సముద్రం చేతుల్లో ఊగిసలాడే ఇండోనేషియా(Indonesia) ఎంతో అందంగా కనిపిస్తుంది కానీ.. ఈ అందమైన నేల చుట్టూ నిత్యం భయం అల్లుకోని ఉంటుంది. ఉన్నట్టుండి గాలి గట్టిగా ఊపిరి తీసుకున్నట్టు సముద్రం లేచి పడుతుంది. కొన్నిసార్లు భూమి తన చెయ్యి కంపించినట్టు అల్లకల్లోలంగా కొట్టుకుంటుంది. అక్కడి కొండలు పెద్ద పెద్ద నీడల్లా నిలబడి ఉంటాయి కానీ లోపల ఏదో బాధగా గుసగుసలాడుతున్నట్టు అనిపిస్తుంది.
నిన్నటికి నిన్న సుమత్రా మీద మబ్బులు నల్లటి తెరలాగా పడిపోయాయి. నీరు పర్వతాల నుంచి గుర్రుమంటూ దూసుకువచ్చింది. ఇళ్లు గాలిలో ఎగిరే ఆకుల్లా తేలిపోయాయి. రోడ్లు అదృశ్యమయ్యాయి. అక్కడి పిల్లలు భయంతో అమ్మా అని కేకలు పెట్టారు. ఎంతటి నీడైనా వారికి ఆశ్రయం ఇవ్వలేకపోయింది. ఆ నీటిలో ఎన్నో కుటుంబాలు దారి తప్పాయి. ఎందరో మనుషులు కనిపించకుండా పోయారు.
ALSO READ: షేక్.. షేకాడిస్తోంది.. నెల రోజుల్లో 1400 భూకంపాలు.. ఆ దేశానికి ఏమైంది?
భారీ ప్రాణనష్టం:
ఈ నేల ఎందుకు ఇంత బాధ పడుతోంది అని ఆకాశం కూడా ఆలోచించినట్టుగా కనిపించింది. సముద్ర అలలు ఒక తల్లి రోదించినట్టుగా మధ్య రాత్రిలో శబ్దం చేశాయి. గుండెను కొంచెం కొంచెం చించుతూ వచ్చిన ఆ రాత్రి ఇండోనేషియాకు మర్చిపోలేని గాయాన్ని మిగిల్చింది. ఆ గాయంలో ఒక పెద్ద నిజం ఉంది. ఆ వరదలు, మట్టిచరియల్లో మొత్తం 303 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 279 మంది కనిపించకుండా పోయారు. ఉత్తర సుమత్రాలో 166 మంది చనిపోగా.. 143 మంది ఆచుకీ గల్లంతైంది. పడమర సుమత్రాలో 90 మంది మరణిస్తే.. 85 మంది జాడ తెలియలేదు.
ఇండోనేషియాలో ప్రకృతి విపత్తులు ఎందుకు?
ఇంతటి ప్రమాదాలు ఇండోనేషియాను ఎందుకు వెంటాడుతున్నాయి అనే ప్రశ్నకు సమాధానం నేల క్రిందనే దాగి ఉంది. ఇండోనేషియా ప్రపంచంలోనే ప్రమాదకరమైన అగ్ని వలయం అనే ప్రదేశంపై ఉంది. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్(Ring of Fire) అంటారు. ఈ ప్రాంతంలో భూమి పెద్ద పెద్ద పలకల్లా పగిలి ఉంటుంది. ఈ పలకలు ఎప్పుడూ ఒకదానితో ఒకటి నెమ్మదిగా తోసుకుంటూ కూర్చుంటున్నాయి. ఈ తోపులో భూమి ఒక్కసారిగా ఊగిపోతుంది. అలా భూకంపాలు వస్తాయి. ఇండోనేషియాలో ప్రతి సంవత్సరం చిన్న పెద్ద భూకంపాలు వందల సంఖ్యలో జరుగుతాయి. చాలా సార్లు ఇవి సముద్రం కింద పుడుతాయి కాబట్టి నీరు పైకి ఎగిసి వస్తుంది. అప్పుడు సునామి లాంటి ప్రమాదాలు సంభవిస్తాయి.
వరదలు తరుచుగా ఎందుకు వస్తున్నాయ్?
భూకంపాలకే కాదు వరదలకూ ఇక్కడ ఉన్న భౌగోళికతే కారణం. ఇండోనేషియా వాతావరణం చాలా తేమగా ఉంటుంది. ఇక్కడ భారీ వర్షాలు తరచుగా పడుతాయి. కొండలు పుష్కలంగా ఉండడంతో మట్టి తడి అవుతుంది. ఎక్కువ వర్షం పడితే మట్టి చరియలు పడతాయి. ఇళ్ల మీద రోడ్ల మీద గ్రామాల మీద రాలిపోతాయి. ఇటు వర్షం కొంచెం ఎక్కువైతే వెంటనే వరదలు వస్తాయి. అలాంటి వరదలు సుమత్రాలో జరిగింది. గాలి నుంచి నీరు వరకు ప్రతి సహజ శక్తి ఒక్కసారిగా కోపం తెచ్చుకుని నేల మీద పడిపోయింది.
ఇటు ఇండోనేషియా అంత ప్రమాదాల్లో ఉన్నా అక్కడి ప్రజలు మాత్రం ధైర్యంగా నిలబడుతున్నారు. రక్షక బలగాలు నీటిలో మునిగిన మార్గాల్లో నడుస్తున్నారు. కనిపించని వారికి పిలుపునిస్తున్నారు. పిల్లలకు భయం వద్దు అని చెబుతున్నారు. గ్రామాలు తిరిగి ఎలా కట్టాలి? ఇళ్లు ఎలా బలంగా చేయాలి? భూమి కంపించినా మనం ఎలా రక్షించుకోవాలి అనే పాఠాలు అక్కడి పాఠశాలల్లో పిల్లలకు నేర్పుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇండోనేషియా ప్రకృతి కోపాన్ని ఎదుర్కొంటున్నా ప్రజలు మాత్రం ఆశను చేతుల్లో బిగించి ముందుకు సాగుతున్నారు.
ALSO READ: తెలంగాణ టూరిజం గోవా టూర్ ప్యాకేజ్.. న్యూఇయర్‌కి భలే ఆఫర్ బాస్.. పూర్తి వివరాలివే!

Asia Climate Change: 2 కారణాలు.. గాల్లో లక్షల ప్రాణాలు..సైంటిస్టుల షాకింగ్ స్టడీ!
Railway Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. లక్షకు పైగా రైల్వే ఉద్యోగల భర్తీపై కీలక అప్డేట్!
Disasters in Asia: వీధిన పడ్డ బతుకులు.. ఆసియాపై పగబట్టిన ప్రకృతి.. లక్షలమంది బలి!
New Year Plans: తెలంగాణ టూరిజం గోవా టూర్ ప్యాకేజ్.. న్యూఇయర్‌కి భలే ఆఫర్ బాస్.. పూర్తి వివరాలివే!
Climatic Change: వాతావరణ మార్పులతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం..ఈ రాష్ట్రానికి ఏమైంది?
Aadhar Update: కాలు బయటకు పెట్టాల్సిన అవసరమే లేదు.. ఇంటి నుంచే మీ మొబైల్ నంబర్‌తో పాటు ఆధార్ అడ్రెస్‌ను ఇలా ఇలా అప్డేట్ చేసుకోండి!