నమస్తే.. ఈరోజు నేను రాయబోయే వార్త.. నిజంగా మనసును బాధించే వార్త. మనం రోజూ గడవాలంటే మనకి ముఖ్యమైన వనరు నీరు.. నిజానికి చాలా మంది ఇళ్లలో ట్యాప్ ఓపెన్ చేయగానే వాటర్ వస్తాయి, వాష్‌రూమ్‌లోనూ వస్తాయి, కిచెన్‌లో వస్తాయి.. అది మనకు ఒక అలవాటు అయిపోయింది. కానీ సడన్‌గా అలా ట్యాప్‌లో నీరు రావటం ఆగిపోతే…ఒకసారి ఊహించుకోండి. అసలు నీరు అనే వనరు మనకు లేకుండా పోతే.. అవును ఆ రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది…దానికి ఉదాహరణ ఒక దేశం..అది ఇరాన్(Iran). అక్కడి పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందంటే.. ఆ దేశం ఎండిపోతున్న తీరు అంతరిక్షం నుంచి తీసిన ఉపగ్రహ చిత్రాల్లో కూడా కనిపిస్తోంది. ఒకప్పుడు నిండుగా ఉన్న సరస్సులు.. ఇప్పుడు పగుళ్లు పడిన నేల. నీటితో మెరిసే డ్యామ్‌లు.. ఇప్పుడు నల్లగా కాలిపోయిన గుంటల మాదిరిగా కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలు చూస్తే.. ప్రతీ మనిషికి కన్నీళ్లును తెప్పిస్తున్నాయి.
అమీర్ కబీర్ డ్యామ్ ఇప్పుడు కేవలం 8% నీటితో మాత్రమే ఉంది
అక్కడి ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తే మనసు తట్టుకోలేదు. ఊహించండి.. ఉదయం లేవగానే ట్యాప్ తిప్పగానే టక్కున నీరు రావాలి. కానీ అక్కడ.. చప్పుడు కూడా లేదు. మొత్తం కదిలించినా.. ఒక్క చుక్క కూడా రాదు. చిన్న పిల్లలు.. బెడ్ నుంచి లేచి అమ్మను అడుగుతున్నారట. “అమ్మా.. ఇవాళ నీళ్లు వస్తాయా?” అమ్మకు సమాధానం లేదు. రోజులు గడుస్తున్నా ఆమె చేతిలో బకెట్ మాత్రమే ఉంది. నీరు మాత్రం లేదు. చాలా కాలనీల్లో మూడు రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు వస్తున్నాయి. కొన్ని చోట్ల.. వారం రోజులైనా రావు. ట్యాంకర్ వస్తే.. ప్రజలు బకెట్లతో, డబ్బాలతో, చిన్న చిన్న సీసాలతో పరుగులు తీస్తున్నారు. ఒక బకెట్ నీటి కోసం వారు తీస్తున్న ఆ పరుగులు.. కొన్ని సార్లు గొడవలుగా, హడావుడిలుగా మారుతున్నాయి.
ఒకప్పుడు జీవితానికి ఆధారం అయిన లత్యాన్ డ్యామ్.. ఇప్పుడు 9% నీరు మాత్రమే మిగిలి, పూర్తిగా ఎండిపోయిన నది పాదముద్రలు మాత్రమే చూపిస్తోంది.
చిన్న పిల్లలు ఏడుస్తున్నారు.. పెద్దవాళ్లు తల్లడిల్లుతున్నారు. ఒక చుక్క నీరు అంటే వాళ్లకు నేటి రోజుల్లో ప్రాణం. ఈ దారుణ పరిస్థితికి కారణం ఒక్కటో రెండో కాదు. వేడి పెరిగింది, వర్షాలు తగ్గిపోయాయి.. నీటిని సరిగ్గా నిర్వహించలేదు.. వృధా చేసుకుంటూ పోయారు.. భూగర్భ జలాలను అదుపు లేకుండా తాగేశారు. ఇలా ఒక దేశం మొత్తానికి నీటి ఆశలు ఆరిపోయే స్థితికి చేరాయి.
30 లక్షల జనాభా ఉన్న మష్హద్ నగరం… కేవలం 3% నీటిపై నిలబడి ఉంది.
ఇక ఇరాన్‌లో జరుగుతున్నా ఈ కథ మన దగ్గరికి చాలా దగ్గరగా ఉంది. ఏ దేశమయినా నీటిని నిర్లక్ష్యం చేస్తే.. ఇరాన్‌లా మారిపోవడానికి పెద్ద సమయం పట్టదు. అక్కడ పిల్లలు అడుగుతున్న మాట… రేపు మన పిల్లలు అడగకూడదు.
దేశంలోని డ్యామ్‌లు దాదాపు 10% పూర్తిగా ఎండిపోయాయి.
ట్యాప్ ఆన్ చేయగానే నీరు రావడం..సాధారణ విషయం కాదు.. అది ఒక వరం. మనం ప్రతిరోజూ సాధారణంగా తీసుకునే ఈ వరం, ఒక దేశానికి ఇప్పుడు గుర్తుగా కూడా మిగలలేదు. ట్యాంకర్ రాని రోజు.. అక్కడ జీవితం ఆగిపోతుంది. మనకు ఈ కథ ఒక్క హెచ్చరిక అని మీకు ఇప్పటికైనా అర్థమైతే.. నీటిని ఆదా చేద్దాం.. వృథా చేయకండి. ఎందుకంటే నీరు అంటే జీవితం. జీవితం ఎండిపోతే మనమే ఎండిపోతాం. మనకోసం కాకపోయినా రేపటి మన పిల్లల భవిష్యత్తుకి నీరు మిగలాలంటే మనం పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి గ్రహించండి…నీరు ప్రకృతి మనకిచ్చిన వరమండీ…!
ALSO READ: మృత్యు ఒడిలోకి 313మంది..! ఆ దేశంలోనే వరదలు, భూకంపాలు ఎందుకు?

America-Israel: అమెరికాకు కావాల్సింది ఇదే.. అణు బాంబుల కథ పచ్చి అబద్ధం..!
Israel Vs Hamas: ‘నరక ద్వారాలు తెరుచుకుంటాయి..’ ఇజ్రాయెల్ బరితెగింపు చర్యలు.. నెతన్యాహు నెక్ట్స్ టార్గెట్ ఇరాన్?
One Year of Gaza War: అక్టోబర్ నరమేధం.. ఎవరిది అసలైన ఉగ్రవాదం?
Israel Atrocities: ఇజ్రాయెల్ మారణహోమం.. చిన్నారులను కూడా వదలని కర్కశత్వం!