మీ ఫోన్ రింగ్ అవుతోంది… స్క్రీన్ మీద ‘బ్యాంక్’ అని కనిపిస్తోంది… గుండె జోరుగా కొట్టుకుంటోంది… ఎత్తాలా వద్దా అని ఆలోచిస్తున్నారు… ఎందుకంటే గత నెల EMI కూడా పూర్తిగా కట్టలేదు… ఇప్పుడు మళ్లీ కొత్త లోన్ తీసుకుని పాత లోన్ మూసేయాలి అనుకుంటున్నారు… ఇది ఒక్కరోజు సమస్య కాదు… లక్షల మంది ఇండియన్లు రోజూ ఈ భయంతోనే మేలుకుంటున్నారు. నెలకో అప్పుతో ప్రశాంతత లేకుండాపోయింది. ఈ టెన్షన్లతో రోగాలు కూడా వస్తాయి. అసలు ఈ ‘Debt Trap‘ అంటే ఏంటి? దీన్నుంచి బయటపడటం నిజంగా సాధ్యమేనా?
Debt Trap అంటే?
మీరు తీసుకున్న అప్పు మీ ఆదాయం కంటే ఎక్కువైపోతే.. పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పు తీసుకుంటూ.. వడ్డీ పైన వడ్డీ కడుతూ.. ఒక గోడ లాంటి సైకిల్‌లో చిక్కుకుపోవడమే Debt Trap. ఇప్పుడు ఇండియాలో క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్, బై నౌ పే లేటర్ యాప్స్ వల్ల ఈ సమస్య రోజురోజుకీ పెరిగిపోతోంది.. RBI గణాంకాల ప్రకారం 2024లోనే 11 కోట్ల మంది ఇండియన్లు ఏదో ఒక రకమైన అప్పులో ఉన్నారు.. అందులో చాలా మంది ఈ ట్రాప్‌లోనే చిక్కుకున్నారు. ఇప్పుడు మనం దీన్నుంచి బయటపడే రియల్, ప్రాక్టికల్ మార్గాలను తెలుసుకోవాలి.
మొదటి స్టెప్.. ఈ సమస్య ఉందని ఒప్పుకోవడం.. మీరు ప్రతి నెలా క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేకపోతున్నారా… ఒక లోన్ తీర్చడానికి మరో లోన్ తీసుకుంటున్నారా.. బ్యాంక్ నుంచి కాల్స్ వస్తున్నాయా… ఇవన్నీ డేంజర్ సైన్స్… వీటిని ఇగ్నోర్ చేస్తే మాత్రం పరిస్థితి మరింత దారుణం అవుతుంది.
రెండో స్టెప్.. ఒక రియలిస్టిక్ బడ్జెట్ తయారు చేసుకోండి.. మీ జీతం ఎంత వస్తుంది.. ఎంత ఖర్చు అవుతుందో రాసుకోండి. ఇప్పుడు ఖర్చుల్ని రెండు భాగాలుగా విడదీయండి. తప్పనిసరి ఖర్చులు.. రెంట్, కిరాణా, కరెంట్ బిల్లు… మిగతావి నాన్-ఎసెన్షియల్.. సినిమా, షాపింగ్, బయట తినడం.. ఇక్కడే చాలా మంది ఓడిపోతారు.. నాన్-ఎసెన్షియల్ ఖర్చుల్ని తగ్గించి… ఆ డబ్బుని అప్పు తీర్చడానికి పెట్టండి.. ముఖ్యంగా వడ్డీ ఎక్కువ ఉన్న క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ ముందు క్లియర్ చేయండి.
మూడో స్టెప్… ఇక నుంచి కొత్త అప్పు అస్సలు తీసుకోకండి.. ఎంత కష్టమైనా.. ఎంత టెంప్టేషన్ ఉన్నా.. ‘ఈ నెల EMI కట్టలేకపోతే ఒక చిన్న లోన్ తీసుకుందాం’ అని అనుకుంటే… అదే మీ జీవితంలో అతి పెద్ద తప్పు అవుతుంది.. అందుకని పార్ట్ టైం జాబ్ చేయండి… పాత బట్టలు, మొబైల్స్, ఏదైనా అమ్మండి.. కానీ కొత్త అప్పు మాత్రం కాదు.
నాలుగో స్టెప్.. అన్ని అప్పుల్ని ఒక్కటే లోన్‌లో మార్చుకోండి… దీన్ని డెట్ కన్సాలిడేషన్ అంటారు… ఉదాహరణకి మీ దగ్గర 4 క్రెడిట్ కార్డ్స్ ఉంటే.. అవన్నీ 24–40% వడ్డీతో ఉంటాయి… వీటిని మూసేసి.. ఒక పర్సనల్ లోన్ లేదా గోల్డ్ లోన్ తీసుకుని 11–14% వడ్డీకే క్లియర్ చేయొచ్చు.. నెలకి ఒకే EMI కడతారు… మనసు కూడా రిలాక్స్‌గా ఉంటుంది… చాలా బ్యాంకులు ఇలాంటి స్కీమ్స్ ఇస్తున్నాయి.
చివరి స్టెప్.. ఒంటరిగా కష్టపడటం కష్టమైతే.. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. ఇండియాలో డిజిట్, ఫ్రీడం వంటి యాప్స్ ఉన్నాయి. అక్కడ ఫ్రీ కౌన్సెలింగ్ ఇస్తారు. వాళ్లు మీ బ్యాంక్‌తో మాట్లాడి EMI తగ్గిస్తారు. కొందరికి వడ్డీ కూడా తగ్గిస్తారు. ఇది అస్సలు సిగ్గుపడాల్సిన విషయం కాదు…
ఇక భవిష్యత్తులో ఈ ట్రాప్‌లో పడకూడదు అంటే.. ఎప్పుడూ మీ ఆదాయం కంటే తక్కువ అప్పు మాత్రమే తీసుకోండి. క్రెడిట్ కార్డ్ బిల్ పూర్తిగా కట్టకపోతే వడ్డీ భయంకరంగా పెరుగుతుంది. అందుకే ప్రతి నెలా ఫుల్ పేమెంట్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఎమర్జెన్సీ ఫండ్ తయారు చేసుకోండి. కనీసం 6 నెలల ఖర్చు అంత డబ్బు పక్కన పెట్టుకుంటే ఎప్పుడూ అప్పు అవసరం పడదు.
ALSO READ: PPF బెటరా? FD బెటరా? మీ ఫైనాన్షియల్ గోల్స్‌కి ఏది సరిపోతుంది?

ITR: ఇన్కమ్ టాక్స్ రిఫండ్ ఇంకా రాలేదా? ఇలా చేయండి!
Business Ideas: ఈ 6 బిజినెస్ ఐడియాస్తో మీరు లక్షలు సంపాదించవచ్చు.. పెట్టుబడి కూడా చాలా తక్కువ!
Investment Ideas: PPF బెటరా? FD బెటరా? మీ ఫైనాన్షియల్ గోల్స్‌కి ఏది సరిపోతుంది?
Loan Offers: వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్.. అమెజాన్, ఫ్లిప్‌కార్టు నుంచి బిజినెస్ లోన్స్.. పూర్తి వివరాలివే!
Aadhar Update: కాలు బయటకు పెట్టాల్సిన అవసరమే లేదు.. ఇంటి నుంచే మీ మొబైల్ నంబర్‌తో పాటు ఆధార్ అడ్రెస్‌ను ఇలా ఇలా అప్డేట్ చేసుకోండి!
Gold Investment: బంగారంలో పెట్టుబడి పెట్టడం ఎలా? ఉన్న ఆప్షన్స్ ఏంటి?