మనం ఎలా ప్రేమిస్తామో, మనం ఎలా గొడవ పడతామో, మనం ఎలా క్షమిస్తామో.. అదే వాళ్ల రేపటి ప్రపంచం. ఈ రోజు మనం మారితే, రేపటి తరం పిల్లల మాటలైనా మారతాయండి!
ALSO READ: బాధలో కలిసి కన్నీరు కార్చేదే నిజమైన ప్రేమ.. నీ మౌనాన్ని వినగలిగే ఆ ఒక్క మనసు ఎక్కడ దొరుకుతుంది?

Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
‘అమ్మా..ఇలా ఎందుకు చేశావు? నేనేం చేశా అమ్మా..’ కన్న బిడ్డను తోసేసి చంపేసిన కసాయి తల్లి!
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?
Relationships: మనల్ని మనమే మరిచిపోయిన కథ.. బతుకుతున్నామా లేదా నటిస్తున్నామా?
Relationship Tips: మీ లైఫ్ పార్ట్నర్తో చెప్పకూడని నాలుగు విషయాలు.. ఇది సిక్రెసీ కాదు ప్రైవసీ!