మనలో చాలామంది ఒక కామన్ సమస్యతో బాధపడుతుంటారు. ఎంత డైట్ చేసినా, ఎంత జిమ్‌కి వెళ్లినా.. చివరకు ముఖం తగ్గుతుంది, చేతులు తగ్గుతాయి కానీ.. పొట్ట మాత్రం అలాగే ఉంటుంది. ఇంతకీ చాలామందిలో బెల్లీ ఫ్యాట్ ఎందుకు తగ్గదు? దీనికి సైన్స్ చెప్పే సమాధానాలు చాలానే ఉన్నాయి. మన శరీరంలో స్ట్రెస్ పెరిగినప్పుడు కార్టిసోల్(Cortisol) అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసోల్‌కి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. కొవ్వును డైరెక్టుగా బెల్లీ వద్దే స్టోర్ చేయడం. అంటే మనం ఎలాంటి స్ట్రెస్‌లో ఉన్నామన్నది మన పొట్ట చెప్పేస్తుంది. వర్క్ టెన్షన్, ఫైనాన్సియల్ టెన్షన్, ఫ్యామిలీ టెన్షన్.. ఏది అయినా పొట్ట కొవ్వు మీదనే మొదట ప్రభావం చూపిస్తుంది.
నిద్ర చెడిపోతే..:
ఇక నిద్ర కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజుకు 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతే.. బాడీలో గెర్లిన్ అనే హంగర్ హార్మోన్ పెరుగుతుంది. దాని వల్ల మనకు కంట్రోల్ చేయలేనంత ఫుడ్ క్రెవింగ్స్ వస్తాయి, ముఖ్యంగా స్వీట్స్, టీ, బెకరీ, రైస్ లాంటి ఆహారం కావాలనిపిస్తుంది. ఇలా స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంటే ఏ డైట్ చేసినా బెల్లి ఫ్యాట్ తగ్గడం చాలా స్లో. వీటితో పాటు మరో హిడెన్ ఫాక్టర్ కూడా ఉంది. అదే ఇన్సులిన్ రెసిస్టన్స్. ఎక్కువగా తీపి పదార్థాలు లేదా హై-కార్బ్ ఫుడ్స్ తింటూ పోతే బాడీ ఇన్సులిన్‌ను పెద్దగా పట్టించుకోకుండా ఉంటుంది. అప్పుడు మనం తిన్నదంతా అబ్డోమెన్ ఫ్యాట్ వద్ద స్టోర్ అవుతుంది. ఈ స్టేజ్‌లో ఉన్నవాళ్లు ఎంత వర్కవుట్ చేసినా మొదట తగ్గేది బెల్లి కాదు.
మహిళల్లో సమస్య ఎక్కువ:
ఇక మహిళల్లో హార్మనల్ ఇమ్‌బ్యాలెన్స్ ఉన్నప్పుడు పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉంటుంది. PCOS, థైరాయిడ్, ఇస్ట్రోజన్ ఇమ్‌బ్యాలెన్స్ ఉన్నప్పుడు బాడీ బెల్లి వద్ద ఉన్న ఫ్యాట్‌ను రిలీజ్ చేయడానికి ఇష్టపడదు. అందుకే చాలామంది లేడీస్ ఎంత వ్యాయమం చేసినా ముందుగా హ్యాండ్, లెగ్ ఫ్యాట్ తగ్గుతాయి కానీ టమ్మీ మాత్రం మొండిగా అలాగే ఉంటుంది. మరొక అపోహ ఏంటంటే, క్రంచస్ చేస్తే పొట్ట తగ్గుతుందనుకోవడం. ఫ్యాట్ అన్నది మొత్తంగా బాడీ నుంచే తగ్గుతుంది. క్రంచస్ అనేవి కండలను బలంగా చేస్తాయి కానీ కొవ్వును కరిగించవు. కాబట్టి బెల్లి తగ్గాలంటే ఓవరాల్‌గా మీ లైఫ్‌స్టైల్‌ను మార్చాల్సిందే.
ఏజ్ ఫ్యాక్టర్:
వయసు కూడా మెటబాలిజమ్‌పై ప్రభావం చూపుతుంది. 30ఏళ్ల తర్వాత మెటబాలిజమ్ ప్రతి సంవత్సరం కొద్దిగా స్లో అవుతుంది. వయసు పెరుగుదలతో పొట్ట చుట్టూ కొవ్వు నిల్వ అవ్వడం సహజం. అయితే బెల్లి ఫ్యాట్ తగ్గడం అసాధ్యం కాదు. తగినంత నిద్ర, చక్కెర తగ్గించడం, ప్రతి రోజు కొంచెం బ్రిస్క్ వాక్ చేయడం, డైట్‌లో ప్రొటీన్ పెంచడం, ముఖ్యంగా స్ట్రెస్ తగ్గించడం. ఇదంతా కలిసి పని చేస్తే బెల్లి చాలా వేగంగా మారుతుంది. రెండు నుంచి మూడు వారాల్లో మీరు మార్పులు చూస్తారు.
ALSO READ: ప్రపంచాన్ని నడిపించే ఒక్కే ఒక్క శక్తి ఎంపతి.. బండరాళ్ల లాంటి మనసులను కూడా కరిగించగలదు!
మొత్తానికి బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడం అంత ఈజీ కాదన్నది నిజమే కానీ.. మన బాడీ ఎలా వర్క్అవుతుందో అర్థం చేసుకుంటే దాన్ని తగ్గించడం చాలా సులభం. నిద్ర, షుగర్, స్ట్రెస్… ఈ మూడు కంట్రోల్‌లో ఉంటే ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.. చివరకు మన కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా పెరుగుతాయండి!
ALSO READ: బాధలో కలిసి కన్నీరు కార్చేదే నిజమైన ప్రేమ.. నీ మౌనాన్ని వినగలిగే ఆ ఒక్క మనసు ఎక్కడ దొరుకుతుంది?

Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?
Relationships: మనల్ని మనమే మరిచిపోయిన కథ.. బతుకుతున్నామా లేదా నటిస్తున్నామా?
Relationship Tips: మీ లైఫ్ పార్ట్నర్తో చెప్పకూడని నాలుగు విషయాలు.. ఇది సిక్రెసీ కాదు ప్రైవసీ!
Pulse Polio: రెండే రెండు చుక్కలు.. మిస్ చేసుకోవద్దు..! చిన్న తప్పు… పెద్ద నష్టం..! ఇది కేవలం వార్త కాదు.. హెచ్చరిక..!