అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి చారిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 90 దాటడం ఇదే తొలిసారి. విదేశీ నిధుల ప్రవాహం, అధిక ముడి చమురు ధరలు, ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందం చుట్టూ ఉన్న అనిశ్చితి దీనికి ప్రధాన కారణాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి ఆశించిన స్థాయిలో జోక్యం లేకపోవడం కూడా మార్కెట్‌పై ఒత్తిడిని కలిగిస్తోందని ఫారెక్స్ వ్యాపారులు అంటున్నారు. ఈ రూపాయి బలహీనత ప్రభావం స్టాక్ మార్కెట్ లేదా ఫారెక్స్ వ్యాపారులకే పరిమితం కాదు. ఇది ఇప్పుడు సాధారణ భారతీయ కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తోంది. పెట్రోల్-డీజిల్ ధరలు, EMIలతో పాటు ట్యూషన్ ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు కూడా భారీగా పెరిగే అవకాశముంది.
సామాన్యుడిపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఇండియా తన చమురు అవసరాలలో 90శాతం దిగుమతి చేసుకుంటుంది. అంతేకాకుండా, ఎలక్ట్రానిక్స్, ఎరువులు, వంట నూనె లాంటి ముఖ్యమైన వస్తువుల కోసం భారత్ విదేశీ సరఫరాదారులపై ఆధారపడుతున్నాం. రూపాయి బలహీనపడిన సమయంలో దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు పెరుగుతాయి. అంటే మీరు ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దీని అర్థం మీరు రానున్న రోజుల్లో కొనుగోలు చేయాలని భావించిన ఐఫోన్, రిఫ్రిజిరేటర్ లేదా కారు ధరలు పీక్స్‌కు వెళ్లవచ్చు.
విదేశీ విద్య మరింత భారం?
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు 2023తో పోల్చితే ఏటా రూ.5,00,000 నుంచి రూ.1,00,000 వరకు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు వార్షిక ట్యూషన్ ఫీజు సంవత్సరానికి $50,000 ఉండగా, గతంలో డాలర్‌కు రూ.80 చొప్పున రూ.40 లక్షలు ఉండేది, ఇప్పుడు రూ.45 లక్షలు ఖర్చవుతుంది. దీని అర్థం రూ.5 లక్షల ప్రత్యక్ష పెరుగుదల. ఇది మధ్యతరగతి కుటుంబాలకు అనేక నెలల ఆదాయానికి సమానం. విద్యా రుణాలపై భారం కూడా పెరుగుతుంది. డాలర్‌కు 80 రూపాయల చొప్పున తీసుకున్న డాలర్ రుణాలను తిరిగి చెల్లించే విద్యార్థులు ఇప్పుడు రూపాయి పరంగా 12-13% ఎక్కువ చెల్లించాలి.

రూపాయి ప్రయాణం: నాటి ‘ICU’ విమర్శల నుంచి నేటి ₹88/$ వరకు – వాస్తవాలు, వాదనలు
Festival Sales: భలే మంచి మొబైల్ బేరాలు,, 10 వేల లోపు నుండి 20 వేల లోపు మంచి మొబైల్ ఫోన్స్!!!!